Best Drinks: సాధారణంగా మనం రోజు తీసుకునే ఆహారం వలన శరీరంలో వ్యర్థాలు చేరుతుంటాయి. ఈ వ్యర్థాలను బాడీ ఎప్పటికప్పుడు బయటకు పంపేస్తుంది. అలాగే రోజు అధికంగా ఆహారం తీసుకుంటే అదంతా కొవ్వుగా మారుతుంది. దీంతో శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ పెరిగిపోతుంటాయి. ఈ కారణంగా రక్తనాళాల్లో అడ్డంకులు ఏర్పడి హార్ట్ ఎటాక్ లు వచ్చి ప్రాణాపాయ పరిస్థితులు కూడా ఎదురవుతాయి.
అయితే శరీరంలో ఉన్న కొలెస్ట్రాల్ ను బయటకు పంపాలంటే ఈ డ్రింక్ తాగితే సరిపోతుంది. ఇంతకీ ఆ డ్రింక్ ఏంటి? అదేలా కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుందనే విషయాలను మనం తెలుసుకుందాం.
మనకు వచ్చే ప్రతి ఆరోగ్య సమస్యకు ఆయుర్వేదంలో పరిష్కారం దొరుకుతుందని నిపుణులు చెబుతున్నారు. అధిక కొవ్వు, బరువుతో బాధపడేవారు ప్రతిరోజూ వ్యాయామంతో పాటు జామ కాయ రసం తాగాలని తెలియజేస్తున్నారు. దీని వలన త్వరగా బరువు తగ్గడమే కాకుడా రోగ నిరోధక శక్తి పెరిగి జలుబు, దగ్గు వంటి అనారోగ్య సమస్యలు రావు.
కాఫీ, టీ ఎక్కువగా తాగడంలో వలన ఆరోగ్యం దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. ఈ క్రమంలో టీ అలవాటు ఉన్న వారు ఇకపై ఉదయాన్నే ఉసిరి టీ తాగితే ఆరోగ్యంగా ఉండవచ్చని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అలాగే ఉసిరిలో విటమిన్ సి పుష్కలంగా ఉండటం వలన జుట్టు, కళ్లు మరియు చర్మానికి మేలు కలిగిస్తుంది. ఉసిరి టీ తాగడం వలన పొట్టలోని టాక్సిన్లన్నీ బయటకు వెళ్లిపోతాయి.
ఉసిరి టీ చేయాలంటే.. ముందుగా ఒక కుండలో రెండు కప్పుల నీటిని మరిగించి అందులో అల్లం మరియు 4 లేదా 5 తులసి ఆకులను వేయాలి. తరువాత ఒక చెంచా జామకాయ పొడిని నీళ్లలో వేసి మరగబెట్టాలి. నీళ్లు సగానికి తగ్గిన తరువాత గ్లాసులో పోసుకుని సర్వ్ చేసుకోవాలి. అదేవిధంగా జామకాయ టీ కోసం జామకాయ ముక్కలతో పాటు చిన్న అల్లం ముక్కను నీటిలో వేసి మరిగించాలి. తరువాత అర టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కలపాలి. ఆ తరువాత సర్వ్ చేసుకోవాలి.
ఈ విధంగా జామ లేదా ఉసిరి టీ తాగడం వలన త్వరగా బరువు తగ్గుతారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు.