Homeలైఫ్ స్టైల్Fennel Seeds: ఒత్తిడిలో ఉన్నారా ?రూపాయితో ఇది తినండి..తక్షణమే ఒత్తిడి మాయం !

Fennel Seeds: ఒత్తిడిలో ఉన్నారా ?రూపాయితో ఇది తినండి..తక్షణమే ఒత్తిడి మాయం !

Fennel Seeds: సోంఫు ప్యాకెట్ రూపాయికి కూడా దొరుకుతుంది. అంత చవకైనది కాబట్టే దాని గొప్పతనానికి గుర్తింపు రాకుండా పోయింది. మీకు తెలుసా ? సోంఫు ఒత్తిడిని దూరం చేస్తుంది. భోజనానంతరం సోంపు గింజలు తినే అలవాటు చాలామందికి ఉంటుంది. అవి దుర్వాసనలను దూరం చేయడమే కాదు చాలాసేపటికి వరకూ నోటిని తాజాగా ఉంచుతుంది సోంపు. నిజానికి ఈ సోంపు గింజలు ఆరోగ్యానికి చాలా మంచివి. వీటి నుంచి శరీరానికి తక్షణ శక్తి అందుతుంది.

Fennel Seeds
Fennel Seeds

భోజనం తర్వాతే కాదు ముందూ తినొచ్చు. సోంపులో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. కొవ్వు పెంచే కార్బోహైడ్రేట్లను ఇవి దూరం చేస్తాయి. శరీరంలో వ్యర్థాలు పేరుకుపోకుండా చూస్తాయి. వీటిలో ఉండే పీచు జీర్ణవ్యవస్థ పనితీరుని మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తుంది. అలాగే జీవక్రియల రేటు సక్రమంగా ఉండేలా చూస్తుంది. వీటిలో ఉండే పీచు పదార్థాలతో రక్తంలో కొలెస్ట్రాల్ నియంత్రణలో ఉంటుంది.

Also Read: ఉదయం ఆలస్యంగా నిద్ర లేస్తున్నారా… అయితే ఈ సమస్యలు భారీన పడినట్లే..!
కనుక గుండెకు మేలే. అంతేకాదు సోంపును తరచూ తీసుకోవడం వల్ల నాడీ వ్యవస్థ బలపడుతుంది. అలానే చెడు కొవ్వును సోంపు లోని పోషకాలు గ్రహిస్తాయి. వీటిల్లోని కాపర్ ఎర్ర రక్త కణాల వృద్ధి కి తోడ్పడుతుంది. జింక్ శారీరక ఎదుగుదలకు, అవయవాలు దృఢంగా ఉండటానికీ తోడ్పడుతుంది. రక్తపోటుతో బాధపడేవారు సోంపు గింజల్ని రోజులో ఒకటి రెండుసార్లు నమిలితే మంచిది. అలా చేయడం వల్ల పొటాషియం శరీరానికి అంది, రక్తపోటు అదుపులో ఉంటుంది.

కప్పు సోంపులో ఇరవై శాతం పైనే విటమిన్ ‘సి’ ఉంటుంది. అది రోగనిరోధక శక్తిని పెంచడానికీ, చర్మ కణజాలం దృఢపడి, గాయాలైనప్పుడు త్వరగా మానిపోవడానికి దోహదం చేస్తుంది. సోంపు గింజల్లోని ఫ్లవనాయిడ్లు ఒత్తిడిని దూరం చేస్తాయి. అందుకే.. మీరు ఒత్తిడిలో ఉంటే వెంటనే సోంపు తినండి.

Also Read: గాలిపటాల పండుగొచ్చేసింది.. ఈ ఏడాది ఆ కైట్స్ చాలా ఫేమస్!

Sekhar
Sekhar
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
RELATED ARTICLES

Most Popular