Cinnamon Benefits: మనకు దాల్చిన చెక్కతో కూడా ఎన్నో లాభాలున్నాయి. దాల్చిన చెక్క బెరడు సువాసన వస్తుంది. దీంతో దీన్ని వంటల్లో ఎక్కువగా వాడుతాం. ఇంకా టీ, స్నాక్స్ లలో కూడా దీన్ని ఉపయోగిస్తాం. ఇందులో ఉండే ఔషధ గుణాలతో మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది సబ్బులు, పేస్టులు, క్రీములు వంటి వాటిల్లో కూడా దీన్ని వాడుతారు. ప్రతిరోజు దీన్ని తీసుకోవడం వల్ల మనకు కొన్ని రోగాలు దరిచేరవని ఆయుర్వేద వైద్యులు చెబుతున్నారు. దీని వల్ల ఆరోగ్య ప్రయోజనాలెన్నో మనకు కలుగుతాయి.

ముఖంపై ఏర్పడే కురుపులు, దద్దుర్లు, మొటిమలను కూడా ఇది దూరం చేస్తుంది. ఒక వంతు దాల్చిన చెక్క పొడి, మూడు వంతుల తేనె కలిసి రాసుకుని 25 నిమిషాల తరువాత నీటితో కడిగిస్తే సరిపోతుంది. దీంతో రక్తసరఫరా కూడా మెరుగుపడుతుంది. చర్మం మెరిసేందుకు కూడా ఇది తోడ్పడుతుంది. దాల్చిన చెక్క పొడిని నిమ్మరసం, పెరుగుతో కలిపి ముఖం, మెడ, వెనుక భాగాలకు రాసుకుని ఆరే వరకు గోరువెచ్చని నీటితో కడుక్కోండి. చర్మంపై జిడ్డు, మురికి, దుమ్ము, మచ్చలు పోతాయి. మూడు రోజుల్లో ముడతలు కూడా మాయమవుతాయి.
రెండు స్పూన్ల దాల్చిన చెక్క పొడి, రెండు స్పూన్ల తేనె కలిపి మోకాళ్ల నొప్పులు ఉన్నట్లయితే అక్కడ రాసుకుంటే మూడు రోజుల్లో ఫలితం కనిపిస్తుంది. పొట్టలో ఉన్న సమస్యలు పోగొట్టేందుకు కూడా ఇది సహకరిస్తుంది. రెండు టీ స్పూన్ల తేనె, పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడిని కప్పు గోరువెచ్చని నీటితో కలిపి ఉదయం, సాయంత్రం తాగితే కీళ్ల సమస్యలు తొలగిపోతాయి. జలుబు, గొంతు సమస్యలున్నట్లయితే పావు టీ స్పూన్ దాల్చిన చెక్క పొడి, ఒక టీ స్పూన్ తేనెతో కలిపి తీసుకుంటే వెంటనే మాయమవుతాయి.

మధుమేహంతో బాధపడేవారికి కూడా ఇది మేలు చేస్తుంది. దాల్చిన చెక్క పొడిని రోజు నీటిలో కలిపి తీసుకుంటే చెడు కొవ్వు కరిగిపోతుంది. షుగర్ అదుపులోకి వస్తుంది. అధిక బరువును కూడా కంట్రోల్ చేస్తుంది ఇలా దాల్చిన చెక్క పొడిని తీసుకోవడం వల్ల ఎంతో ప్రయోజనం కలుగుతుంది. ఈ నేపథ్యంలో దాల్చిన చెక్కలో ఉండే ఔషధాలతో మనకు ఎంతో ప్రయోజనం కలుగుతుందనడంలో సందేహం లేదు. దాల్చిన చెక్క పొడితే ఒనగూడే లాభాలు ఉన్నాయని తెలియడంతో చాలా మంది దాన్ని వాడేందుకు ముందుకు వస్తున్నారు.