https://oktelugu.com/

Beetroot Leaves: ఈ విషయం మీకు తెలుసా.. బీట్‌రూట్ కంటే ఆకులతో బోలడన్నీ ప్రయోజనాలు అంటా?

బీట్‌రూట్ కంటే అందులోని ఆకుల్లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయట. ఈ ఆకులను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకుల్లో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. అయితే ఈ ఆకుల వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో మరి చూద్దాం.

Written By:
  • Kusuma Aggunna
  • , Updated On : November 20, 2024 / 03:14 AM IST

    Beet root leaves

    Follow us on

    Beetroot Leaves: ఆరోగ్యానికి బీట్‌రూట్ చాలా ప్రయోజనాలను చేకూరుస్తుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. ఎక్కువగా డైట్ ఫాలో అయ్యే వాళ్లు ఈ బీట్‌రూట్‌ను తింటారు. ఇందులో ఉండే పోషకాలు జుట్టు, చర్మ ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తాయి. ఇందులో విటమిన్లు ఎలాంటి అనారోగ్య సమస్యల బారిన పడకుండా కాపాడుతుంది. రోజూ ఉదయం పూట ఈ బీట్‌రూట్ జ్యూస్‌ను తాగితే చర్మం మెరుస్తుంది. యంగ్ లుక్‌లో అందంగా కనిపిస్తారు. అయితే కొందరు బీట్‌రూట్ ముక్కలను కూడా తింటారు. ఇలా తినలేని వారు బీట్‌రూట్ జ్యూస్ చేసి తాగుతుంటారు. అయితే ఎక్కువ మంది ఈ బీట్‌రూట్‌ను మాత్రమే తింటారు. కానీ ఈ ఆకులను అసలు పట్టించుకోరు. బీట్‌రూట్ కంటే అందులోని ఆకుల్లోనే పోషకాలు ఎక్కువగా ఉంటాయట. ఈ ఆకులను తినడం వల్ల ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఈ ఆకుల్లో ఖనిజాలు, విటమిన్లు, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి బాగా సహాయపడతాయి. అయితే ఈ ఆకుల వల్ల శరీరానికి కలిగే ప్రయోజనాలు ఏంటో మరి చూద్దాం.

    రక్తపోటు నియంత్రణ
    బీట్‌రూట్ కంటే వాటి ఆకులను తినడం వల్ల రక్తపోటు అదుపులో ఉంటుంది. ఇందులోని నైట్రిక్ ఆక్సైడ్ రక్తపోటును అదుపులో ఉంచడంలో బాగా సహాయపడుతుంది. రక్తపోటు అదుపులో ఉండే గుండె పోటు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. కాబట్టి ఈ ఆకులను వేస్ట్ అని పారేయకుండా వండుకుని తినడం ఆరోగ్యానికి మంచిది. దీనివల్ల కేవలం రక్తపోటు అనే కాకుండా శరీరానికి రక్తం కూడా అధిక మొత్తంలో ఎక్కుతుంది. దీంతో రక్తహీనత సమస్య కూడా రాదు.

    రోగనిరోధక శక్తి పెరగడం
    ఈ ఆకుల్లోని పోషకాలు శరీరానికి రోగనిరోధక శక్తిని పెంచుతాయి. ఇందులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది ఎలాంటి ఇన్ఫెక్షన్లు రాకుండా ఉండటంలో కాపాడుతుంది. డెంగీ, జ్వరం, జలుబు వంటివి రాకుండా ఈ బీట్‌రూట్ ఆకులు కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ఎక్కువగా సీజనల్ ఫీవర్ బారిన పడకుండా ఉంటారు. ఇమ్యూనిటీ పవర్ ఉంటే ఎలాంటి వ్యాధులు వచ్చిన కూడా తట్టుకునే శక్తి ఉంటుంది. భవిష్యత్తులో రాకుండా ఉండాలంటే తప్పకుండా బీట్‌రూట్ ఆకులను తినాలి. అప్పుడే భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఆరోగ్యంగా ఉంటారు.

    చర్మ ఆరోగ్యం
    బీట్‌రూట్ తిన్నా, జ్యూస్ తాగిన చర్మం మెరుస్తుంది. అదే ఈ ఆకులను తిన్నా కూడా చర్మం ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మంపై మొటిమలు, మచ్చలు లేకుండా ఆరోగ్యంగా ఉంచడంలో సాయపడుతుంది. అలాగే తొందరగా వృద్ధాప్య ఛాయలు రాకుండా యంగ్ లుక్‌లో ఉండటానికి బీట్‌రూట్ ఆకులు బాగా ఉపయోగపడుతాయి. ఈ ఆకులను జ్యూస్ చేసి తాగినా లేకపోతే కూర వండుకుని తిన్నా చర్మం, జుట్టు, ఆరోగ్యంగా ఉండటంతో పాటు శారీరకంగా కూడా ఎలాంటి అనారోగ్య సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.

    Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.