https://oktelugu.com/

Beer: బీర్ తాగడం వల్ల లాభమా? నష్టమా? సమాధానాలు ఇవే..

Beer: బీర్ తాగడం వల్ల లాభమా? నష్టమా? సమాధానాలు ఇవే..

Written By:
  • Srinivas
  • , Updated On : March 26, 2024 / 10:28 AM IST

    drinki beer profits or loss

    Follow us on

    ‘మద్యపానం హానికరం’ అనే బోర్డులు ప్రతి మద్యం షాపు దగ్గర కనిపిస్తుంటాయి. కానీ చాలా మంది ఇవేమీ పట్టించుకోకుండా అల్కహాలు తీసుకుంటారు. మద్యం తీసుకోవడం వల్ల కొందరు ఆరోగ్యం అంటుంటారు. మరికొందరు అనారోగ్యం అని చెబుతున్నారు. ముఖ్యంగా ఇటీవల కొందరు బీరు తాగడం వల్ల ఎనర్జీ వస్తుందని, అందువల్ల అప్పుడప్పుడు బీర్ తాగాలని చెప్పారు. అంతేకాకుండా వైన్ కంటే బీర్ ఎక్కువ ప్రయోజనాలు అందిస్తుందని కూడా అన్నారు. అయితే కొందరు శాస్త్రవేత్తలు మాత్రం దీనిని కొట్టిపారేస్తున్నారు. ఈ నేపథ్యంలో అసలు బీర్ తాగడం నిజంగానే ఆరోగ్యమా? లేక అనారోగ్యమా? అనే సందేహం నెలకొంది. ఈ పరిస్థితులు శాస్త్రేవేత్తలు ఏం చెబుతున్నారంటే?

    ప్రయోజనాలు:
    కొన్ని అధ్యయనాలు బీర్ తాగడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని తెలిపాయి. కిడ్నీలో స్టోన్ ఏర్పడితే బీర్ తాగడం వల్ల అవి  పగిలిపోతాయని అంటున్నారు. అయితే ఇవి 3 మి.మి కంటే తక్కువ పరిమాణంలోవి మాత్రమే అని చెబుతున్నారు. ఈ మధ్య చాలా మంది అల్జీమర్స్ సమస్య ఎదుర్కొంటున్నారు. బీర్ రెగ్యులర్ గా తాగడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడొచ్చని అంటున్నారు. ప్రతీరోజూ 75 మిల్లీ లీటర్ల బీర్ తీసుకోవడం వల్ల అల్సర్ సమస్య ఉండదని అంటున్నారు. తీవ్ర మానసకి ఒత్తిడితో ఉన్నవారు బీర్ తాగడం వల్ల ఉపశమనం పొందుతారట.

    శాస్ర్తవేత్తలు ఏం చెబుతున్నారంటే?
    బీర్ తాగడం వల్ల ప్రయోజనాలు ఉన్నాయనేది అవాస్తవమని కొందరు శాస్త్రవేత్తలు అంటున్నారు. బీర్ లో ఉండే పదార్థాలు శరీరాన్ని బరువుగా మారుస్తాయని అంటున్నారు. దీని ద్వారా కొలెస్ట్రాల్ పెరిగి అనేక అనారోగ్యాలకు కారణమవుతుందని అంటున్నారు.   సమ్మర్ లో ఎక్కువగా బీర్ తీసుకోవడం వల్ల బాడీ డీ హైడ్రేషన్ కు గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. జీర్ణసమస్యలతో బాధపడేవారికి బీర్ శత్రువుగా ఉంటుందంటున్నారు. బీర్ అల్సర్ తగ్గిస్తుుందనేది అవాస్తవమని, ఇది కడుపులో వేడిని పెంచి పేగుల్లో సమస్యలను తెస్తుందని అంటున్నారు.

    ఫైనల్ గా..
    బీర్ తాగడం వల్ల కొన్ని నష్టాలు ఉన్నప్పటికీ మితంగా తాగడం వల్ల ఎలాంటి సమస్యలు రావని మరికొందరు అంటున్నారు. అయితే నేటి కాలంలో చాలా మంది ఒత్తిడితో పనిచేస్తున్నారు. ఇలాంటి వారు మితంగా వీకెండ్ డేస్ లో బీర్ తీసుకోవడం ప్రమాదమేమీ లేదని అంటున్నారు. ఒకేళ బీర్ తీసుకున్నా.. దానికి తగిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరాన్ని సమతుల్యంగా ఉంచుతుందంటున్నారు. బీర్ ను అప్పుడప్పుడు మాత్రమకే తీసుకోవాలని, దీనిని వ్యసనంగా మార్చుకోకుండా ఉండాలని చెబుతున్నారు.