Bedroom Vastu Tips: నక్కకు తెలివి ఎక్కువ. కుక్కకు విశ్వాసం ఎక్కువ. భారతీయులకు నమ్మకాలు ఎక్కువ. ముహూర్తం చూసుకోనిదే ఏ పని కూడా చేయరు. పంచాంగాన్ని ఎంతగా నమ్ముతారో వాస్తును అంతే విశ్వసిస్తారు. కొత్తగా ఇల్లు కడుతున్నారంటే వాస్తు దోషాలు లేకుండా చూసుకోవాలని భావిస్తారు. మంచి వాస్తు పండితుడిని తీసుకొచ్చి ఇంటిని ఏ విధంగా నిర్మించాలో పథకం వేయిస్తారు. దాని ప్రకారమే ఇల్లు నిర్మాణం చేసి అందుకనుగుణంగా తీర్చిదిద్దుతారు. అయినా ఏదో ఒక లోపం ఉందంటే మొత్తం ఇల్లునే పడగొట్టే వారున్నారని తెలుస్తోంది.

మన భారతీయ విలువల్లో వాస్తుకు ప్రత్యేకమైన స్థానమే ఉంది. పక్కా వాస్తుతో నిర్మిస్తేనే మంచి జరుగుతుందని అనుకుంటారు. దీని కోసం ఎంత అయినా ఖర్చు పెడతారు. మన ఇంటిలో పడక గది ప్రాముఖ్యత తెలిసిందే. ప్రతి రోజు మనం సేదతీరే స్థలం కావడంతో దీని కోసం ఇంకా ప్రత్యేకంగా దృష్టి సారించి నిర్మించుకుంటారు. దాంపత్య జీవితంలో బెడ్ రూంకు ఉన్న విలువ అలాంటిది మరి. ప్రేమ వివాహమైనా పెద్దలు కుదిర్చిన పెళ్లయినా పడకగదికి ఉన్న ప్రాముఖ్యత అలాంటిదే.
Also Read: Funny Wedding Gift: వధూవరులకు ఊహించని బహుమతి? ఇంతకీ ఏం గిఫ్ట్ ఇచ్చారో?
వాస్తు శాస్త్రం ప్రకారం తగు సూచనలు, సలహాలు పాటించకుంటే దంపతుల్లో మనస్పర్థలు, అపార్థాలు చోటుచేసుకోవచ్చు. వైవాహిక జీవితం ఆనందంగా సాగాలంటే వాస్తు దోషం లేకుండా చూసుకోవాల్సిందే. జీవితంలో అనుబంధాలు పెరగాలంటే వాస్తు శాస్త్రం పాటిస్తూ ముందుకు నడవాల్సిందే. పడక గదిలో లైట్లు ప్రకాశవంతంగా ఉండకూడదు. ముదురు రంగులో ఉండాలి. లేదంటే ప్రమాదాలు రావచ్చు. లేకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించాలి.

వాస్తు ప్రకారం పడకగదిలో దూలం కింద మంచం ఉండకూడదు. ఉంటే దంపతుల మధ్య అగాధం పెరుగుతుంది. దూరం ఎక్కువవుతుంది. దంపతుల్లో సంసారం వాంఛ తగ్గుతుంది. పడక గది గోడలు కూడా తెలుపు, ఎరువు లాంటి ప్రకాశవంతమైన రంగుల్లో ఉండకూడదు. ముదురు రంగులో ఉంటేనే మంచిది. బెడ్రూంలో క్రూర జంతువులు, గర్జించే జంతువుల ఫొటోలు ఉంచకూడదు. సూర్యోదయం, సూర్యాస్తమయం లంటి ప్రకృతి చిత్రాలు ఉంచుకుంటే మనసుకు ప్రశాంతంగా ఉంటుంది.
బెడ్రూంలో ఎటువంటి అద్దాలు కూడా ఉంచొద్దు. ఒకవేళ ఉంచుకుంటే మంచిది కాదని వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. మంచం పక్కన ఎలాంటి అద్దాలు ఉన్నా దాని వల్ల ప్రయోజనాల కంటే నష్టాలే ఎక్కువగా ఉంటాయని సూచిస్తున్నారు. అందుకే వాస్తు శాస్త్రం ప్రకారం మన పడక గదిని ప్రశాంతంగా ఉంచుకునేందుకు పద్ధతులు పాటించాల్సిందే.
Also Read:AP New Cabinet: జగన్ కేబినెట్ లో కొత్త మంత్రులు వీరే.. రాజ్ భవన్ కు జాబితా