Bed Sores: మనలో చాలా మందికి బెడ్ సోర్స్ అంటే ఏంటో పెద్దగా తెలియదు. వీటిని ప్రెజర్ అల్సర్స్ లేదా ప్రెజర్ సోర్స్ అని కూడా అంటారు. ఈ బెడ్ సోర్స్ అనేవి ఒకే ప్లేస్‌లో ఎక్కువగా కూర్చోవడం లేదా మంచం మీద నిద్రపోవడం వల్ల పుండ్లు ఏర్పడుతాయి. దీన్నే బెడ్ సోర్స్ అంటారు. చాలా మంది ఈ రోజుల్లో అసలు శారీరక శ్రమ చేయడం లేదు. దీంతో ఒత్తిడి పెరిగి చర్మంపై పుండ్లు ఏర్పడుతాయి. ఈ పుండ్లు రావడానికి ముఖ్య కారణం కొందరు పూర్తిగా వ్యాయామం వంటివి చేయరు. అలాగే ఒకే ప్లేస్‌లో కూర్చోని లేదా నిద్రపోయి కదలకుండా ఉంటారు. దీనివల్ల శరీర భాగాలతో పాటు చర్మం, కండరాలు దెబ్బతింటాయి. ఇది రక్తనాళాలపై కూడా ప్రభావం చూపుతుంది. అయితే ఈ బెడ్ సోర్స్ చాలా ప్రమాదకరమని నిపుణులు చెబుతున్నారు. శరీరానికి శారీరక శ్రమ అనేది తప్పనిసరి. లేకపోతే ఇలా బెడ్ సోర్స్ వచ్చి కొన్ని సార్లు మరణించే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సమస్య ఉన్నవారిలో చర్మం తొందరగా ఎర్రగా అవుతుంది. అలాగే పుండ్లు ఏర్పడి నొప్పి రావడం, వాసన మొదలు కావడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఆ తర్వాత లైట్‌గా జ్వరం వచ్చి ప్రమాదానికి దారితీస్తుంది. ఏ మాత్రం ఈ లక్షణాలు కనిపిస్తే అసలు లైట్ తీసుకోవద్దని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఈ బెడ్ సోర్స్ సమస్య ఉంటే మాత్రం తప్పకుండా పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవాలని నిపుణులు సూచిస్తు్న్నారు. ఒత్తిడి వల్ల కూడా పుండ్లు ఏర్పడుతాయి. కాబట్టి ఒత్తిడిని తగ్గించుకుని మానసికంగా ఆరోగ్యంగా ఉండాలి. దీనికోసం ప్రతీ విషయానికి ఎక్కువగా టెన్షన్ పడకూడదు. యోగా, మెడిటేషన్ వంటివి చేస్తుండాలి. ఏ విషయాన్ని అయిన కూడా కూల్‌గా ఆలోచించాలి. కొందరు ఈ సమస్య వచ్చిన ఏం కాదులే.. సాధారణ పుండ్లు అని లైట్ తీసుకుంటారు. కానీ అలా చేయకుండా ఈ పుండ్లు కనిపించిన 24 గంటల్లోగా వైద్యుని సంప్రదించాలి. అలాగే ఒకే పొజిషన్‌లో కూర్చోవద్దు. దీనివల్ల సమస్య ఇంకా ఎక్కువ అవుతుంది. ఒకే ప్లేస్‌లో కూర్చోకుండా అప్పుడప్పుడు కూడా కాస్త లేవాలి. అంటే మధ్యలో లేచి అటు ఇటు తిరగడం వంటివి చేస్తుండాలి. వీటితో పాటు ఎప్పటికప్పుడు ఆ పుండ్లను శుభ్రం చేయాలి. అసలు క్లీన్ చేయకుండా అలాగే వదిలేస్తే సమస్య పెరుగుతుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది మందులతో నయం కావడం కంటే మనం తీసుకునే జాగ్రత్తల బట్టే తొందరగా నయం అవుతుంది.
ఈ బెడ్ సోర్స్ ఎక్కువగా చీలమండలు, పిరుదులు, మోచేతుల్లో ఎక్కువగా పుండ్లు వస్తాయి. పుండ్లను ఎప్పటికప్పుడు జాగ్రత్తగా క్లీన్ చేసుకోవాలి. ఒకవేళ చేయకపోతే క్యాన్సర్, సెరెబ్రల్ పాల్సీ, దీర్ఘకాలిక సిరల లోపం, వైకల్యం, మధుమేహం, గుండె సమస్యలు, కిడ్నీ సమస్యలు వంటివి కూడా వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి సమస్య వస్తే ఏ మాత్రం ఈజీగా తీసుకోవద్దు. ముఖ్యంగా వృద్ధులు అయితే పోషకాలు ఉండే ఫుడ్ తీసుకోవాలి. వీరు ఎక్కువగా కదలకుండా ఒకే ప్లేస్‌లో ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది. వృద్ధులకు ఇంకా వెన్నుమక కూడా నొప్పి వచ్చే ప్రమాదంతో పాటు నాడీ సంబంధిత వ్యాధులు కూడా వస్తాయని నిపుణులు అంటున్నారు. ఒకే దగ్గర ఉండకుండా అప్పుడప్పుడు నెమ్మదిగా మారుతుండాలి. అలాగే చర్మ విషయంలో కూడా జాగ్రత్తలు పాటించాలి. దుర్వాసన, సీము ఉంటే శుభ్రం చేసుకుంటూ ఉంటే సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది. వీటిని పాటించే ముందు తప్పకుండా వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.