Beard: అబ్బాయిలు షేవింగ్ చేసుకుంటున్నారా.. అయితే ఇది మీకోసమే!

షేవింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎక్కువ మంది బ్లేడ్‌తో లేదా ఎలక్ట్రిక్ షేవర్‌తో చేస్తుంటారు. ఇలా ఎక్కువసార్లు షేవింగ్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

Written By: Kusuma Aggunna, Updated On : October 30, 2024 5:31 pm

Beard

Follow us on

Beard: అబ్బాయిలకు గడ్డం ఉంటేనే చాలా మందికి ఇష్టం. ముఖ్యంగా అమ్మాయిలు అయితే గడ్డం ఉండే అబ్బాయిలనే ఎక్కువగా ఇష్టపడుతుంటారు. అందుకే చాలా మంది అబ్బాయిలు కూడా అసలు షేవ్ చేసుకోకుండా గడ్డం పెంచుతూనే ఉంటారు. అయితే ఇలా జుట్టు ఎక్కువగా ఉంటే పెద్దలకు నచ్చదు. షేవ్ చేసుకుని ఉంటేనే ఇంట్లో వారికి నచ్చుతుంది. లేకపోతే రోజూ దీని గురించి చెబుతూనే ఉంటారు. మరికొందరు అంత గడ్డం పెంచడం ఏం బాగాలేదని, ప్రేమలో ఫెయిల్ అయ్యావా అని అడుగుతారు. కానీ ఇదంతా ఒకప్పుడు. ఇప్పుడు గడ్డం పెంచడం ఒక ఫ్యాషన్ అయిపోయింది. మగవాళ్లకు గడ్డం వల్లే అందం వస్తుందని యువత ఎక్కువగా భావించి పెంచడానికి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నారు. ఇలా ఎంత గడ్డం పెంచిన కూడా ఎప్పుడో ఒకసారి షేవ్ చేసుకోవాల్సిందే. కొందరికి ఎక్కువగా గడ్డం లేకపోయిన కూడా షేవింగ్ చేస్తుంటారు. ప్రతీసారి ఇలా షేవింగ్ చేయడం ఆరోగ్యానికి మంచిది కాదని నిపుణులు అంటున్నారు. ఎక్కువ మంది బ్లేడ్‌తో లేదా ఎలక్ట్రిక్ షేవర్‌తో చేస్తుంటారు. ఇలా ఎక్కువసార్లు షేవింగ్ చేయడం వల్ల కలిగే నష్టాలు ఏంటో ఈ స్టోరీలో చూద్దాం.

 

బ్లేడ్‌తో షేవింగ్ చేయడం వల్ల చర్మం ఎర్రగా మారుతుంది. సరిగ్గా చేయకపోవడం వల్ల దురద, మంట వల్ల చర్మ సంబంధిత సమస్యలు వస్తాయని నిపుణులు అంటున్నారు. షేవింగ్ చేసే ముందు గడ్డాన్ని తడిగా చేయాలి. అప్పుడే ఎలాంటి దురద, మంట ఉండవు. ఎక్కువగా చర్మాన్ని బ్లేడ్‌తో తీయడం వల్ల ఆ ప్రదేశం ఎర్రగా మారిపోతుంది. షేవింగ్ చేసుకునే ముందు చర్మాన్ని బాగా తడపాలి. అలాగే నాణ్యమైన క్రీంలు మాత్రమే వాడాలి. కొందరు తక్కువ ఖరీదువి వాడుతుంటారు. వీటివల్ల చర్మం దెబ్బతింటుంది. ఎప్పుడూ కూడా ఒకే బ్లేడ్‌తో కాకుండా ఎప్పటికప్పుడూ బ్లేడ్‌ను మార్చండి. దీనివల్ల చర్మ సమస్యలు రాకుండా ఉంటాయి. ఈ బ్లేడ్ పద్ధతి కంటే ఎలక్ట్రిక్ రేజర్ వాడటం మంచిదని నిపుణులు అంటున్నారు. కొందరు వారంలో రెండు సార్లు కంటే ఎక్కువగా చేస్తుంటారు. దీనివల్ల చర్మం దెబ్బతింటుందని నిపుణులు అంటున్నారు.

 

ఈ రోజుల్లో షేవింగ్ చేయడానికి పద్ధతులు మారిపోతున్నాయి. పూర్వం రోజుల్లో కేవలం బ్లేడ్ పద్ధతి ఉండేది. కానీ ఇప్పుడు ఎలక్ట్రిక్ రిమూవ్, లేజర్ రిమూవ్ వంటివి కూడా ఉన్నాయి. బ్లేడ్‌తో షేవ్ చేసుకునే వారి సంఖ్య కూడా తగ్గింది. అయితే షేవింగ్ చేసేటప్పుడు చర్మం ఏదైనా తేడాగా అనిపిస్తే వెంటనే వైద్యుని సంప్రదించాలి. ఎక్కువగా షేవ్ చేయడం వల్ల చర్మ సంబంధిత సమస్యలు పెరుగుతాయి. కాబట్టి షేవింగ్ చేసే విషయంలో మాత్రం అబ్బాయిలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా ఫంక్షన్ లేదా పార్టీ ఉంటే అందంగా కనిపించాలని తప్పకుండా షేవింగ్ చేసుకుంటారు. దీనివల్ల ఆ నిమిషానికి అందంగా కనిపించిన కూడా ఆ తర్వాత చర్మ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి షేవింగ్ అధికంగా చేసుకుంటే మానుకోండి. అవసరమైతే ముందుగానే వైద్యుని సంప్రదించి సూచనల మేరకు షేవింగ్ చేయండి.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.