https://oktelugu.com/

Interest Rates: ఈ బ్యాంకుల్లో వడ్డీరేట్లు చూస్తే ఎగిరి గంతేస్తారు..! వద్దన్నా అధిక వడ్డీ ఇస్తారు..

ఉద్యోగం, వ్యాపారం చేసేవారెవరైనా ఇప్పటి ఖర్చులకు పోను మిగతాది సేవింగ్ చేసుకోవాలని ఆలోచిస్తారు. ఈ క్రమంలో ఒకప్పుడు ఇంట్లోనే డబ్బులను దాచుకునేవారు. కానీ దొంగల భయంతో బ్యాంకుల్లో దాచుకోవడం ప్రారంభమైంది.

Written By:
  • Srinivas
  • , Updated On : July 29, 2023 8:58 am
    Interest Rates

    Interest Rates

    Follow us on

    Interest Rates: జీవితం ఆనందంగా ఉండాలని చాలా మంది కష్టపడి డబ్బులు సంపాదిస్తుంటారు. కానీ వీటిని కాపాడడంతో చాలా మంది నిర్లక్ష్యం చేస్తుంటారు. అధిక వడ్డీ ఆశతో కొంత మంది ఇతరులకు ఇస్తుంటున్నారు. దీంతో వారు ఇన్ టైంలో పే చేస్తే పర్వాలేదు. కానీ అలా కాని పక్షంలో ఇబ్బందులు ఎదురవుతాయి. కరోనా కాలం తరువాత ప్రతి ఒక్కరికి డబ్బు తప్పనిసరిగా అవసరం ఉంటుందని అర్థమైంది. దీంతో అప్పటి నుంచి చాలా మంది డబ్బులు ఇతరులకు డబ్బులు వడ్డీకి ఇవ్వడం లేదు. వడ్డీ లేకపోయినా పర్వాలేదని బ్యాంకుల్లో దాచుకుంటున్నారు. అయితే నార్మల్ గా సేవ్ చేయడం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు. వీటిని క్రమ పద్ధతిలో పిక్స్ డ్ చేస్తే మీరు వద్దన్నా వడ్డీ ఇస్తూనే ఉంటాయి.

    ఉద్యోగం, వ్యాపారం చేసేవారెవరైనా ఇప్పటి ఖర్చులకు పోను మిగతాది సేవింగ్ చేసుకోవాలని ఆలోచిస్తారు. ఈ క్రమంలో ఒకప్పుడు ఇంట్లోనే డబ్బులను దాచుకునేవారు. కానీ దొంగల భయంతో బ్యాంకుల్లో దాచుకోవడం ప్రారంభమైంది. అయితే నార్మల్ సేవింగ్ తో ఎలాంటి ఉపయోగం ఉండదు. కానీ కొన్ని రకాలుగా ఫిక్స్ డ్ చేస్తే అధిక వడ్డీని పొందచవ్చు. అయితే ఈ వడ్డీ మీరు నిర్ణయించుకునే Tenure (కాలపరిమితి)ని భట్టి ఉంటుంది. ఎన్ని ఎక్కువ రోజులు చేస్తే అంత వడ్డీని పొందవచ్చు. అయితే ఏ బ్యాంకు అధిక వడ్డీ వస్తుందంటే?

    స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులు తమ గ్రోత్ ను పెంచుకోవడానికి కస్టమర్లను ఆకర్షిస్తున్నారు. ఈ క్రమంలో కొన్ని ఆఫర్లను ప్రకటిస్తారు. దీంతో పెద్ద బ్యాంకుల్లో కంటే చిన్న చిన్న బ్యాంకుల్లో పిక్స్ డ్ చేయడం ఉత్తమం అని ఆర్థిక నిపుణులు సూచిస్తున్నారు. One Year Tenure ఫిక్స్ డ్ డిపాజిట్ చేయాలనుకునేవారు ఈక్విటాస్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంకులో ప్రస్తుతం 8.20 శాతం వడ్డీని పొందుతారు. అలాగే ఇండస్ బ్యాంక్ 7.75, యెస్ బ్యాంకు 7.50, బంధన్ బ్యాంకు 7.25, డీసీబీ బ్యాంకు 7.25 ఇంట్రెస్ట్ పే చేస్తారు. అలాగే రెండు సంవత్సరాలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేస్తే డీసీబీ బ్యాంకు 8, ఇండస్ ఇండియా 7.75, యెస్ బ్యాంకు 7.75 ఇంట్రెస్ట్ ను అందిస్తాయి.

    ఇలాగే మీరు టెన్యూర్ ను పెంచుకుంటూ పోతే మరింత ఎక్కువగా ఇంట్రెస్ట్ వచ్చే అవకాశం ఉంది. అయితే మనకు అవసరానికి సరిపోయేంత కాకుండా మిగులు డబ్బును ఇలా చేయడం ద్వారా మీకు సముచితంగా వడ్డీ వస్తుంది. ఇలా చేయడం ద్వారా డబ్బుకు సెక్యూరిటీ ఉండడంతో పాటు అధిక వడ్డీ వస్తోంది. అయితే కొన్ని బ్యాంకులు మంథీ ఇంట్రెస్ట్ పేయింగ్ కూడా ఏర్పాటు చేశాయి. మరికొన్ని డిపాజిట్లతో మాత్రమే వడ్డీని చెల్లిస్తాయి.