Homeలైఫ్ స్టైల్Bank account minimum balance rule: మినిమం డిపాజిట్‌ లేకపోతే ఖాతా క్లోజ్‌..

Bank account minimum balance rule: మినిమం డిపాజిట్‌ లేకపోతే ఖాతా క్లోజ్‌..

Bank account minimum balance rule: కేంద్రం పేదల కోసం, ఆడ పిల్లలు, మహిళల కోసం అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది. అందరితో జీరో అకౌంట్‌ బ్యాంకు ఖాతాలు తెరిపించింది. దీంతో బ్యాంకింగ్‌ సేవలు మెరుగయ్యాయి. పారదర్శకంగా జరుగుతున్నాయి. అయితే చాలా మంది ఖతాల్లో మినిమం బ్యాలెన్స్‌ మెయింటేన్‌ చేయడం లేదు. దీంతో కేంద్రం దీనిని సీరియస్‌గా పరిగణించింది. పారద్శక లావాదేవీలు పెంచడం, బ్యాంకు ఖాతాలు యాక్టివ్‌గా ఉండేందుకు చర్యలు చేపట్టింది. మినిమం బ్యాలెన్స్‌ లేని ఖాతాలు క్లోజ్‌ చేయాలని నిర్ణయించింది. ఈమేరకు మార్చి 31 వరకు గడువు విధించింది.

మార్చి 31 వరకు డిపాజిట్‌కు గడువు..
2025–26 ఆర్థిక సంవత్సరం మార్చి 31తో పూర్తవుతుంది. ఈ సమయంలో పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన (ఎస్‌ఎస్‌వై), ఎన్‌పీఎస్‌ వంటి దీర్ఘకాల పెట్టుబడి ఖాతాలు యాక్టివ్‌గా ఉంచుకోవాలని కేంద్రం కీలక ఆదేశాలు జారీ చేసింది. కనీస డిపాజిట్‌ మొత్తాలు చేయకపోతే ఇవి ఇన్‌ యాక్టివ్‌ అవుతాయని తెలిపింది. దీంతో ప్రయోజనాలు కోల్పోయే ప్రమాదం ఉంది.

పీపీఎఫ్‌ ఖాతాలో రూ.500
పబ్లిక్‌ ప్రొవిడెంట్‌ ఫండ్‌ (పీపీఎఫ్‌)లో ప్రతీ సంవత్సరం కనీసం రూ.500 జమ చేయాలి. ఇది చేయకపోతే ఖాతా డీయాక్టివ్‌ అవుతుంది. తిరిగి ప్రారంభించాలంటే పెనాల్టీతోపాటు మునుపటి ప్రయోజనాలు కూడా ప్రశ్నార్థకమవుతాయి. ట్యాక్స్‌ మినహాయింపులు(సెక్షన్‌ 80సీ) కోల్పోవడం వల్ల ఆదాయపు పన్ను లాభాలు తగ్గుతాయి.

ఎస్‌ఎస్‌వై ఖాతాలో రూ.250..
ఇక సుకన్యా సమృద్ధి యోజన(ఎస్‌ఎస్‌వై) ఖాతాలు బాలికల విద్య, వివాహ ఖర్చులకు ఉద్దేశించినవి. ఇక్కడ కనీస డిపాజిట్‌ రూ.250 మాత్రమే, కానీ దీన్ని మరచితే ఖాతా ఆపివేయబడుతుంది. పెనాల్టీ చెల్లించి మళ్లీ యాక్టివ్‌ చేసినా, ప్రభుత్వ వడ్డీ రేట్లు (ప్రస్తుతం 8.2%), ట్యాక్స్‌ రాయితీలు (80సీ, 10(10డీ)) పూర్తిగా పొందలేం.

ఎన్‌పీఎస్‌లో రూ.1,000
నేషనల్‌ పెన్షన్‌ సిస్టమ్‌ (ఎన్‌పీఎస్‌)లో వార్షిక కనీసం బ్యాలెన్స్‌ రూ.1,000 డిపాజిట్‌ తప్పనిసరి. ఇది లేకపోతే ఖాతా డీయాక్టివ్‌ అవుతుంది. మార్కెట్‌ లింక్డ్‌ రిటర్న్‌స్‌ (సగటు 12–14%) మిస్‌ అవుతాయి. 80 సీసీడీ(1బీ) కింద అదనపు ట్యాక్స్‌ లాభాలు కూడా దూరమవుతాయి.

ఖాతాలు డీ యాక్టివ్‌ అయితే పెనాల్టీలు (రూ.50 నుంచి రూ.500 వరకు) చెల్లించి మళ్లీ ఓపెన్‌ చేయవచ్చు, కానీ ఆలస్య డిపాజిట్లు ఆస్తి వృద్ధిని ఆపేస్తాయి. ట్యాక్స్‌ బెనిఫిట్స్‌ కోల్పోవడం వల్ల ఆర్థిక నష్టం రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు అవుతుంది.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

RELATED ARTICLES

Most Popular