Banana Leaf: పూర్వం రోజుల్లో ఎక్కువగా అరటి ఆకులోనే భోజనం చేసేవారు. ఈ రోజుల్లో అంటే వెండి, స్టీల్, బంగారం ఇలా ప్లేట్లలో తింటున్నారు. వీటిలో తినడం భోజనం ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు ఉండవు. కానీ అరటి ఆకులో తినడం వల్ల ఆరోగ్యానికి చాలా ప్రయోజనాలు ఉన్నాయి. కొన్ని అనారోగ్య సమస్యల నుంచి కూడా బయట పడవచ్చు. కానీ ఈ రోజుల్లో ఎవరూ కూడా అరటి ఆకులో తినడం లేదు. గత కొన్నేళ్ల కిందట కనీసం పెళ్లిళ్లలో అయిన అరటి ఆకులో బంతి భోజనం పెట్టేవారు. కానీ ఇప్పుడు జనరేషన్ అంతా మారిపోయింది. ప్లేట్లలో నిల్చోని తినే భోజనం పెడుతున్నారు. ఆఖరికి అన్నదానాల్లో కూడా అరటి ఆకు వాడటం లేదు. అంతా ప్లాస్టిక్ ప్లేట్లలో పెడుతున్నారు. ఒకప్పుడు ఎవరి ఇంట్లో చూసిన కూడా అరటి చెట్లు కనిపించేవి. కానీ ఇప్పుడు పొలాల్లో ఎక్కడో కనిపిస్తున్నాయి. అయితే మిగతా ప్లేట్‌లో కాకుండా అరటి ఆకులో తినడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
అరటి ఆకులో పోషకాలు మెండుగా ఉంటాయి. ఇవి ఆరోగ్యాన్ని కాపాడటంలో ప్రధాన పాత్ర వహిస్తుంది. ప్లేట్‌లో కాకుండా అరటి ఆకులో తినడం వల్ల ఆహారం రుచి పెరుగుతుంది. ఇందులో పాలీఫెనాల్స్, విటమిన్ ఎ, విటమిన్ సి వంటి పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. ఈ ఆకులో ఆహారం తినడం వల్ల ఆ పోషకాలన్నీ శరీరంలోకి ప్రవేశిస్తాయి. దీనివల్ల అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందుతారు. ఇంట్లో మనం ప్లేట్లు కడిగి పెట్టిన కూడా వాటి మీద బ్యాక్టీరియా, క్రిములు ఉంటాయి. కానీ అరటి ఆకులో బ్యాక్టీరియా పెరగదు. అరటి ఆకులోని పోషకాలు క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌ను చంపేస్తాయి. ఈ ఆకుల్లో తినడం వల్ల క్యాన్సర్ అసలు దరిచేరదు. ఆ ఆకులో తినడం వల్ల క్యాన్సర్ ప్రమాదాల నుంచి బయట పడటంతో పాటు వ్యాధిని తగ్గించుకోవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు.
అరటి ఆకులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. చర్మంపై మొటిమలు, మచ్చలు రాకుండా ఉండాలంటే రోజూ అరటి ఆకులో తినడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కొందరికి శరీరంలో వేడి చేస్తుంది. అదే రోజూ అరటి ఆకులో తింటే వేడి తగ్గి బాడీకి చలవ చేస్తుంది. అరటి ఆకులో తినడం వల్ల ఊబకాయం సమస్యల నుంచి కూడా బయటపడవచ్చని వైద్య నిపుణులు అంటున్నారు. వీటితో పాటు రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలోకి రావడం, రక్తపోటు పెరగకుండా ఉండటం, గుండె ప్రమాదాలు రాకుండా ఆరోగ్యంగా ఉంచడంలో అరటి ఆకు బాగా ఉపయోగపడుతుంది. ఈ ఆకులోని పోషకాలు రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు జీర్ణ సమస్యల నుంచి విముక్తి కల్పిస్తుంది. ప్లాస్టిక్, స్టీల్ ప్లేట్‌లో కాకుండా అరటి ఆకులో రోజూ తినడం వల్ల ఎన్నో ప్రమాదకర వ్యాధుల నుంచి బయట పడవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.