Banana: అరటి పండ్లు ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి. వీటిని డైలీ తినడం వల్ల బలంగా ఉండటంతో పాటు ఆరోగ్యంగా ఉంటారు. అరటి పండ్లను తినడం వల్ల శరీరానికి తక్షణమే శక్తి లభిస్తుంది. ఇందులోని పోషకాలు శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతో ప్రధాన పాత్ర వహిస్తాయి. అరటి పండులో పొటాషియం, విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి అనారోగ్య సమస్యల బారి నుంచి కాపాడతాయి. అయితే అరటి పండ్లు తినేటప్పుడు కొందరు తెలియక కొన్ని తప్పులు చేస్తుంటారు. ఈ తప్పుల వల్ల అరటి పండ్లు తిన్న ప్రయోజనాలు కూడా శరీరానికి అందవు. దీంతో అనారోగ్య సమస్యలు వస్తాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎలాంటి అనారోగ్య సమస్యలు రాకుండా ఉండాలంటే.. అరటి పండ్లు తిన్న తర్వాత తినకూడదని ఆ పదార్థాలేంటో మరి ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఎన్నో పోషకాలు ఉండే అరటి పండ్లను తిన్న తర్వాత పెరుగు అసలు తినకూడదు. అరటి పండ్లతో కలిపి కూడా పెరుగు తినకూడదు. ఇలా తినడం వల్ల కడుపు సమస్యలు రావడంతో పాటు బరువు పెరుగుతారని వైద్య నిపుణులు చెబుతున్నారు. వీటితో పాటు అరటి పండ్లు పాలు, తీపి పదార్థాలు తినకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎందుకంటే అరటి పండ్లు తిన్న తర్వాత తీపి పదార్థాలు తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరుగుతాయి. అలాగే అరటి పండ్లు తిన్న తర్వాత ఆరెంజ్ వంటి పుల్లని పండ్లు లేదా పదార్థాలు అసలు తినకూడదు. వీటిని తినడం వల్ల కడుపులో ఇబ్బందిగా ఉంటుంది. కడుపు సమస్యలు ఉన్నవారు అయితే అసలు తినకూడదు. కొందరు ఉదయం పూట అరటి పండ్లు తిని కాఫీ, టీ వంటివి తాగుతారు. ఇలా చేయడం వల్ల మలబద్దకం వచ్చే ప్రమాదం ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.
సాధారణంగా ఏవైనా పదార్థాలు తింటే వెంటనే నీరు తాగే అలవాటు ఉంటుంది. కానీ ఇలా తినడం ఆరోగ్యానికి మంచిది కాదని వైద్య నిపుణులు చెబుతున్నారు. అరటి పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే.. కడుపు, గ్యాస్, అసిడిటీ, ఉబ్బరం సమస్యలు వస్తాయి. కాబట్టి అరటి పండ్లు తిన్న వెంటనే కాకుండా ఒక అరగంట తర్వాత అయిన నీళ్లు తాగవచ్చు. అరటి పండ్లు తిన్న తర్వాత ఈ చిట్కాలు పాటించడం వల్ల ఎలాంటి అనారోగ్య సమస్యలు దరిచేరవు. అరటి పండ్లను ఉదయం లేదా మధ్యాహ్న సమయంలో తినడం వల్ల ఆరోగ్యంగా ఉంటారు. పరగడుపున, రాత్రి అయితే అసలు వీటిని తినకూడదు. ఈ సమయాల్లో తింటే జీర్ణ సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. కాబట్టి అరటి పండ్లను మధ్యాహ్న సమయంలో తీసుకోవడం ఉత్తమం.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.