Bamboo Trees: ప్రస్తుత పరిస్థితుల్లో రైతులలో చాలామంది వ్యవసాయాన్ని భారమని భావిస్తున్నారు. వ్యవసాయం చేసి లాభాలు పొందిన వాళ్లతో పోలిస్తే నష్టపోయిన వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉండటం గమనార్హం. కొంతమంది రైతులు భూమిపై ఆధారపడి జీవనం సాగిస్తుంటే మరి కొందరు భూములను అమ్మి వ్యాపారంపై దృష్టి పెడుతున్నారు. అయితే ఒక వ్యక్తి మాత్రం ఎకరం పొలంతో ఏకంగా 17 లక్షల రూపాయలు సంపాదించడం గమనార్హం.

ఈ రైతు యొక్క విజయగాథ మరి కొందరు రైతులు వ్యవసాయంపై దృష్టి పెట్టడానికి కారణమవుతుందని చెప్పడానికి ఏ మాత్రం సందేహం అవసరం లేదు. ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి అనే ప్రాంతంలో ఉన్న్ సాకేతు అనే గ్రామానికి చెందిన సురేశ్ చంద్ర వర్మ బీఏ, ఎల్‌ఎల్‌బీ చదువుకోగా చిన్నప్పటి నుంచే అతనికి వ్యవసాయం అంటే విపరీతమైన ఇష్టం ఉండేది. వ్యవసాయం వల్ల వచ్చిన ఆదాయంతో అతను ఉన్నత చదువులు చదివాడు.
తల్లిదండ్రుల నుంచి వచ్చిన పొలంలో సురేశ్ వేర్వేరు పంటలను పండించారు. ఆ పంటల ద్వారా సురేశ్ భారీ మొత్తంలో ఆదాయాన్ని కూడా పొందారు. ఆ తర్వాత సురేశ్ 234 వెదురు మొక్కలను కొనుగోలు చేసి తన పొలంలో వాటిని నాటుకున్నారు. ఒక్కో వెదురు చెట్టు నుంచి 50 బొంగులు ఉత్పత్తి కానుండగా ఒక్కో వెదురు బొంగు ధర 150 రూపాయలుగా ఉంది.
మొత్తం 11700 వెదురు బొంగులను విక్రయిస్తే వర్మకు ఏకంగా 17 లక్షల రూపాయల ఆదాయం రానుంది. వెదురు పంట పూర్తిస్థాయిలో రావాలంటే ఏడేళ్ల సమయం పడుతుంది. రైతులు సురేశ్ ను ఆదర్శంగా తీసుకుంటే భారీగా లాభాలను పొందే అవకాశం ఉంటుంది.