Avocado
Avocado : కేశాలు అందంగా ఉంటే ఎవరైనా సరే ఆకర్షణీయంగా కనిపిస్తారు. అమ్మాయిలు జుట్టు వేసినా, అబ్బాయిలు క్రాఫ్ సెట్ చేసుకున్నా సరే ఎంత అందంగా కనిపిస్తారు కదా. అందుకే వెంట్రుకలు కాస్త అందంగా ఉండేలా చూసుకోవాలి. వాటికి తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే మీరు షాంపూలు, హెయిర్ కండీషనర్ లు, మాస్కులు ఎక్కువగా వినియోగిస్తున్నారా? కానీ జాగ్రత్త సుమ. తెలుసుకొని వినియోగించడం చాలా ముఖ్యం. లేదా మరింత పెద్దగా అవుతుంది సమస్య. అయితే అవకాడో గురించి ఎన్నో విషయాలు మీకు తెలుసు. ఆరోగ్యానికి చాలా శ్రేయస్కరం అవకాడో. కేవలం ఆరోగ్యానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా మంచి ఔషధంలా పని చేస్తుంది. శరీరం లోపల నుంచి బాడీని స్ట్రాంగ్ చేస్తూ బయట నుంచి కూడా జుట్టుకు పోషణను అందిస్తుంది. అయితే ఈ అవకాడో జుట్టుకు ఎలాంటి ప్రయోజనాలను అందిస్తుందంటే?
అవోకాడోలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి పొడి జుట్టుకు పోషణ, హైడ్రేట్ ను అందిస్తూ జుట్టును రిపేర్ చేస్తాయి. ఈ DIY హెయిర్ మాస్క్‌లు సహజ పదార్ధాలను ఉపయోగించి మీకు మృదువైన, మెరిసే, ఆరోగ్యకరమైన హెయిర్ ను అందిస్తుంది. దీనికి కొన్ని ఆయిల్స్ ను కలపడం వల్ల జుట్టు పోషణకు చాలా ఉపయోగపడుతుంది. ఇంతకీ ఏం చేయాలంటే?
అవోకాడో & కొబ్బరి నూనె మాస్క్: పండిన అవకాడోను మెత్తగా చేయాలి. దీనికి కాస్త కొబ్బరి నూనెను కలపాలి. జుట్టు మొదల్ల నుంచి చివర్ల వరకు కూడా ఈ మాస్కను అప్లే చేయాలి. దీన్ని మీరు నిత్యం ఉపయోగించడం వల్ల జుట్టును బలపడుతుంది. దీని వల్ల తేమ కూడా లాక్ అవుతుంది. ఇది సిల్కీగా, పోషణతో ఉంటుంది.
అవోకాడో, ఆలివ్ ఆయిల్ & లెమన్ మాస్క్: ఇక జుట్టుకు ఆలివ్ ఆయిల్ మంచి పోషణను అందిస్తుంది. దీనికి అవకాడో యాడ్ అయితే ప్రయోజనాలు మరింత ఎక్కువే అంటున్నారు నిపుణులు. దీని వల్ల మృదువుగా ఉంటాయి శిరోజాలు. నిమ్మకాయ చుండ్రుతో పోరాడుతుందనే విషయం తెలిసిందే. ఇక అవకాడో లోతైన ఆర్ద్రీకరణను అందిస్తుంది. ఈ మూడింటి కలయిక వల్ల మీ జుట్టు మృదువుగా, సహజంగా నిగనిగలాడుతుంది.
అవోకాడో, గుడ్డు & ఆలివ్ ఆయిల్ మాస్క్: గుడ్డులో చాలా ప్రోటీన్లు అందుతాయి. ఇక ఆలివ్ ఆయిల్ తేమను, అవకాడో లోతైన పరిస్థితులను కలిగిస్తుంది. వీటికి కాస్త గుడ్డును కూడా కలిపి చూడండి. ప్రయోజనాలు బారెడు ఉంటాయి. అయితే ఈ ఈ మాస్క్ హెయిర్ డ్యామేజ్‌ని రిపేర్ చేస్తుంది. బ్రేకేజ్‌ని తగ్గిస్తుంది. జుట్టును బలంగా, మృదువుగా, మెరిసేలా చేస్తుంది.
అలోవెరా & అవోకాడో మాస్క్: కలబంద స్కాల్ప్‌ను ఉపశమనం చేస్తుంది. పొడిబారకుండా పోరాడుతుంది. పెరుగుదలను పెంచుతుంది. అవోకాడో లోతైన కండిషనింగ్‌తో, ఈ మాస్క్ జుట్టును ఆరోగ్యంగా, సిల్కీగా ఉంచడంలో చాలా సహాయపడుతుంది అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
అరటి & అవోకాడో మాస్క్: అరటిపండు తినడానికి మాత్రమే కాదు జుట్టుకు కూడా చాలా ఉపయోగపడుతుంది. ఇది శిరోజాలక మెరుపును అందిస్తుంది. అయితే అవకాడో శాశ్వత ఆర్ద్రీకరణను అందిస్తుంది కాబట్టి దీనికి బనాను యాడ్ చేస్తే మరింత ఎక్కువ ప్రయోజనాలు అందుతాయి.
పెరుగు, తేనె & అవకాడో మాస్క్: తేనె తేమను కలిగి ఉంటుంది. పెరుగు నెత్తికి ఉపశమనం కలిగిస్తుంది. అవకాడో ఆర్ద్రీకరణను పునరుద్ధరిస్తుంది. అందుకే ఈ మూడింటిని కలిపి వాడితే మీ హెయిర్ సమస్యలకు చెక్ పెట్టవచ్చు. ఈ రిచ్ మాస్క్ నిస్తేజంగా ఉండే జుట్టును పునరుజ్జీవింప చేస్తుంది. మృదువుగా, నిగనిగలాడేదిగా చేస్తుంది. అంతేకాదు సహజంగా ప్రకాశవంతంగా ఉంచడంలో ఈ మాస్క్ చాలా ఉపయోగపడుతుంది అంటున్నారు నిపుణులు.