International Women’s Day 2022: మహిళల కోసం ఎన్నో చట్టాలు వస్తున్నాయి. వారి అభివృద్ధి కోసం ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నా ఆకృత్యాలు మాత్రం ఆగడం లేదు. ఫలితంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏ రంగంలోనైనా సరే స్త్రీలకు అవమానాలే ఎదురవుతున్నాయి. అయినా మగువలో తెగువ చూపాల్సిన సమయం ఆసన్నమైంది.

దేశంలో ఎన్నో దురాగాతాలు జరుగుతున్నాయి. మహిళలనే లక్ష్యంగా చేసుకుని హత్యలు, అత్యాచారాలు చోటుచేసుకుంటున్నాయి. శిక్షలు మాత్రం పడటం లేదు. ఈ నేపథ్యంలో మహిళల అభ్యున్నతి కోసం ఎన్ని చట్టాలు వచ్చినా అవి వారి దరి చేరడం లేదు వారికి న్యాయం చేయడం లేదు. ఫలితంగా వారి కష్టాలు మాత్రం తీరడం గగనంగానే కనిపిస్తోంది.
Also Read: 14న ‘జనసేన’లో ఏం జరగబోతుంది..? పవన్ కళ్యాణ్ సంచలన స్టెప్?
అన్ని రంగాల్లో కూడా మహిళలపై వేధింపులు కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. అందుకే మహిళలు తెగించి వారిపై పోరాటం చేయాల్సిన అవసరం గుర్తించాలి. తమ ఉనికికి ప్రమాదం వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించకుండా ఫిర్యాదు చేసి వారిపై చర్యలు తీసుకునేలా చేయాల్సిన విధంగా ముందుకు వెళ్లాలి. దీంతోనే వారికి ఏ కష్టం వచ్చినా భయపడకుండా చట్టం సాయం తీసుకోవాలి.

అప్పుడే వారి ఉనికికి నష్టం ఉండదు. అభ్యున్నతికి అగాధం ఏర్పడదు. అందుకే మహిళలు తమ ఆపదలను తామే పరిష్కరించుకునేలా తయారు కావాల్సిన అవసరం గుర్తించాల్సిన అవసరం ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఎదురవుతున్న సవాళ్లను అవలీలగా తట్టుకుని నిలబడి తమ మనుగడ కొనసాగిస్తున్న మహిళలకు చేయూతనిందించేందుకు ప్రభుత్వాలు సిధ్ధంగా ఉండాలని చెబుతున్నారు.
Also Read: కేసీఆర్ ‘ప్రధాని’ ఆశ అడియాశలేనా? ఒకవేళ మోడీ ఓడిపోతే కేజ్రీవాల్ కే ఛాన్స్?