తల్లిదండ్రులు పిల్లలతో ఏ వయసు వరకూ నిద్రించాలి

తమ పిల్లలను అపురూపంగా పెంచుతూ యుక్త వయస్సు వచ్చే వరకు వారి అవసరాలు తీరుస్తూ ఉంటారు. ఈ క్రమంలో రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా వారితోనే ఉంటారు. కానీ

Written By: Srinivas, Updated On : February 25, 2024 11:55 am

Sleeping with parents

Follow us on

ప్రతి వ్యక్తి స్వతంత్రాన్ని కోరుకుంటాడు.. స్వేచ్ఛగా ఉండాలనుకుంటాడు.. అయితే ఆ వ్యక్తి ఒంటరిగా ఉన్నప్పుడు ఎలాంటి సమస్యనైనా ఎదుర్కోగలడా? అతనికి అండా దండా లేకున్నా.. సరైన వాతావరణంలో జీవించగలడా? ఈ భయం చాలా మంది తల్లిదండ్రుల్లో ఉంటుంది. అందుకే మన భారత్ లో పిల్లల పెంపకంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. తమ పిల్లలను అపురూపంగా పెంచుతూ యుక్త వయస్సు వచ్చే వరకు వారి అవసరాలు తీరుస్తూ ఉంటారు. ఈ క్రమంలో రాత్రి నిద్రపోయేటప్పుడు కూడా వారితోనే ఉంటారు. కానీ ఇటీవల తేలిన విషయమేంటంటే పిల్లలను తల్లిదండ్రులతో కాకుండా ఒంటరిగా పడుకోనివ్వాలట. అలా చేయడం వల్ల వారు మానసికంగా ధ్రుఢంగా తయారవుతారట. మరి ఏ వయసు పిల్లలకు ప్రత్యేక గదిని కేటాయించాలి? అలా చేయడం వల్ల ఏం జరుగుతుంది?

కొంతమంది ఇప్పుడున్న యువత చెబుతున్నదేమిటంటే? తమకు తల్లిదండ్రుల నుంచి స్వేచ్ఛ లేదని, తమకు ఇష్టం లేని పనులు చేస్తున్నామని.. నిజానికి కొంత మంది తల్లిదండ్రులు తమ పిల్లల భవిష్యత్ బాగుండాలని కోరుకుంటారు. ఈ క్రమంలో వారిని అపురూపంగా చూసుకోవాలన్న ఆత్రుతతో వారిని ఒంటరిగా పడుకోనివ్వరు. కొందరు తల్లిదండ్రులు ఆలోచిస్తున్నదేమీటంటే వారు ఒంటరిగా పడుకుంటే పీడకలలు వస్తాయని, వారు ఎవరూ లేరనే భావనతో ఉంటారని అనుకుంటారు. దీంతో రాత్రి పడుకునేటప్పుడు వారితో ఉంటారు. కానీ ఇది అస్సలు మంచిది కాదని కొందరు మానసిక వైద్య నిపుణులు అంటున్నారు.

కొన్ని దేశాల్లో 3 నుంచి 4 సంవత్సరాలు కాగానేవారికి ప్రత్యేక గదిని కేటాయిస్తారు. దీంతో వారు అప్పటి నుంచే స్వతంత్రంగా ఉండడం అలవాటు చేసుకుంటారు. ముఖ్యంగా కొద్దిపాటి వయసు తేడాతో ఉన్న ఇద్దరు పిల్లలను ఒకే గదిలో నిద్రించడం అలవాటు చేయడం వల్ల ఇద్దరి మధ్య భావాలు పంచుకుంటారు. ఒకరికొకరు స్నేహంగా ఉంటారు. ఈ క్రమంలో ప్రతీ విషయంలో తల్లిదండ్రుల పాత్ర ఉండాలని కోరుకోరు. ఫలితంగా వారు మానసికంగా ధ్రుఢంగా తయారవుతారు. ఎలాంటి సమస్య వచ్చినా పరిష్కరించుకోగలుతారు.

అందువల్ల వైద్య నిపుణులు చెబుతున్నదేమిటంటే 4 సంవత్సరాల వయసు రాగానే పిల్లలను ఒంటరిగా పడుకోనివ్వాలి. వారి బాగోగులు చూసుకుంటూనే ప్రత్యేక గదిని కేటాయించాలి. ఇద్దరు పిల్లలు ఒకే గదిలో ఉండడం వల్ల రాత్రిళ్లు వారు స్కూల్ విషయాలు చర్చించుకోవడం వల్ల ఆలోచన శక్తి పెరిగే అవకాశం ఉంది. అందువల్ల పిల్లలను మరీ గాబరం చేయకుండా వారికి స్వతంత్రంగా ఉండే అలవాటు చిన్నప్పటి నుంచే చేయడం వల్ల ఎంతో మంచిది. అయితే వారిని ఒంటరిగా వదిలేసినా వారి కదలికలు గుర్తించాలని మానసిక నిపుణులు చెబుతున్నారు.