Asia Cup 2022: ఆసియా కప్ నిర్వహణకు వేళయింది. నేటి నుంచి ఆసియా కప్ టోర్నమెంట్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్ లో శ్రీలంక, అఫ్గనిస్తాన్ జట్లు తలపడనున్నాయి. యూఏఈ దుబాయ్ వేదికగా జరిగే ఆసియా కప్ మ్యాచ్ లు షురూ కానున్నాయి. ఇందులో గ్రూప్ ఏ లో భారత్, పాకిస్తాన్, హాంకాంగ్, గ్రూప్ బీలో శ్రీలంక, అఫ్గనిస్తాన్, బంగ్లాదేశ్ జట్లు ఉన్నాయి. యూఏఈలోని దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నేడు రాత్రి 7.30 గంటలకు ప్రారంభ మ్యాచ్ జరగనుంది. దీంతో ప్రేక్షకులు ఎంతో ఆతృతతో ఉన్నారు. ప్రారంభ మ్యాచ్ లో ఎవరు విజయం సాధిస్తారోననే అనుమానం అందరిలో వస్తోంది.

ఈ టోర్నమెంట్ శ్రీలంకలో నిర్వహించాల్సి ఉన్నా అక్కడి సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో దుబాయ్ కి మార్చారు. ఆసియా కప్ లో ఇదివరకు భారత్ ఏడుసార్లు, శ్రీలంక ఐదుసార్లు కప్ సొంతం చేసుకోవడంతో ఈ సారి కూడా ఈ రెండు జట్లపైనే ఎక్కువగా అంచనాలు ఉన్నట్లు తెలుస్తోంది. శ్రీలంక ఆస్ట్రేలియాపై విజయాలు నమోదు చేసి విజయగర్వంతో ఉంది. దీంతో ఇందులో కూడా తన సత్తా చాటుతుందని ఆశిస్తున్నారు. అన్ని రంగాల్లో లంక మెరుగైన స్థితిలో ఉండటం గమనార్హం. దీంతో పోటీ రసవత్తరంగానే సాగనుందని తెలుస్తోంది.
శ్రీలంక బలమైన జట్టుగా ఉండటంతో అఫ్గనిస్తాన్ కల తీరుతుందా తెలియడం లేదు. మొదటి మ్యాచ్ లో ఏ జట్టు విజయం సాధిస్తుందోనని అభిమానులు ఎదురుచూస్తున్నారు. శ్రీలంక జట్టులో పాథుమ్ నిశ్శంక, భానుక రాజపక్స, మహేష్ తీక్షణ, చరిత్ అసలంక వంటి ఆటగాళ్లతో లంక దుర్బేద్యంగా ఉంది. దీంతో అఫ్గనిస్తాన్ లంకను అడ్డుకుంటుందా? విజయం సాధించేందుకు రెండు జట్లు పోరాడనున్నట్లు తెలుస్తోంది. ప్రారంభ మ్యాచ్ లో లంక, అఫ్గనిస్తాన్ జట్లు ఏ మేరకు ప్రభావం చూపిస్తాయో వేచి చూడాల్సిందే.

అఫ్గనిస్తాన్ జట్టులో కూడా నజీబుల్లా జడ్రాన్, హజ్రతుల్లా జరాయ్, ఇబ్రహీం జడ్రాన్, ఉస్మాన్ ఘని, రహ్మనుల్లా గుర్భాజ్ వంటి వారు రాణిస్తుండటంతో శ్రీలంక, అఫ్గనిస్తాన్ మ్యాచ్ రసకందాయంలో పడనుందని తెలుస్తోంది. దీంతో ఆసియా కప్ ప్రారంభ మ్యాచ్ అభిమానులకు కనులవిందు కానుంది. బ్యాటింగ్, బౌలింగులలో ఇరు జట్లు పటిష్టంగా మారడంతో విజయం మీదే దృష్టి సారించాయి. ఇందులో గెలిచి బోణీ కొట్టాలని భావిస్తున్నాయి. శ్రీలంక, అఫ్గనిస్తాన్ లలో ఏది విక్టరీ కొడుతుందోనని అందరు చూస్తున్నారు.
ఆసియా కప్ లో భాగంగా రేపు ఇండియా, పాకిస్తాన్ మ్యాచ్ జరగనుంది. దుబాయ్ వేదికగా జరిగే ఈ మ్యాచ్ లో విజయం సాధించాలని ఇరు జట్లు తలపోస్తున్నాయి. ఇప్పటికే అభిమానుల అంచనాలు భారీగా ఉండటంతో స్టేడియం సందడిగా మారనుంది. టికెట్లు కొన్ని నిమిషాల్లో అమ్ముడుపోవడంతో మ్యాచ్ కు మరింత ఉత్సాహం రానుంది. దీంతో ఇరు జట్లు తమ విజయం కోసం కసరత్తులు చేస్తున్నాయి.
Also Read:Naga Chaitanya: చాలా బోర్ గా అనిపించింది అందుకే డిస్కనెక్ట్ అయ్యా… పర్సనల్ మేటర్ చెప్పిన చైతూ
[…] Also Read: Asia Cup 2022: నేటి నుంచి ఆసియా కప్.. తొలి మ్యాచ… […]