https://oktelugu.com/

Phone Side Effects: ఒకే ఫోన్‌ ఎక్కువ కాలం వాడుతున్నారా.. ఈ ప్రమాదాలు ఉన్నాయి జాగ్రత్త!

విద్యుదయస్కాంత తరంగాలను అందుకున్నప్పుడు, ప్రసారం చేసినప్పుడు కొంత శాతం నష్టం జరుగుతుంది. విద్యుత్‌ అయస్కాంత తరంగాలు కల్పోయి కణజాలం ద్వారా గ్రహించబడుతుంది.

Written By:
  • Raj Shekar
  • , Updated On : February 24, 2024 / 03:15 PM IST
    Follow us on

    Phone Side Effects: మీరు వాడుతున్న ఫోన్‌ చాలా పాతదా.. ఒకే ఫోన్‌ ఏళ్లుగా వాడుతున్నారా.. అయితే జాగ్రత్త. మీకు కూడా ఈ ప్రమాదాలు పొంచి ఉన్నాయి. లైఫ్‌ ఎక్కువగా వస్తుందని ఫోన్ వాడడం మంచిది కాదని భారత ప్రభుత్వమే హెచ్చరిస్తోంది.

    ఎలా గుర్తించాలి..
    ఫోన్‌ సార్‌(SAR) విలువ ఎక్కువగా ఉంటే.. ఆ ఫోన్ వాడే వారికి అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయట. గుండెపోటు, తలనొప్పితోపాటు ఇతర అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉందని నిపుణులు గుర్తించారు. ఆన్ డ్రాయిడ్‌ ఫోన్‌ వచ్చాక చాలా మంది ఫోన్ల వినియోగం పెంచారు. అతి వాడకంపై అనేక పరిశోధనలు చేస్తున్న నిపుణులు ఫోన్ లోని దేని ప్రభావం మనిషిపై ఎంత ఉంది అని చేసిన పరిశోధనల్లో సార్‌ విలువ పెరిగితే గుండె జబ్బుల ముప్పు, హెడ్, బ్రెయిన్ సమస్యలు పొంచి ఉన్నట్లు గుర్తించింది.

    రేడియేషన్‌ కారణంగా..
    ప్రతి ఎలక్ట్రానిక్‌ డివైస్‌ తక్కువ REMS చుట్టూ కొలిచే స్వల్ప అయోన్యీకరణ రేడియేషన్ను విడుదల చేస్తుంది. ఒక నిర్దిష్ట సమయంలో సెర్చ్‌ చేయబడిని మొత్తం విలువ SAR. ప్రత్యేక శోషణ రేటు( SAR)గా పిలువబడుతుంది. మీరు మీ రేడియో ధార్మికత ఎంత ఉందో తెలుసుకోవాలంటే దాని విలువను గుర్తించాలి.

    SAR అంటే ఏమిటి?
    విద్యుదయస్కాంత తరంగాలను అందుకున్నప్పుడు, ప్రసారం చేసినప్పుడు కొంత శాతం నష్టం జరుగుతుంది. విద్యుత్‌ అయస్కాంత తరంగాలు కల్పోయి కణజాలం ద్వారా గ్రహించబడుతుంది. అఖవిలువ శరీరం కోల్పోయిన విద్యుదయస్కాంత తరంగాలు గ్రహించే రేటు. వైర్లెస్‌ నెట్‌ వర్స్‌ లో పనిచేయడానికి ఫోన్లు రేడియో ట్రాన్స్ మీటర్లు మరియు రిసీవర్లను కలిగి ఉంటాయి. అందువల్ల రేడియో తరంగాలు విడుదల చేస్తారు. ఇవి కార్సిజోనిక్‌ ముందు చెప్పినట్లుగా ఈ రేడియో తరంగాల తీవ్రత ప్రమాదకరం అని భావిస్తారు..

    ఎంత ఉండాలి..
    సార్‌ విలువ ఎంత వరకు ఉంటే మంచిది అని ఇటీవలే భారత ప్రభుత్వం నిబంధనలు రూపొందించింది. సాధారణంగా ఫోన్లలో సార్‌ విలువ 1.60 కన్నా తక్కువగా ఉండాలి. అంతకంటే ఎక్కువగా ఉంటే గుండె, తల, బ్రెయిన్ సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందని తెలిపింది.

    ఇలా చెక్‌ చేసుకోవాలి..
    ఇక సార్‌ విలువను ఎలా చెక్‌ చేసుకోవాలో తెలుసా.. మీ ఫోన్ లో సార్‌ విలువ తెలుసుకునేందుకు డయల్‌ ప్యాడ్‌ ఓపెన్ చేసి *#07# నంబర్‌ డయల్‌ చేయాలి. వెంటనే మీ ఫో¯ లో సార్‌ విలువ ఎంత ఉందో డిస్‌ప్లే అవుతుంది. ఇందులో బాడీ సార్, హెడ్‌ సార్‌ విలువ కనిపిస్తాయి. రెండు సార్‌ విలువలు 1.6 కన్నా తక్కువగా ఉండాలి. ఎక్కువగా ఉంటే వెంటనే మీరు ఆ ఫోన్ మార్చేయాలి. లేదంటే గుండె, తల, బ్రెయిన్ సమస్యలు వచ్చే అవకాశం ఉంది.