RBI: నెలానెలా EMI కట్టలేకపోతున్నారా? ఆర్బీఐ అందిస్తున్న ఈ సువర్ణావకాశం మీకోసమే..

వ్యక్తిగత, కారు, బైక్ లోన్లను కొన్ని బ్యాంకులు నేరుగా లేదా ఫైనాన్స్ సంస్థల సహాయంతో వినియోగదారులకు అందిస్తుంది. అయితే ఒక్క నెల ఈఎంఐ కట్టకపోతే రూ.500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తోంది.

Written By: Srinivas, Updated On : July 25, 2023 6:42 pm

RBI

Follow us on

RBI: కాలం మరుతున్న కొద్దీ ధరలు పెరుగుతున్నాయి. దీంతో ఖర్చులు కూడా అధికమవుతున్నాయి. దీంతో ఏ రంగంలో వారికైనా ఆదాయానికి మించి ఖర్చులు ఉంటున్నాయి. దీంతో ఆర్థిక భారంను తగ్గించుకోవడానికి అప్పులు చేయాల్సి వస్తోంది. ఒకప్పుడు ఇతరుల వద్ద వడ్డీకి తీసుకునే ఇప్పును బ్యాంకులు తక్కువ వడ్డీతో లోన్ ద్వారా అందిస్తోంది. దీనిని నెలనెలా ఈఎంఐ ద్వారా స్వీకరిస్తుంది. ఉద్యోగులు, కొందరు వ్యాపారస్తులు బ్యాంకుల నుంచి లోన్లు తీసుకొని తమ అవసరాలు తీర్చుకోవడంతో పాటు నెలనెల ఈఎంఐ రూపంలో చెల్లిస్తున్నారు. అయితే ఈఎంఐని కూడా చెల్లించే స్థోమత కొందరికి ఉండడం లేదు. దీంతో గడువు తేదీకి ఈఎంఐ చెల్లించకపోవడంతో అధిక వడ్డీని వసూలు చేస్తోంది. దీంతో కస్టమర్ సివిల్ స్కోర్ తగ్గి భవిష్యత్ లో మరిన్ని లోన్లు తీసుకోవడానికి అనర్హులవుతారు. ఇలాంటి సమయంలో Reserve Bank Of India (ఆర్బీఐ) కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది.

వ్యక్తిగత, కారు, బైక్ లోన్లను కొన్ని బ్యాంకులు నేరుగా లేదా ఫైనాన్స్ సంస్థల సహాయంతో వినియోగదారులకు అందిస్తుంది. అయితే ఒక్క నెల ఈఎంఐ కట్టకపోతే రూ.500 నుంచి రూ.2000 వరకు వసూలు చేస్తోంది. ఆ తరువాత ఎప్పటికైనా వీటిని చెల్లించాల్సిందే. దీంతో చాలా మంది వీటిని చెల్లించలేక కొనుకున్న కార్లు, బైక్ లను తిరిగి అమ్మేసేవారు చాలా మందే ఉన్నారు. అయితే వ్యక్తిగత కారణాలతో పాటు ఆర్థిక సమస్యలు రావడంతో చాలా మంది ఈఎంఐలు చెల్లంచలేకపోతున్నారు. వినియోగదారులకు ఈ సమస్య నుంచి బయటపడడానికి ఓ సొల్యూషన్ ను తీసుకొచ్చింది.

ఉదాహరణకు ఒక వ్యక్తి రూ.10 లక్షల లోన్ తీసుకున్నాడని అనుకుందాం. తను ఈఎంఐ ద్వారా రూ.5 లక్షలు చెల్లించాడు. మిగతా రూ.5 లక్షలు చెల్లంచలేకపోతున్నాడు. దీంతో అవి నెలనెలా సక్రమంగా చెల్లించలేకపోతే వాటి వడ్డీని అధికంగా వసూలు చేస్తారు. ఇవికూడా కట్టకపోతే లోన్ ఎందుకు తీసుకున్నారో.. ఏ షూరిటీపై తీసుకున్నారో.. వాటిని స్వాధీనం చేసుకుంటారు. ఈ తరుణంలో కొంత మొత్తాన్ని చెల్లించి.. మిగతా మొత్తాన్ని రీ లోన్ గా పెట్టుకోవచ్చు. అంటే మిగతా రూ.5 లక్షలను మళ్లీ లోన్ తీసుకున్నట్లుగా చేసుకోవచ్చు. ఇలా చేయడం వల్ల మీకు ఈఎంఐ కూడా తక్కువే అవుతుంది. పైగా సివిల్ స్కోర్ లో ఎలాంటి నష్టం ఉండదు.

ఆర్బీఐ ఇటీవల క్రెడిట్ కార్డులపై వినియోగదారులు ఎక్కువగా లోన్లు తీసుకుంటున్నారని తెలిపింది. సగటు వినియోగదారుడు క్రెడిట్ కార్డుపై రూ.16 వేల వరకు ఖర్చు చేస్తున్నట్లు తెలిసింది. ఈ తరుణంలో క్రెడిట్ కార్డులపై లోన్ విషయంలో కొన్ని నిబంధనలు తీసుకురావాలని బ్యాంకులకు హెచ్చరికలు జారీ చేసింది. ఇదే సమయంలో వినియోగదారుల ఇబ్బందులను గ్రహించి కొత్త మార్గదర్శకాలను తీసుకొచ్చింది. దీని గురించి పూర్తిగా తెలియాలంటే ఈ వీడియోను చూడండి..