Heavy Weight Problems: ఇటీవల కాలంలో మారుతున్న జీవన శైలితో అనేక అనర్థాలు చోటుచేసుకుంటున్నాయి. అతిగా తినడం వల్ల ఊబకాయం సమస్య వేధిస్తోంది. ఈ నేపథ్యంలో బరువు తగ్గడానికి నానా అగచాట్లు పడుతున్నారు. అధిక బరువు ఎన్నో అనారోగ్యాలకు దారి తీస్తుంది. దీంతో ఊబకాయం బారిన పడి చాలా మంది వేదన చెందుతున్నారు. స్థూలకాయం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండెజబ్బులు వచ్చే అవకాశం పొంచి ఉంది. ఊబకాయం నియంత్రణకు తగిన జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం కనిపించడం లేదు. సరైన సమయంలో ఆహారం తీసుకోవాలి. ప్రతిరోజు వ్యాయామం చేయాలి. ఊబకాయం సమస్య బారిన పడకుండా ఉండాలంటే కొన్ని పద్ధతులు పాటించాల్సిందే.

బరువు తగ్గాలనుకునే వారు ఏవేవో టీవీ ప్రకటనలు చూసి మోసపోతున్నారు. బరువు తగ్గడానికి ఆహార నియంత్రణ కూడా తీసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు ఎలా పడితే అలా తింటే అనారోగ్యాలు దరి చేరతాయి. బరువు తగ్గడం మాట అటుంచితే ఇంకా సమస్యలు పెరుగుతాయి. ఈ నేపథ్యంలో ఊబకాయం సమస్యను దూరం చేసుకోవడానికి రోజుకు మనం ఎన్నిసార్లు తినాలి? ఎలా తినాలి? అనే వాటిపై అనేక సందేహాలు వస్తున్నాయి. దీంతో ఊబకాయం సమస్య నుంచి బయటపడేందుకు ఎన్నో మార్గాలు అన్వేషిస్తున్నారు.
ఊబకాయం బారిన పడకుండా ఉండాలంటే ఒకేసారి ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోకూడదు. ప్రతి రెండు మూడు గంటలకు ఒకసారి ఏదో ఒకటి తీసుకుంటే బరువు నియంత్రణ సాధ్యమే. రోజుకు మూడు సార్లు తినే బదులు ఆరుసార్లు తింటే బరువు తగ్గేందుకు అవకాశం ఏర్పడుతుంది. బరువు తగ్గాలనుకుంటే రోజుకు ఎక్కువ సార్లు తింటే మంచిది. దీంతో జీవక్రియ మెరుగుపడుతుంది. బరువు తగ్గేందుకు పరోక్షంగా కారణమవుతుంది. మూడు సార్లకు బదులు ఆరు సార్లు తింటే ఆరోగ్యపరంగా ఎలాంటి ప్రమాదం ఉండదు.

రోజుకు మూడు పూటలకు బదులు ఆరు పూటలు తింటే నష్టాలు వస్తాయనేది అపోహ మాత్రమే. అతిగా తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. కానీ ఊబకాయం సమస్య ఉన్న వారు మాత్రం ఎక్కువ సార్లు భోజనం చేస్తేనే లాభం అని చెబుతున్నారు. దీంతో అధిక బరువును నియంత్రించుకోవడానికి ఆరుసార్లు భోజనం చేస్తేనే ప్రయోజనం. బరువు తగ్గడానికి ఇలా చేస్తే మేలు కలుగుతుందని తెలుస్తున్న నేపథ్యంలో జీవన శైలిలో మార్పులు చేసుకుని ఎక్కువసార్లు తినేందుకు నిర్ణయించుకుంటే లాభమే.
ఉదయం తొమ్మిది గంటల నుంచి ఐదు గంటల వరకు ఉద్యోగం చేసే వారికి ఆరుసార్లు భోజనం చేయడం కష్టమే. కానీ కేలరీలు ఎక్కువగా ఉండే ఆహారం తక్కువసార్లు తీసుకున్నా మంచిదే. రోజుకు మూడు లేదా ఆరు సార్లు తినొచ్చు. కేలరీల పరంగా అధిక ప్రొటీన్లు ఉండే ఆహారాలను తీసుకుని బరువు తగ్గించుకునేందుకు కట్టుబడి ఉండాలని నిపుణులు చెబుతున్నారు.