https://oktelugu.com/

Quitting Alcohol: మద్యం ను ఒకేసారి మానేస్తున్నారా? చాలా డేంజర్.. అయితే ఇలా చేయండి..

మద్యపానం హానికరం అని పెద్ద పెద్ద బోర్డులు కనిపిస్తున్న చాలామంది మద్యం మానేయడానికి అస్సలు ఇష్టపడరు. కొంతమంది ఒత్తిడిని తట్టుకోవడానికి.. మరి కొంతమంది సరదాకు నిత్యం మద్యం సేవిస్తూ ఉంటారు..

Written By: , Updated On : March 12, 2025 / 04:21 PM IST
Drinking-alcohol

Drinking-alcohol

Follow us on

Quitting Alcohol: మద్యపానం హానికరం అని పెద్ద పెద్ద బోర్డులు కనిపిస్తున్న చాలామంది మద్యం మానేయడానికి అస్సలు ఇష్టపడరు. కొంతమంది ఒత్తిడిని తట్టుకోవడానికి.. మరి కొంతమంది సరదాకు నిత్యం మద్యం సేవిస్తూ ఉంటారు.. ఒక్కరోజు మధ్యలో లేకపోతే మానసికంగా ఇబ్బందులు గురి అయ్యే వారు చాలామంది ఉన్నారు. అయితే మద్యం వల్ల అనేక రోగాలు దరి చేరుతాయి. ఈ విషయాన్ని గ్రహించడం కొందరు మద్యం మానేయాలని అనుకుంటారు. కానీ మద్యం సేవించడం ఎంత ఇష్టమో.. దానిని వదులుకోవడం అంత కష్టమే అని కొందరు ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ఎందుకంటే ఒకేసారి మద్యం మానేయడం వల్ల అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుందని అంటున్నారు. మరి మద్యం మానేయడానికి ఎలాంటి చిట్కాలు పాటించాలో ఇప్పుడు చూద్దాం..

కొందరు వైద్యులు చెబుతున్న ప్రకారం.. ఒకేసారి మద్యం మానివేయడం వల్ల.. మూడు రోజుల్లోనే ప్రతికూల పరిస్థితులు ఎదుర్కొంటారని అంటున్నారు. ఇలా మద్యం మానేసిన వారిలో మానసిక సమస్యలు ఉంటాయి. నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఒక్కోసారి కోమాల్లోకి వెళ్లే అవకాశం కూడా ఉంటుంది. మద్యం లేకపోవడం వల్ల ఏ పని చేయలేక పోతారు. ఫలితంగా తీవ్ర ఒత్తిడికి గురై గుండెకు కూడా హాని కలిగే అవకాశం ఉంది. అందువల్ల కొన్ని పద్ధతుల ద్వారా మద్యం ను మానేయాలని వైద్యులు చెబుతున్నారు. అవేంటంటే.

కొంతమందిలో మద్యం తాగినప్పుడు వారిలో ఎక్కడలేని శక్తి వస్తుంది. ఇది ఒక్కసారిగా లేకుండా పోయినప్పుడు వారిలో రోగ నిరోధక శక్తి తగ్గుతుంది. అయితే దీనిని పూడ్చడానికి ఎక్కువగా ఆహారం తీసుకోవాలి. రకరకాల ప్రోటీన్లు ఉండే ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవడం వల్ల మద్యం జోలికి పోకుండా ఉంటారు. క్రమంగా మద్యం మానివేసే అవకాశం ఉంటుంది.

మద్యం ను ఒకేసారి దూరం పెట్టకుండా.. మెల్లిమెల్లిగా తగ్గిస్తూ ఉండాలి. ఉదాహరణకు ఒకరోజు 180 ఎం.ఎల్ మద్యం తాగే వారు అయితే.. మరో రోజు 160 ఎంఎల్ తగ్గించుకోవాలి. ఇలా రోజు లేదా రెండు రోజులకు ఒకసారి తగ్గిస్తూ చివరకు పూర్తిగా మానేయవచ్చు.

మద్యం స్థానంలో మరొక అలవాటు చేసుకోవాలి. అయితే ఇది ఆరోగ్యకరమైనదే ఉండాలి. ఉదాహరణకు తేనె నీళ్లు, నిమ్మరసం వంటివి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసుకోవాలి. మద్యం తాగాలని అనిపించినప్పుడు వాటి స్థానంలో మళ్లీ కూల్ డ్రింకులను చేర్చుకోవద్దు. ఎందుకంటే ఇవి మద్యం కంటే ప్రమాదకరం. లిక్విడ్ కి సంబంధించి ఆరోగ్యం ఇచ్చే రసాలను తాగడం అలవాటు చేసుకోవడం ద్వారా మెల్లగా మద్యాన్ని దూరంగా ఉంచుకోవచ్చు.

ఎన్ని పద్ధతుల ద్వారా మద్యం ను దూరం పెట్టలేక పోతే.. ఇతరుల సహాయం తీసుకోవాలి. అంటే మానసిక నిపుణుల వద్దకు వెళ్లి వారు చెప్పిన పద్ధతులను పాటించాలి. ఎందుకంటే మద్యం ను మానేయాలని క్రమంలో సొంతంగా ఇటువంటి మెడిసిన్ వాడొద్దు. ఇవి శరీరంపై తీవ్ర ప్రభావాన్ని చూపి కొత్త రోగాలను తీసుకొస్తాయి. అందువల్ల మద్యం ను మానేయాలని అనుకునేవారు సున్నితంగా దాన్ని దూరంగా ఉంచాలి. అలా కాకుండా ఒకేసారి దూరం పెట్టడం వల్ల కిడ్నీ లేదా ఇతర అవయవాలపై ప్రభావం చూపుతాయి.