Lending Money: ఈ ప్రపంచంలో అందరి వద్ద ఆదాయం సమానంగా ఉండదు. ఒకరి వద్ద ఎక్కువ డబ్బు ఉన్నప్పుడు పక్కనున్న వాడి వద్ద తక్కువగానే ఉంటుంది. ఇలా డబ్బు ఎక్కువ తక్కువలో ఉండి.. అవసరాలు మాత్రం సమానంగా ఉండడంతో కొందరికి డబ్బు అవసరం పడుతుంది. దీంతో అప్పు చేయాల్సి వస్తుంది. అప్పు చేయడం ఎప్పటికీ తప్పు కాదు. కానీ ఆ అప్పును సక్రమంగా తీర్చడమే అసలైన విధి. అయితే చాలామంది అప్పు తీసుకునే సమయంలో బాగానే ఉంటారు.. కానీ ఇచ్చే సమయంలో మాత్రం మోసం చేయడానికి ప్రయత్నిస్తారు. సరైన సమయానికి ఇవ్వకుండా.. వేధింపులకు గురిచేస్తారు. అయితే ఒకరికి అప్పు ఇవ్వడం వల్ల నాలుగు రకాల అనుభవాలను సాధిస్తారు. ఇవి ఒక రకంగా ప్రయోజనమే అనుకోవచ్చు. ఆ నాలుగు రకాల ప్రయోజనాలు ఏంటో ఇప్పుడు చూద్దాం..
ఫోన్ చేయడం తప్పుతుంది:
సాధారణంగా పక్కన మంచిగా ఉన్నవారే అప్పు అడగడానికి ప్రయత్నిస్తారు. వారు అడిగారు కదా అని.. మొహమాటానికి పోయి అప్పును ఇవ్వాల్సి వస్తుంది. అయితే అప్పటివరకు ఏదో రకంగా అప్పు కావాలని ఫోన్ చేసేవారు.. అప్పటినుంచి ఫోన్ చేయడం మానుకుంటారు. అంతేకాకుండా కొత్తగా అప్పు అడిగే వారు సైతం అడగకుండా ఉంటారు. ఎందుకంటే ఇప్పటికే వేరొకరికి అప్పు ఇచ్చామని చెప్పుకోవచ్చు. ఇలా మిగతా వారి అప్పుల బాధ నుంచి తప్పించుకునే అవకాశం ఉంటుంది.
డబ్బు అవసరం ఉండదు:
అప్పు తీసుకునే ముందు వారితో స్నేహంగా ఉంటాము కాబట్టి.. వారి కోసం అప్పటివరకు ఖర్చు చేయాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఒక్కసారిగా వారు అప్పు తీసుకున్న తర్వాత ఎదుటివారి కోసం ఖర్చు చేయాలని అనిపించదు. దీంతో అప్పటినుంచి డబ్బు ఖర్చు కాకుండా ఉంటుంది.
మోసం:
ఒకసారి డబ్బు అప్పు ఇచ్చిన తర్వాత ఎవరైనా సక్రమంగా చెల్లిస్తే ఎటువంటి సమస్య ఉండదు. కానీ అలా చెల్లించ లేనప్పుడు మోసపోయామన్నా బాధ కలుగుతుంది. ఈ అనుభవంతో మరోసారి మరొకరికి అప్పు ఇవ్వకుండా ఉంటాం. అంతేకాకుండా అప్పటివరకు తాము మోసపోయామని చెబుతూ ఇతరుల నుంచి తప్పించుకోవచ్చు.
నో చెప్పుకోవచ్చు:
అప్పటివరకు ఎవరైనా తెలిసినవారు అప్పు అడిగితే బిడియం ఉంటుంది. కానీ అప్పటినుంచి ఇక తమ దగ్గర డబ్బులు లేవని స్ట్రాంగ్ గా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అప్పటికే ఏదో రకంగా ఖర్చు అయ్యాయని వివరించవచ్చు. ఇలా చెప్పడం వల్ల వారు కూడా అర్థం చేసుకొని సంబంధాలు కట్ చేయకుండా కొనసాగిస్తారు.
ఈ విధంగా నాలుగు రకాలుగా అప్పు బాధల నుంచి బయటపడవచ్చు. చాలావరకు తెలిసిన వారే అప్పులు అడుగుతారు. ఇలా తెలిసినవారు అప్పులు అడిగి మోసం చేస్తే.. తెలియని వారికి అప్పులు చేయకుండా జాగ్రత్త పడతాం. ఒకరకంగా మనల్ని మనం రక్షించుకున్నట్లు అవుతాం. అయితే మొదటి సారి అప్పు ఇచ్చేటప్పుడు పెద్ద మొత్తంలో కాకుండా తక్కువ మొత్తంలో ఇచ్చే ప్రయత్నం చేయండి. ఎందుకంటే తమ దగ్గర ఎక్కువ మొత్తంలో డబ్బు లేదని బాధపడుతూ ఎంతో కొంత ఇవ్వడం ద్వారా ఎదుటివారు కొంచమైనా సంతోషపడతారు.