Children: ఈమధ్య కాలంలో స్మార్ట్ ఫోన్ వాడకం చాలా ఎక్కువైంది. పెద్దల నుంచి చిన్న పిల్లల వరకూ అందరూ స్మార్ట్ ఫోన్ వినియోగిస్తున్నారు. ఇక కొంతమంది తల్లిదండ్రులే తమ పిల్లలకు ఫోన్లు చూడమని ఇస్తున్నారు. రెండు, మూడేళ్ల పిల్లలు కూడా ఫోన్ చూస్తేనే అన్నం తినే పరిస్థితి వచ్చింది. క్రమంగా ఇది అలవాటుగా మారి వయసు పెరుగుతున్న కొద్దీ ఫోన్ చూడడం వ్యసనంగా మారుతోంది. పిల్లలు ఏడ్చినప్పుడు, తమ పనికి ఆటంకం కలిగినప్పుడు కూడా ఫోన్ చేతికి ఇచ్చి చూడమని చెబుతున్నారు.
ఫోన్ చూస్తేనే భోజనం..
ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో రెండేళ్ల కన్నా తక్కువ వయసు ఉన్న పిల్లల్లో 90 శాతం మంది సెల్‌ఫోన్ చూస్తేనే అన్నం తింటున్నట్లు తేలింది. ఇందుకు బాధ్యులు తల్లిదండ్రులే అని సేపియన్ ల్యాబ్స్ చేసిన సర్వేలో గుర్తించారు. è మ పిల్లలు మారాం చేయకుండా కండుపు నిండా తింటే చాలు అని సెల్‌ఫోన్ ఇవ్వడం మొదలు పెడుతున్నారు. దానితో కలిగే దుష్ప్రభావాలను పట్టించుకోవడం లేదు. 40కిపైగా దేశాల్లో చేసిన ఈ సర్వేలో అనేక దుష్పరిణామాలు ఉంటాయని నిర్ధారణ అయింది.
ఈ ప్రమాదాలు..
= ఎక్కువగా సెల్‌ఫోన్ చూడడం వలన మానసికంగా, శారీరకంగా కూడా చెడు ప్రభావం పడుతుంది. పిల్లలు ఎక్కువగా స్మార్ట్ ఫోన్ చూస్తే అది మెదడుపై ప్రభావం చూపుతుంది.
= సెల్‌ఫోన్ చూసే ప్రతీ పిల్లల్లో నలుగురికంటే ఎక్కువగా ఒంటరిగా ఉండడానికి ఇష్టపడతారు. ఎవరితో మాట్లాడరు. ఇది దీర్ఘకాలిక సమస్యకు దారితీస్తుంది.
= ఫోన్ చూస్తూ భోజనం చేయడం వలన వారు ఏం తింటున్నారు అన్నది కూడా గమనించరు. దీంతో వాళ్లు తినే ఆహారం చురి కూడా తెలియకుండా పోతోంది. .
= తిండి ఎలా ఉంది కూడా అర్థం చేసుకోర. కొంతమంది ఫోన్ చూస్తూ ఎక్కువగా అన్నం తినేస్తుంటారు. కొందరు తక్కువగా తింటారు. ఈ కారణంగా ఊబకాయం లేదా, బలహీనంగా మారిపోయే ప్రమాదం ఉంది.
= ఎక్కువగా ఫోన్ చూడడం వలన చిన్న వయసులోనే కంటిచూపు దెబ్బతింటుంది. కళ్లజోడు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. చిన్నప్పటి నుంచి స్క్రీన్ దగ్గరగా చూడడం వలన రెటీనా దెబ్బతినే అవకాశం ఉంది.
= ఫోన్ చూస్తూ అన్నం తినడం వలన తల్లీ బిడ్డల బంధంపై చెడు ప్రభావం పడుతుంది.
= మరో ప్రమాదకరమైన విషయం ఏమిటంటే అధికంగా ఫోన్ వాడినవారిలో ఆత్మహత్య ఆలోచనలు, కోపం, రియాలిటీకి దూరంగా ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయని సేపియన్ ల్యాబ్స్ సర్వేలో నిర్ధారణ అయింది.