Cousin Marriage: పెళ్లంటే నూరేళ్ల పంట. ఇక పెళ్లి చేసుకోవాలంటే అటు ఏడు తరాలు ఇట ఏడు తరాలు చూసి మరీ పెళ్లి చేసుకోవాలి అంటారు పెద్దలు. కానీ ఇప్పుడు ఇన్ స్టాలో ఎవరిని ఫాలో అవుతున్నారు? వాట్సాప్ లో ఎవరితో చాటింగ్ చేస్తున్నారు అని తెలుసుకొని పెళ్లి చేసుకోవాలి అంటున్నారు యూత్. ఏది ఏమైనా కొన్ని సార్లు పెళ్లి చేసుకోవాలంటే కూడా భయపడే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇక పెళ్లి సంబంధాలకు వెళ్తే అబ్బాయి ఏం చేస్తాడు, ఎంత సంపాదిస్తాడు? ఎక్కడ ఉద్యోగం అని తెలుసుకుంటారు.
కానీ మేనరికం లో ఎవరైనా మంచి అబ్బాయి ఉన్నా, అమ్మాయి ఉన్నా కూడా పెళ్లి చేయాలి అనుకుంటారు పెద్దలు. గతంలో మా ఆస్తులు ఇతరలు అనుభవించడం ఏంటి అని.. మేనరికం వారిని మాత్రమే చేసుకునేవారు. కానీ ఇప్పుడు అలా చేసుకోవద్దు అంటున్నారు డాక్టర్లు. మేనరికం పెళ్లి చేసుకుంటే చాలా సమస్యలు వస్తాయట. అందుకే ఈ పెళ్లిళ్ల మీద అవగాహన ఉండాలి అంటున్నారు నిపుణులు. ఇంతకీ మేనరికం పెళ్లి చేసుకుంటే ఏం జరుగుతుందో తెలుసా?
మేనరికం, దగ్గరి బంధువులను పెళ్లి చేసుకుంటే పుట్టబోయే పిల్లలకు జన్యుపరమైన వ్యాధులతో పాటు ఇతర వ్యాధులు కూడా వస్తాయట. అందులో ముఖ్యంగా నేత్ర సంబంధ సమస్యలు వచ్చే ఆస్కారం ఎక్కువగా ఉంటుంది అంటున్నారు వైద్యులు. అందుకే ఈ పెళ్లి చేసుకునే ముందు ఆలోచించాలట.
ఎల్వీ ప్రసాద్ ఆస్పత్రిలో చేసిన ఓ అధ్యయనంలో ఈ విషయం వెల్లడైంది. అయితే కార్నియాలో మచ్చలు, శుక్లాలు, రెటినైటిస్ పిగ్మెంటోసా, గ్లకోమా తలెత్తే ముప్పు ఉందని తేలింది. ఇలా వివాహం చేసుకుంటే పూర్తిగా కన్ను దెబ్బతింటుందట. ముందే సమస్యలను గుర్తిస్తే శస్త్ర చికిత్సల ద్వారా, మందుల ద్వారా నయం చేయవచ్చు అంటున్నారు వైద్యులు.