Eggs: పచ్చ సొన లేని గుడ్లు ఉంటాయా? వాటిని తినొచ్చా?

కోడిగుడ్డు సాధారణంగా 65 గ్రాముల బరువు ఉంటుంది. ఉడికించిన గుడ్డులో పొటాషింయ, ఐరన్, జింక్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఒక గడ్డు 6.29 గ్రాముల ప్రోటీస్ ఇస్తుంది. దీంతో 78 క్యాలరీల శక్తి అందుతుంది.

Written By: Chiranjeevi Appeesa, Updated On : October 27, 2023 4:46 pm

Eggs

Follow us on

Eggs: గుడ్డు ఆరోగ్యానికి మంచిది. రోజుకు ఒక కోడి గుడ్డు తినాలని వైద్యులే పేర్కొంటారు. గుడ్డులో నేచురల్ ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి. ఇది తిన్న వెంటనే తక్షణ శక్తి వస్తుంది. అయితే కోడి గుడ్లు కనీసం రెండు నుంచి మూడు తినొచ్చు. అంతకుమించి తినడం వల్ల అనారోగ్యమేనని కొందరు ఆరోగ్య నిపుణులు చెబుతూ ఉంటారు. అంతేకాకుండా గుడ్డులోని పచ్చ సోనాను తీసేసి తినడం వల్ల ఎలాంటి ఎఫెక్ట్ ఉండదని కొందరు చెబుతూ ఉంటారు. కానీ దీనిని తీసేయడంతో సరైన ప్రోటీన్లు అందవు. కొన్ని సందర్భాల్లో మాత్రమే కేవలం వైట్ గుడ్డును తినాలంటారు. అయితే అసలు పచ్చ సోనా లేకుండా ఉండే గుడ్డును తింటే బెటర్ కదా? అని కొందరు సందేహం వచ్చే ఉంటుంది. మరి పచ్చ సోనా లేని గుడ్లు ఉంటాయా? వాటిని తినడం వల్ల ఏమైనా నష్టాలున్నాయా?

కోడిగుడ్డు సాధారణంగా 65 గ్రాముల బరువు ఉంటుంది. ఉడికించిన గుడ్డులో పొటాషింయ, ఐరన్, జింక్, విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ఒక గడ్డు 6.29 గ్రాముల ప్రోటీస్ ఇస్తుంది. దీంతో 78 క్యాలరీల శక్తి అందుతుంది. గుడ్డు తినడం వల్ల శరీరానికి మంచిదే. ప్రతిరోజు గుడ్డు తినేవారిలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉండవని చెబుతారు. అయితే గుడ్డులో ఉండే పసుపు పచ్చ సోనా కాస్త డిఫరెంట్ గా ఉంటుంది. ఇది తినడం వల్ల శరీరం హీటెక్కుతుందన్న అభిప్రాయం ఉంది. కానీ ఇందులోనే ఎక్కువ పోషకాలు ఉంటాయంటున్నారు.

అయితే ఈమధ్య కొందరు పచ్చ సోనా లేని గుడ్లను కోరుకుంటున్నారు. అలాంటివి ఉంటాయా? అంటే ఉంటాయి. గుడ్డులో ఎలాంటి పచ్చ సోనా లేకుండా మొత్తం వైట్ గుడ్డు మాత్రమే ఉంటుంది. ఒక కోడి మొదటిసారి గుడ్డు పెట్టినప్పుడు పచ్చ సోనా లేని గుడ్డు ఉత్పత్తి అవుతుంది. అలాగే ఆ కోడిలో పునరుత్పత్తి అయ్యే కణాలు నశించిపోయినప్పుడు కూడా పచ్చ సోనా లేని గుడ్లు ఉత్పత్తి అవుతాయి. ఒక కోడి గుడ్డు పెట్టడానికి 27 గంటల సమయం పడుతుంది. ఈ క్రమంలో ఆ కోడి తీవ్రమైన ఉష్ణోగ్రతతో ఒత్తితిడితో కలిగి ఉంటుంది. ఇలాంటి సమయంలో పచ్చసోనా లేని గుడ్లు ఉత్పత్తి అవుతాయి.

వాస్తవానికి పచ్చ సోనా ఉన్న గుడ్లను తినడం వల్ల ఎలాంటి నష్టం లేదు. ప్రత్యేకంగా గర్భిణులు పచ్చసోనా ఉన్న గుడ్లను మాత్రమే తినాలని వైద్యులు చెబుతూ ఉంటారు. పచ్చ సోనా లేని గుడ్లలో పోషకాలు తక్కువగా ఉంటాయి. కానీ తినడానికి సౌకర్యంగా ఉంటుంది. పచ్చ సోనా లేని గుడ్లను తినడం వల్ల ఎలాంటి అపాయం లేదు. నిరభ్యంతరంగా తినొచ్చు అని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు. అయితే వీటిని ప్రత్యేకంగా ఎక్కడా విక్రయించరు. కానీ ఇటీవల ఈ గుడ్లను కోరుకుంటున్నారు.