https://oktelugu.com/

Teeth Health Tips: ఈ చిన్న చిట్కా ద్వారా పసుపు దంతాలను తెల్లగా మార్చుకోండి..

ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఎన్నో వ్యర్థాలు ఉంటున్నాయి. వీటిలో కొన్ని నోటి దగ్గరే ఆగిపోతాయి. ఇవి నోటిలో ఉండే పళ్లలలోనే ఆగిపోయి దంతాలు పాడయ్యేలా చేస్తాయి.

Written By:
  • Shiva
  • , Updated On : August 17, 2023 5:37 pm
    Teeth Health Tips

    Teeth Health Tips

    Follow us on

    Teeth Health Tips: తల వెంట్రుకల నుంచి కాలి గోటి వరకు శరీరంలోని ప్రతీ పార్ట్ ఇంపార్టెంటే. వీటిలో దంతాలు కూడా ముఖ్యమే. ఘన పదార్థాలను నమలడానికి పళ్లు ఉపకరిస్తాయి. అలాగే ఆహారం త్వరగా జీర్ణం కావడానికి నోటిలోనే పిండి చేసే విధంగా దంతాలు సహకరిస్తాయి. ఇలాంటప్పుడు వీటిని ఆరోగ్యంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంది. అయితే దంతాలు కొన్ని సందర్భాల్లో పసుపులా మారుతాయి. ఇవి చూడ్డానికి అసహ్యంగా ఉండడమే కాకుండా ఆహారాన్ని కలుషితం చేస్తాయి. దీనిని తొలగించడానికి కొందరు ఎన్ని మెడిసిన్స్ వాడినా ఫలితం ఉండదు. ఇలాంటప్పుడు ఇంట్లో దొరికే కొన్ని వస్తువులతో కొన్ని మిశ్రమాలనుతయారు చేసుకొని ఈ పసుపు కలర్ ను పోగొట్టి తెల్లగా మార్చుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు చూద్దాం..

    ప్రతిరోజూ మనం తినే ఆహారంలో ఎన్నో వ్యర్థాలు ఉంటున్నాయి. వీటిలో కొన్ని నోటి దగ్గరే ఆగిపోతాయి. ఇవి నోటిలో ఉండే పళ్లలలోనే ఆగిపోయి దంతాలు పాడయ్యేలా చేస్తాయి. ముఖ్యంగా జింక్ ఫుడ్ ను తిన్న తరువాత దంతాలను సరిగా శుభ్రం చేసుకోకపోవడం వల్ల దంతాలపై గారె లాంటి పదార్థం చేరుతుంది. ఇది అలాగే పేరుకుపోయి తెల్లటి పళ్లను పసుపు కలర్లోకి మారేలా చేస్తాయి. ఇది పోవాలంటే కొన్ని చిట్కాలు పాటించవచ్చు.

    ఒక ఈనో పౌడర్ ప్యాకెట్ ను చింపి ఒక గిన్నెలో వేయాలి. ఆ తరువాత అందులో నిమ్మరసాన్ని వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని వేలితో గాని, బ్రష్ తో గానీ రెండు నిమిషాల పాటు బాగా శుభ్రం చేసుకోవాలి. ఆ తరువాత నోటిని శుభ్రం చేసుకోవాలి. ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల నోట్లో ఉన్న బాక్టీరియా అంతా పోతుంది. దీంతో దంతాలు తళతళా మెరుస్తాయి.

    పసుపు దంతాలను పోగొట్టడానికి మరో చిట్కాను కూడా ఉపయోగించవచ్చు. ఉప్పు, పసుపు, నిమ్మచెక్కను కలిపి దీనిని తయారు చేసుకోవాలి. ఒక నిమ్మచెక్కను తీసుకొని దానిపై ఉప్పు రాయాలి. ఆ తరువాత చిటికెడు పసుపు వేయాలి. అలాగే నిమ్మచెక్కతో దంతాలను శుభ్రం చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల దంతాలపై ఉన్న గారె తొలిగిపోతుంది. ఇవే కాకుండా టూత్ పేస్ట్ పై కొద్దిగా ఉప్పు కలిపి దంతాలను శుభ్రం చేసుకోవడం వల్ల కూడా దంతాలు తెల్లగా మారుతాయి. అయితే ఇవి ఎలాంటి అనారోగ్యం లేని వారు మాత్రమే ప్రయత్నించాలని తెలుపుతున్నారు వైద్యులు.