Jobs In Prakasham District: ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిషత్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి సిద్ధమైంది. అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగ ఖాళీల కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. పది, ఇంటర్ చదువుతున్న వాళ్లకు ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భారీస్థాయిలో ప్రయోజనం చేకూరనుందని తెలుస్తోంది. 18 సంవత్సరాల నుంచి 42 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హులు.

ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు 12,000 రూపాయల నుంచి 28,000 రూపాయల వరకు వేతనం లభిస్తుంది. పది, ఇంటర్, డిప్లొమా పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని చెప్పవచ్చు. సంబంధిత పనిలో అనుభవం ఉన్నవాళ్లు మాత్రమే ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది. అనుభవం, రిజర్వేషన్, అకడమిక్ మెరిట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపిక ప్రక్రియ జరగనుంది.
Also Read: AP Assembly: ఏపీ అసెంబ్లీలో చిడతలు వాయించిన టీడీపీ.. భజన చేసుకోవాలన్న స్పీకర్
ఓసీ అభ్యర్ధులకు దరఖాస్తు రుసుము 300 రూపాయలు కాగా ఎస్సీ,ఎస్టీ, బీసి, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు 200 రూపాయలుగా ఉంది. వికలాంగ అభ్యర్థులకు మాత్రం ఫీజు మినహాయింపు లభిస్తుంది. డిస్రిక్ట్ కో ఆర్డినేటర్ ఆఫ్ హాస్సిటల్ సర్వీసెస్, ఒంగోల్, ప్రకాశం జిల్లా, ఆంధ్రప్రదేశ్ అడ్రస్ కు ఆఫ్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన దరఖాస్తులను పంపాల్సి ఉంటుందని తెలుస్తోంది.
https://prakasam.ap.gov.in/ వెబ్ సైట్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. 2022 సంవత్సరం మార్చి 26వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీగా ఉండనుంది.
Also Read: RRR Viral: ఆర్ఆర్ఆర్ థియేటర్ తెరల ముందు మేకులు, ఇనుప కంచెలు