Apartment: ప్రస్తుతం రోజుల్లో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తున్న వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతుంది. ఇండిపెండెంట్ ఇల్లు ఈ మధ్య కాలంలో అసలు కనిపించడం లేదు. పల్లెటూరిలో అయితే ఇండిపెండెంట్ ఇళ్లు ఉంటాయి. కానీ సిటీలో అయితే ఎక్కువగా అపార్ట్‌మెంట్‌లు కనిపిస్తాయి. ఉద్యోగాలు, ఉపాధి కోసం చాలా మంది గ్రామాల నుంచి పట్టణాలకు వస్తుంటారు. ఈ క్రమంలో బిల్డర్లు ఎక్కువగా అపార్ట్‌మెంట్‌లు నిర్మించి విక్రయిస్తున్నారు. ముఖ్యంగా మెట్రో నగరాల్లో అయితే చెప్పక్కర్లేదు. ఎటు చూసిన కూడా పెద్ద పెద్ద అపార్ట్‌మెంట్‌లే కనిపిస్తాయి. వీటివల్ల ఏటా వాయు కాలుష్యం కూడా పెరుగుతోంది. దీంతో ప్రజలు అనారోగ్య సమస్యల బారిన పడుతున్నారు. ముఖ్యంగా ముంబై, పూణే, ఢిల్లీ వంటి ప్రాంతాల్లో అయితే ఇప్పటికే గాలి నాణ్యత తగ్గిపోయింది. దీంతో చాలా మంది అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. వాయు కాలుష్యం వల్ల ఎక్కువగా శ్వాసకోశ సమస్యలు వస్తాయి. చిన్న పిల్లల నుంచి పెద్ద వాళ్ల వరకు చాలా మంది కూడా ఈ సమస్య బారిన పడుతున్నారు. అయితే ఎక్కువ శాతం మంది సిటీలో అపార్ట్‌మెంట్‌లో నివసిస్తారు. అందులోనూ బాగా ఎత్తులో ఉంటారు. చాలా మంది ఇలా ఎత్తులో ఉండటానికి ఇష్టపడతారు. ఎందుకంటే ఎత్తులో ఉంటే సిటీ కనిపిస్తుందని, రిలీఫ్ అవుతుందని భావిస్తారు. కానీ పైన అంతస్తులో ఉంటే రిలీఫ్ కంటే అనారోగ్య సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి పైన అంతస్తులో ఉంటే వాయు కాలుష్యం తప్పదా? ఎన్నో అంతస్తులో ఉండాలి? అనే పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం.
ఏ అంతస్తులో ఎక్కువ కాలుష్యం ఉంటుందంటే?
తక్కువ ఎత్తులో పెద్దగా కాలుష్యం ఉండదు. ఎక్కువ ఎత్తులో నివసిస్తే మాత్రం వాయు కాలుష్యం తప్పదని నిపుణులు అంటున్నారు. ఒక 15 అంతస్తుల వరకు ఎలాంటి వాయు కాలుష్యం ఇబ్బంది ఉండదు. కానీ 16వ అంతస్తు నుంచి నివసిస్తే మాత్రం తప్పకుండా వాయు కాలుష్యం సమస్య ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దీనవల్ల శ్వాసకోశ సమస్యలు, అనారోగ్య సమస్యలు, క్యాన్సర్ వంటివి వస్తాయని నిపుణులు చెబుతున్నారు. 15 కంటే ఎక్కువ అంతస్తులో నివసిస్తుంటే మాత్రం గాలి నాణ్యత కోసం ఎయిర్ ప్యూరిఫైయర్లు వంటివి ఉపయోగించాలి.
ఈ సమస్యలు తప్పవు
వాయు కాలుష్యం వల్ల ఓజోన్ కూడా దెబ్బతింటుంది. దీంతో సూర్య కిరణాల ఎఫెక్ట్ పడుతుంది. పైన అంతస్తులో ఉండే వాయు కాలుష్యం వల్ల అకాల మరణం, ఊపిరితిత్తులు దెబ్బతినడం, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి సమస్యలు వస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. గాలి నాణ్యతను పెంచుకోవడానికి ఇంట్లో మొక్కలు పెంచాలి. ఎక్కువగా కాలుష్యం పెరిగే పనులు చేయకూడదు. ఇంట్లోకి కాలుష్యం రాకుండా జాగ్రత్త పడాలి. కార్బన్ డై ఆక్సైడ్‌ను తగ్గించి ఆక్సిజన్‌ను పెంచే ఇండోర్ ప్లాంట్స్ కూడా ఎక్కువగా పెంచుకోవాలి. వీటివల్ల కొంతవరకు వాయ కాలుష్యం సమస్య నుంచి విముక్తి పొందుతారని నిపుణులు చెబుతున్నారు.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే ఇవ్వడం జరిగింది. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ విషయాలు అన్ని కూడా కేవలం గూగుల్ ఆధారంగా మాత్రమే తెలియజేయడం జరిగింది.