I dont care
Anyone Says: జీవితంలో ఏదైనా సాధించాలని చాలామంది తపన పడుతూ ఉంటారు. అయితే అనుకున్న గమ్యాన్ని అందరూ చేరుకోలేరు. అందుకోసం పట్టుదలతో పాటు ఓర్పు ఉండాలి. ఇదే సమయంలో ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళ్లాలి. సమాజంలో మంచివారు చెడ్డవారు ఇద్దరు ఉంటారు. మంచి వారితో స్నేహం చేస్తే జీవితం బాగుంటుంది. చెడ్డవారితో నడిచిపెట్టడం వల్ల అయోమయంగా మారుతుంది. అయితే మంచి వారెవరో చెడ్డవారెవరో తెలుసుకోవడం చాలా ఇష్టమైన పరిస్థితి. వీటిలో ప్రధానంగా తెలుసుకునేది ఏంటంటే.. ఒక వ్యక్తి ఒక పని చేసినప్పుడు ఎదుటివారు దూషిస్తూ ఉంటారు.. లేదా విమర్శిస్తూ ఉంటారు.. ఇలాంటి వారికి మాత్రం దూరంగా ఉండాలని మానసిక నిపుణులు తెలుపుతున్నారు. ఎందుకంటే ఇలాంటి వారితో స్నేహం చేయడం వల్ల ఎప్పటికైనా ప్రమాదమేనని పేర్కొంటున్నారు. అయితే అనుకోకుండా వీరు కలిసి ఉంటే అప్పుడు ఏం చేయాలి?
ఒక పనిని చేసినప్పుడు దానిని కొందరు ప్రశంసిస్తారు. మరికొందరు విమర్శిస్తారు. అయితే ప్రశంసలు వచ్చిన సమయంలో సమాజం ఒకలా మాట్లాడుతుంది. విమర్శలు వచ్చినప్పుడు మరోలా మాట్లాడుతుంది. ఇలా దేనినైనా ఎదుర్కొనే శక్తి ఉంటేనే ఏ పనైనా పూర్తి చేయగలుగుతారు. అంటే ఒకరు తన గురించి ఏదో మాట్లాడుకుంటున్నారు.. వారి వల్ల నేను ఏం పని చేయలేకపోతున్నాను.. అనే భావన ఉండడం వల్ల ముందుకు వెళ్లలేరు. ఎవరు ఏమనుకున్నా.. లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకొని వాటికోసం ప్రయత్నిస్తూ ఉండాలి. ఇలాంటి సమయంలో లక్ష మాత్రమే కనిపించాలి. అయితే కొందరు పెద్దలు సూచనలు మాత్రం పాటించాలి. వారు చెప్పిన దానిని పాటిస్తూ సరైన మార్గమేంటో గుర్తించుకోవాలి.
ఒక పని చేసే సమయంలో కొందరు చెడిపోవాలని చూస్తారు. మరికొందరు మంచి జరగాలని చూస్తారు. ఈ విషయాన్ని గుర్తించిన తర్వాతే వారి విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం ఉంటుంది. మంచి చెప్పే వారి మాటలు ఎప్పుడూ బాగుంటాయి. వీరి మాటలు వినీ ముందుకెళ్లాల్సిన అవసరం ఉంటుంది. కానీ కొందరు చెడ్డవారు చెప్పే మాటలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా వారు తప్పుదోవ పట్టించి లక్ష్యాన్ని చేరకుండా అడ్డుకుంటారు.
ఒక వ్యక్తి ఒక పనిని చేపడితే అది తనకు సంబంధించినది అన్నట్లు భావించాలి. అంతేకాకుండా ఇతరులపై ఆధారపడుతూ వారు చెప్పిన ప్రతి సూచనలు పాటించాల్సిన అవసరం లేదు. అంతేకాకుండా ఒక పని పూర్తి చేసినప్పుడు ఏవైనా అడ్డంకులు ఏర్పడితే.. కొందరు విమర్శలు చేస్తారు. ఈ విమర్శలను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అలా పట్టించుకుంటే ఉన్నచోటే ఉంటారు. లక్ష్యంపై గురి పెడితే అనుకున్నది సాధిస్తారు.
ఎవరు ఏమనుకున్నా పర్లేదు.. చేయాలనుకున్న వారిని పూర్తి చేయాలనుకుంటే ఎప్పటికైనా పూర్తి చేస్తారు. ఎవరో ఏదో అంటున్నారని.. ఏదో చేస్తున్నారని.. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీసుకోవద్దు. జీవితంలో అన్నిటికంటే అత్యధికంగా బలాన్ని ఇచ్చేది ఆత్మవిశ్వాసం మాత్రమే. ఎక్కడ తన ఆత్మకు భంగం కలగకుండా ముందుకు వెళ్లడం ద్వారా కచ్చితంగా అనుకున్న పనిని పూర్తి చేస్తారు.. అయితే ఈ విషయంలో కొందరు స్నేహితులు లేదా బంధువులు తోడుగా ఉంటారు. వారికి అనుగుణంగా ఉండడంవల్ల కూడా విజయాన్ని సాధిస్తారు.