Homeక్రీడలుHardik Pandya: మరో ధోనినా.. అంత సీన్ హార్ధిక్ పాండ్యాకు ఉందా?

Hardik Pandya: మరో ధోనినా.. అంత సీన్ హార్ధిక్ పాండ్యాకు ఉందా?

Hardik Pandya
Hardik Pandya

Hardik Pandya: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 16వ ఎడిషన్ లో పెండింగ్ ఛాంపియన్ గుజరాత్ టైటాన్స్ తడబడుతోంది. గత ఏడాది అద్భుతమైన ప్రదర్శనతో లీగ్ లో అడుగుపెట్టిన తొలి ఏడాదే టైటిల్ కైవసం చేసుకుని అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది గుజరాత్ జట్టు. ఈ ఏడాది కూడా టైటిల్ ఫేవరెట్ జట్లలో ఒకటిగా బరిలోకి దిగింది జీటీ. అయితే ఈ ఏడాది ఆశించిన స్థాయిలో రాణించలేకపోతోంది. దీనికి తోడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా నిర్ణయాలు కూడా జట్టుకు ఇబ్బందికరంగా మారుతున్నాయి.

గుజరాత్ జట్టుకు సారధిగా వ్యవహరించి లీగ్ లో అడుగు పెట్టిన తొలి ఏడాదే కప్పును అందించి పెట్టాడు కెప్టెన్ హార్దిక్ పాండ్యా. గత సీజన్ లో జట్టు విజయం సాధించడంలో కీలకంగా వ్యవహరించాడు. బ్యాటింగ్, బౌలింగ్ తోపాటు కెప్టెన్ గా పాండ్యా తీసుకున్న నిర్ణయాలు జట్టుకు కలిసి వచ్చాయి. గత ఎడాది పరిస్థితులకు అనుగుణంగా బౌలింగ్ మార్పులతో అందరి మన్ననలు పొందిన హార్దిక్ పాండ్యా.. రాజస్థాన్ తో జరిగిన మ్యాచ్ లో తన నిర్ణయాలతో జట్టు ఓడిపోవడానికి కారణమయ్యాడు అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఈ మ్యాచ్ లో పాండ్యా తీసుకున్న వింత నిర్ణయాలతో విమర్శలు పాలవుతున్నాడు.

ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న మోహిత్ ని కాదని..

రాజస్థాన్ – గుజరాత్ జట్ల మధ్య ఆదివారం జరిగిన మ్యాచ్ లో కీలక ప్లేయర్ మోహిత్ శర్మను గుజరాత్ జట్టు కెప్టెన్ సరిగా వినియోగించుకోలేదు అన్న విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. గుజరాత్ ఆడిన చివరి మ్యాచ్ లో మోహిత్ శర్మకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది. అలాంటి కీలక బౌలర్ కు రెండు ఓవర్లు ఉన్నప్పటికీ.. చివరి ఓవర్ ను కొత్త కుర్రాడు నూర్ అహ్మద్ కు అప్పగించాడు హార్దిక్ పాండ్యా. అంతకు ముందు ఓవర్లో అశ్విన్ 3 బంతుల్లోనే పది పరుగులు చేయడంతో రాజస్థాన్ అప్పటికే మ్యాచ్ గెలిచే స్థితికి చేరిపోయింది. చివరి ఓవర్ లో ఏడు పరుగులు కాపాడుకోవాల్సిన స్థితిలో.. గుజరాత్ అభిమానులందరూ బంతి మోహిత్ కే ఇస్తారని అనుకున్నారు. ఎందుకంటే ఈ మ్యాచ్లో రెండు ఓవర్లు వేసిన మోహిత్ కేవలం ఏడు పరుగులు మాత్రమే ఇచ్చాడు. మిగిలిన బౌలర్లు అందరూ భారీగా పరుగులు ఇచ్చినా.. మోహిత్ చాలా పొదుపుగా బౌలింగ్ చేశాడు. ఈ స్థితిలో ఎవరైనా మోహిత్ శర్మకి బౌలింగ్ బాధ్యతలు అప్పగిస్తారు. కానీ, ఇక్కడ హార్దిక్ పాండ్యా వింత నిర్ణయం తీసుకున్నాడు. మోహిత్ శర్మను కాదని కొత్త బౌలర్లతో ప్రయోగాలు చేశాడు.

భారీ సిక్సర్ తో విజయం అందించిన హెట్మేయర్..

చివరి ఓవర్లో విజయానికి ఏడు పరుగులు కావాల్సిన దశలో.. క్రీజులో అరవీర భయంకరమైన హెట్మేయర్ ఉన్నాడు. ఈ ఓవర్ బౌలింగ్ చేసిన నూర్ అహ్మద్ వేసిన రెండో బంతికే భారీ సిక్సర్ బాదాడు హెట్మేయర్. దీంతో రాజస్థాన్ జట్టు విజయం సాధించింది. గుజరాత్ కు ఓటమి తప్పలేదు. దీంతో ఫ్యాన్స్ అంతా హార్దిక్ తెలివి తేటలపై జోకులు పేలుస్తున్నారు. హార్దిక్ కూడా ధోని అవ్వాలని అనుకున్నాడని, అందుకే నూర్ అహ్మద్ కు బంతి ఇచ్చాడని విమర్శలు చేస్తున్నారు. తొలి టీ20 వరల్డ్ కప్ ఫైనల్లో చివరి ఓవర్ హర్భజన్ సింగ్ వేస్తాడని అంతా అనుకుంటే.. ధోని మాత్రం జోగేంద్ర శర్మకు ఆ ఓవర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ మ్యాచ్ లో ఇండియా విజయం సాధించి వరల్డ్ కప్ గెలుచుకుంది. అలాగే హార్దిక్ పాండ్యా కూడా.. ఎవరి అంచనాలకు అందకుండా నిర్ణయం తీసుకోవాలని ట్రై చేశాడు. కానీ ఆ వ్యూహం బెడిసి కొట్టిందని విమర్శలు చేస్తున్నారు. అసలు ఈ మ్యాచ్ లో హార్దిక్ చేసిన బౌలింగ్ మార్పులు ఏవి బాగాలేవని కొందరు ఘాటుగానే విమర్శిస్తున్నారు. కనీసం మ్యాచ్ ఆరంభం నుంచి కూడా జట్టులో లేని నూర్ అహ్మద్ ను చివరి ఓవర్ లో ఉపయోగించుకోవడం ఏంటని నిలదీస్తున్నారు. తన నిర్ణయాలు వల్ల వస్తున్న సానుకూల ఫలితాలతో హార్దిక్ పాండ్యాలో అహంభావం పెరిగిపోయిందని.. అందుకే ఇటువంటి నిర్ణయాలు తీసుకుని జట్టుకు అపజయాన్ని అందించి పెట్టాడని అభిమానులు విమర్శిస్తున్నారు.

Hardik Pandya
Hardik Pandya

ప్రయోగాలతో సత్ఫలితం రాదు..

ప్రయోగాలతో అన్ని వేళల్లో సత్ఫలితాలు రావని, గుజరాత్ – రాజస్థాన్ మ్యాచ్ లో హర్డిక్ పాండ్యా ప్రయోగంతో అది తేలిపోయిందని పలువురు పేర్కొంటున్నారు. రెండు ఓవర్లు అద్భుతమైన బౌలింగ్ చేసిన బౌలర్ ను కాదని, కొత్త బౌలర్ కు బాల్ అప్పగించడం పెద్ద తప్పిదంగా అభిమానులు పేర్కొంటున్నారు. రానున్న మ్యాచుల్లో అయినా హార్దిక్ పాండ్యా ఈ తరహా నిర్ణయాలకు దూరంగా ఉండాలని, ఆరోజు ఎవరైతే సత్తా చాటుతున్నారో వారిని వినియోగించుకునేందుకు ప్రయత్నించాలని పలువురు అభిమానులు సూచిస్తున్నారు.

RELATED ARTICLES

Most Popular