https://oktelugu.com/

Android Phones: ఆండ్రాయిడ్ ఫోన్లు వారికి హెచ్చరిక.. ఇవి హ్యాక్ కావొచ్చు..

CERT పేర్కన్నదాని ప్రకారం అండ్రాయిడ్ 13 ఓఎస్ ను క్రిటికల్ గా పేర్కోంది. దీని ద్వారా సైబర్ నేరగాళ్లు ఈజీగా ఫోన్ ను తమ డివైజ్ కు యాక్సెస్ చేయగలుగుతారు. దీంతో ఎదుటివారి ఓఎస్ లో సొంత కోడ్ ను అమలు చేయడం, ఉన్నతమైన అధికారాలు పొందడం, వారి సమాచారాన్ని దొంగిలించడం వంటివి చేస్తారు.

Written By:
  • Srinivas
  • , Updated On : October 14, 2023 / 04:33 PM IST

    Android Phones:

    Follow us on

    Android Phones: మొబైల్ లేని చేతులు వెతికినా దొరకవు. ఇప్పుడున్న స్మార్ట్ ఫోన్లు దాదాపు ఆండ్రాయిడ్ ఆఫరేటింగ్ సిస్టమ్ కు చెందినవే. అయితే ఇప్పడున్న ఆండ్రాయిడ్ డివైజ్ లకు ముప్పు ఉందట. ముఖ్యంగా ఆండ్రాయిడ్ 13 వెర్సన్ యూజ్ చేసేవారు డేంజర్ జోన్లో ఉన్నట్లు టెక్ నిపుణులు చెబుతున్నారు. వీటిని హ్యాకర్లు ఈజీగా తమ ఆధీనంలోకి తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు. ఈ విషయాన్ని ఎవరో కాదు ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీం (CERT) పేర్కొంది. దీంతో మొబైల్ యూజర్లలో దడ నెలకొంది. అయతే వీటికో పరిష్కారం ఉంది. అదేంటంటే?

    CERT పేర్కన్నదాని ప్రకారం అండ్రాయిడ్ 13 ఓఎస్ ను క్రిటికల్ గా పేర్కోంది. దీని ద్వారా సైబర్ నేరగాళ్లు ఈజీగా ఫోన్ ను తమ డివైజ్ కు యాక్సెస్ చేయగలుగుతారు. దీంతో ఎదుటివారి ఓఎస్ లో సొంత కోడ్ ను అమలు చేయడం, ఉన్నతమైన అధికారాలు పొందడం, వారి సమాచారాన్ని దొంగిలించడం వంటివి చేస్తారు. అంతేకాకుండా హానికరమైన చర్యలకుపాల్పడే ప్రమాదం ఉంది. మొత్తంగా అండ్రాయిడ్ 13 డివైజ్ ను వారి ఆధీనంలోకి తీసుకోగలుగుతారు.

    అండ్రాయిడ్ 13 తో పాటు 12,12ఎల్, 11 ఓఎస్ లల్లో కూడా లోపాలు ఉన్నట్లు గుర్తించింది. అయితే ఈ లోపాలు ఏదో ఒక భాగానికి కాకుండా ఫోన్ మొత్తం హ్యాక్ కు గురయ్యే ప్రమాదం ఉంది. ఫ్రేమ్ వర్క్, సిస్టమ్, గూగుల్ ప్లే సిస్టమ్ అప్డేట్, ఆర్మ్, మీడియా టెక్, యూనిసోక్, క్వాల్కామ్ లకు కూడా పాకుతుంది. దీంతో చాలా సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే తాజాగా ఈ సమస్యల నుంచి బయటపడే మార్గాలను గూగుల్ చెప్పింది.

    వినియోగదారులు తమ మొబైల్ ను అత్యంత సెక్యూరిటీగా ఉంచుకోవాల. అంటే ఓఎస్ అప్డేట్ విషయంలో అప్రమత్తమవ్వాలి. నాణ్యమైన ఓఎస్ ను గుర్తించాలి. ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తుండాలి. ముక్యంగా యాప్ లను డౌన్లోడ్ చేసేటప్పుడు ఇన్ స్టాల్ చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. థర్డ్ పార్టీ యాప్ లను అస్సలు దరిచేరనీయొద్దు. గూగుల్ ప్లో స్టోర్ నుంచి యాప్ లు డౌన్లోడ్ చేసేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి.