https://oktelugu.com/

Vitamin D Overconsumption: విటమిన్ డి ఎక్కువై చనిపోయాడు.. అధిక వినియోగంతో ఇలాంటి ప్రమాదాలు.. ఏం చేయాలంటే?

డేవిడ్ మిచెనర్ చనిపోవడానికి కంటే 9 నెలల ముందు నుంచే విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకున్నాడట.అయితే వీటిని ఎక్కువ తీసుకున్నా కూడా ఎలాంటి దుష్ప్రభావాలు సంకేతాలు తెలియకపోవడంతో వైద్యులు గుర్తించలేకపోయారట.

Written By:
  • Swathi Chilukuri
  • , Updated On : March 17, 2024 / 02:08 PM IST

    Vitamin D Overconsumption

    Follow us on

    Vitamin D Overconsumption: కొన్ని విటమిన్లు ఎక్కువ మోతాదులో ఉంటే కూడా నష్టమే. శరీరంలో ఏది ఎంత మోతాదులో ఉండాలో అంత మోతాదులోనే ఉండాలి. అయితే యూకేకు చెందిన 89 సంవత్సరాల వ్యక్తి శరీరంలో విటమిన్ డి ఎక్కువగా ఉండడం వల్ల మరణించాడు. హైపర్ కాల్సెమియా అనే డేవిడ్ మిచెనర్ మరణానికి కారణం అయింది అంటున్నారు నిపుణులు. విటమిన్ డి వల్ల కాల్షియం అధిక స్థాయిలో పెరుగుతుందని.. దీని వల్లే ఆ వ్యక్తి మరణించాడని చెబుతున్నారు వైద్యులు. దీనికి సంబంధించి ఓ నివేదిక కూడా విడుదల చేశారు.

    డేవిడ్ మిచెనర్ చనిపోవడానికి కంటే 9 నెలల ముందు నుంచే విటమిన్ డి సప్లిమెంట్లను తీసుకున్నాడట.అయితే వీటిని ఎక్కువ తీసుకున్నా కూడా ఎలాంటి దుష్ప్రభావాలు సంకేతాలు తెలియకపోవడంతో వైద్యులు గుర్తించలేకపోయారట. అయితే ఈ విటమిన్ డి ని కాల్సిఫెరోల్ అంటారు. అంటే కొవ్వులో కరిగే విటమినే ఈ డి విటమిన్. అయితే ఇది కొన్ని ఆహారాల్లో మాత్రమే లభిస్తుంది. ఎముకలు, దంతాల ఆరోగ్యం, రోగనిరోధక వ్యవకస్థకు, మెదడుకు చాలా అవసరం ఈ విటమిన్ డి.

    సూర్యుని యూవీ కిరణాలే విటమిన్ డి కి ప్రధానం కారణం అని తెలిసిందే. యూవీ కిరణాలు చర్మాన్ని తాకితే శరీరానికి విటమిన్ డి అందుతుంది. పుట్టగొడుగులు, పాలు, కొవ్వు, చేపలు వంటి ఆహారాల్లో కూడా ఈ విటమిన్ డి లభిస్తుంది. అరటి పండ్లు, నారింజ కూడా ఫుల్ గా లభిస్తుంది ఈ విటమిన్. అయితే చాలా మందిలో ఈ విటమిన్ డి లోపం ఉంటుంది. ఈ విటమిన్ ఎక్కువ మోతాదులో ఉంటే టాక్సిసిటీకి దారితీస్తుంది.

    విటమిన్ డి అధికంగా తీసుకుంటే.. రక్తంలో కాల్షియం అధిక స్థాయికి చేరుతుంది. దీని వల్ల వికారం, వాంతులు, మలబద్ధకం, బలహీనత, తరచుగా మూత్రవిసర్జన వంటి అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. అందుకే శరీరంలో విటమిన్ డి ఎక్కువ ఉండకూడదు అంటున్నారు వైద్యులు. అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్టుగా ఈ విటమిన్ లు కూడా అతిగా ఉంటే ప్రాబ్లమే ఫ్రెండ్స్ … మరి తెలుసుకున్నారు కదా.. జాగ్రత్త. ఎలాంటి లక్షణాలు ఉన్నా కూడా మీ దగ్గర ఉన్న వైద్యులను సంప్రదించడం ఉత్తమం.