Amla: ఉసిరి ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. తినడానికి రుచిగా ఉండే ఉసిరిలో పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరానికి ఆరోగ్య ప్రయోజనాలను చేకూరుస్తాయి. ఇందులో ఎక్కువగా విటమిన్ సి ఉంటుంది. ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఉసిరిలో ఎక్కువగా యాంటీ ఇన్‌ఫ్లమేటరీ, యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కడుపులో మంటను తగ్గించడంతో పాటు రోగనిరోధక శక్తిని కూడా పెంచుతాయి. అయితే ఈ ఉసిరి సీజనల్‌గా మాత్రమే లభిస్తుంది. చాలా మంది దీన్ని నీటిలో ఊరబెట్టి తింటారు. అయితే ఉసిరిని కేవలం నీటిలోనే కాకుండా తేనెలో కూడా ఊరబెట్టి తింటే ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. రాత్రిపూట తేనెలో నానబెట్టిన ఉసిరిని ఉదయం పూట తింటే దీర్ఘకాలికంగా బాధపడుతున్న అనారోగ్య సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. మరి ఉసిరిలో తేనెను కలిపి తినడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.
జుట్టు ఆరోగ్యంగా..
ఉసిరి జుట్టు పెరగడానికి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని పోషకాలు జుట్టు రాలిపోకుండా చేస్తాయి. అయితే బాగా ఎక్కువగా జుట్టు రాలిపోతుంటే.. తేనెలో ఉసిరిని నానబెట్టి తినాలి. ఇలా డైలీ చేయడం వల్ల ఈ సమస్య నుంచి విముక్తి చెందుతారు. జుట్టు కూడా బలంగా, దృఢంగా పెరుగుతుంది.
ఆస్తమా నుంచి ఉపశమనం
ఆస్తమాతో బాగా ఇబ్బంది పడేవారు ఉసిరికాయలో తేనెను కలిపి తినాలి. ఇలా తినడం వల్ల బ్రోన్కైటిస్, ఇతర శ్వాసకోశ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో పుష్కలంగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుంచి విషాన్ని తొలగించడంలో బాగా సహాయపడతాయి.
గుండె ఆరోగ్యంగా ఉండేలా..
ఉసిరిని, తేనెను కలిపి తినడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ఇందులోని పోషకాలు శరీరంలో ఉండే చెడు కొలెస్ట్రాల్‌ను బయటకు నెట్టవేస్తుంది. దీనివల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం తగ్గుతుంది. అలాగే రక్తపోటును కూడా నియంత్రిస్తుంది. రక్తపోటు అదుపులో ఉండటం వల్ల గుండె ప్రమాదాలు తగ్గుతాయి.
జలుబు నుంచి విముక్తి
దీర్ఘకాలికంగా జలుబుతో బాధపడుతున్నట్లయితే ఉసిరిని ఇలా తినడం మంచిది. ఇందులోని పోషకాలు జలుబు, దగ్గు, గొంతు నొప్పిని తగ్గిస్తాయి. ఒక వారం రోజుల పాటు ఇలా ఉసిరిని తింటే ఈజీగా ఈ సమస్య నుంచి విముక్తి చెందుతారు. సీజనల్‌గా చాలా మంది జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుంటారు. అలాంటి వారు తప్పకుండా ఉసిరిని తేనెలో ముంచుకుని తింటే ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.
చర్మానికి మేలు
ఉసిరి, తేనె సాధారణంగా చర్మ సౌందర్యానికి బాగా ఉపయోగపడాయి. ఈ రెండింటి కలయిక ఇంకా ముఖంపై మొటిమలు, ముడతలు లేకుండా చేస్తుంది. డైలీ తినడం వల్ల వృద్ధాప్య ఛాయలు పోయి యంగ్ లుక్‌లో ఉంటారు. అయితే ఆరోగ్యానికి మంచిదని ఎక్కువగా తీసుకోవద్దు. కేవలం మితంగా మాత్రమే తీసుకోవాలి.
Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.