Amazon Sale: ఈ దసరా పండుగే పో.. అమెజాన్, ఫ్లిప్ కార్ట్ 75 శాతం డిస్కౌంట్.. ఏయే వస్తువులపై అంటే?

ప్రతీ ప్రత్యేక రోజుల్లో ఆమెజాన్ వినియోగదారులను ఆకర్షించే విధంగా కళ్లు చెదిరే ఆఫర్స్ ను ముందుకు తెస్తుంది. ఇందులో భాగంగా 2023 దసరా సందర్భంగా భారీ తగ్గింపు ధరలతో వస్తువులను విక్రయించేందుకు రెడీ అయింది.

Written By: Chai Muchhata, Updated On : October 6, 2023 1:00 pm

Amazon Sale

Follow us on

Amazon Sale: దసరా, సంక్రాతి వస్తుందటే చాలా మంది ఎగ్జైట్మెంట్ గా ఫీలవుతారు. ఎందుకంటే ఈ పండుగల సందర్భంగా కొన్ని రోజులపాటు సెలవులు ఉంటాయి. అంతేకాకుండా స్నేహితులు, బంధువులతో సంతోషంగా గడుపొచ్చు. అయితే ఇదే సమయంలో కొన్ని కంపెనీలు భారీ ఆఫర్లు ప్రకటిస్తుంటాయి. కొందరు ఎప్పటి నుంచో కొనాలనుకున్న వస్తువులను ఈ డీల్ ద్వారా కొనుగోలు చేస్తే భారీగా తగ్గంపు ధరకు వస్తువులను దక్కించుకుంటారు. తాజాగా అమెజాన్ భారీ ఆఫర్స్ ప్రకటించింది. కనీసం 75 శాతం తగ్గింపుతో వస్తువులను విక్రయిస్తోంది. ఈ ఆఫర్ ఎప్పటి నుంచి వర్తిస్తుందో తెలుసా?

ప్రతీ ప్రత్యేక రోజుల్లో ఆమెజాన్ వినియోగదారులను ఆకర్షించే విధంగా కళ్లు చెదిరే ఆఫర్స్ ను ముందుకు తెస్తుంది. ఇందులో భాగంగా 2023 దసరా సందర్భంగా భారీ తగ్గింపు ధరలతో వస్తువులను విక్రయించేందుకు రెడీ అయింది. అక్టోబర్ 8 నుంచి 15 వరకు అమెజాన్ ‘గ్రేట్ ఇండియా ఫెస్టివెల్’ పేరిట ఓ కార్య్రమాన్ని స్టార్ట్ చేస్తోంది. అమెజాన్ తో పాటు ఫ్లిప్ కార్డు కూడా ‘బిగ్ బిలియన్ డేస్’ పేరిట తగ్గింపు ధరలను ప్రకటించింది.

ఈ ఆఫర్ల ప్రకారం రూ.69,000లకు విక్రియించే ఐఫోన్ కేవలం 50 వేలకే విక్రయించనున్నారు. ఐఫోన్ 12 రూ.53,999 ఉండగా.. రూ.31,999 తో విక్రయిస్తున్నారు. ఇవే కాకుండా గృహోపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర వస్తువులను దాదాపు 50 నుంచి 75 శాతం వరకు తగ్గింపు ధరతో విక్రయిస్తున్నారు. అయితే ఇవి ఫేక్ నా? లేదా రియలా? అని చాలా మందికి సందేహం ఉంటుంది. అంతేకాకుండా రియల్ గా ఎంత తగ్గించాలో ఫిల్టర్ చేసుకోవడం కష్టమవుతుంది.

ఈ నేపథ్యంలో టెలిగ్రామ్ యాప్ లోకి వెళ్లి ‘డిస్కౌంట్ డీల్’ అనే ఛానెల్ లోకి వెళ్లి ఆఫర్లను చెక్ చేసుకోవచ్చు. గతంలో రూ.1 కే ట్రావెల్ బ్యాగును విక్రయించారు. అంతేకాకండా రూ.20 కే స్మార్ట్ టీవిని అమ్మారు. ఈ విధంగా ‘డిస్కౌంట్ డీల్’ చానెల్ ద్వారా కావాల్సిన వస్తువులను కొనుగోలు చేసుకోవచ్చు.