Amazon Great Indian Festival Sale: వినియోగదారులను చాలా రోజులుగా ఊరిస్తున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ రానే వచ్చేసింది. ఈ రోజు అర్థరాత్రి నుంచి ఈ సేల్ ప్రారంభం కానుంది. కంపెనీ ప్రైమ్ యూజర్లకు ఒక రోజు ముందుగానే అంటే ఈ రోజు సేల్ ప్రారంభమైంది. ఈ సేల్‌లో అన్ని రకాల ఎలక్ట్సానిక్స్‌పై భారీ ఆఫర్లు అందుబాటులో ఉండగా.. ముఖ్యంగాస్మార్ట్ ఫోన్లపై సూపర్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు బడ్జెట్ స్మార్ట్ ఫోన్ కొనాలని ప్లాన్ చేస్తూ ఉంటే.. ఈ సేల్ మీకు సూపర్ చాన్స్ అని చెప్పొచ్చు. ఈ సేల్‌తో షావోమీ, రియల్‌మీ తదితర ప్రముఖ కంపెనీల ఫోన్లు ఆఫర్లపై 10 వేల కంటే తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు.

రెండ్‌మీ–ఏ స్మార్ట్‌ఫోన్ రూ.7,469 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఫోన్ కొనుగోలు చేసిన తర్వాత, కస్టమర్ సూపర్ క్యాష్‌బ్యాక్ పొందుతారు. అయితే, ఈ ఫోన్ కొనుగోలుపై ఎంత క్యాష్‌బ్యాక్ లభిస్తుందో అమెజాన్ స్పష్టం చేయలేదు. ఇది కాకుండా.. ఫోన్‌ను నో–కాస్ట్ ఈఎంఐ రూ.454తో కొనుగోలు చేయవచ్చు. రెడ్‌మీ–10ఏ 13 ఎంపీ బ్యాక్ కెమెరా అందుబాటులో ఉంది. ఇందులో 5 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఈ ఫో¯Œ లో ఇందులో మీడియాటెక్ హెలియో ప్రాసెసర్‌ని అమర్చారు. ఇది 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.
రియల్‌మీ న జ్రో – 50 ఐ
ఈ స్మార్ట్‌ఫోన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో రూ. 5,799 ధరతో అందుబాటులో ఉంది. ఈ ఫోన్‌ను ఎస్‌బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా మరో 10 శాతం తగ్గింపు లభిస్తుంది. 2జీబీ ర్యామ్, 32 జీబీ ఇంటర్నల్ మెమోరీ 6.5–అంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే ఉన్నాయి. 8 ఎంపీ బ్యాక్ కెమెరా, 5 ఎంపీ ప్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది.

రియల్‌మీ న జ్రో – 50ఏ
అమెజాన్ యొక్క పండుగ సేల్‌లో రియల్‌మీ న జ్రో – 50ఏను రూ. 8,499 ధర వద్ద కొనుగోలు చేయవచ్చు. ఎస్‌బీఐ కార్డుపై 10 శాతం తగ్గింపు కూడా అందుబాటులో ఉంటుంది. ఇందులో 50 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ అందుబాటులో ఉంటుంది. 8 ఎంపీ ఫ్రంట్ కెమెరాను కలిగి ఉంది. 6000 ఎంఏహెచ్ బ్యాటరీతో వస్తుంది.

రెడ్‌మీ 10 ప్రైమ్
రెడ్‌మీ 10 ప్రైమ్ ఫోన్ రూ.9,450 ధరకు సేల్ లో అందుబాటులో ఉంటుంది. ఎస్‌బీఐ కార్డుపై రూ.750 వరకు తక్షణ తగ్గింపు ఇవ్వబడుతుంది. అయితే బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో కొనుగోలు చేస్తే రూ.1250 తగ్గింపు అందుబాటులో ఉంటుంది. నో–కాస్ట్ ఈఎంఐలో కూడా ఫోన్ కొనుగోలు చేయవచ్చు. 6.5–అంగుళాల ఎఫ్‌హెచ్‌డీ డిస్లే, 6000 ఎంఏహెచ్ బ్యారటీ, 50 ఎంపీ రియర్ కెమెరా కలిగి ఉంది.

ఒప్పో ఏ15ఎస్
ఒప్పో ఏ15ఎస్ స్మార్ట్‌ఫోన్ అమెజాన్ సేల్‌లో రూ.8,991 ధరకు విక్రయిస్తుంది. రూ.477తో నో–కాస్ట్ ఈఎంఐ వద్ద కూడా కొనుగోలు చేయవచ్చు. ఫోన్‌ను కొనుగోలు చేసిన తర్వాత కస్టమర్‌లు క్యాష్‌బ్యాక్ కూడా పొందుతారు. 6.52 అంగుళాల స్క్రీన్ అందుబాటులో ఉంది. 13ఎంపీ బ్యాక్ కెమెరా, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా, 4,230 ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది.
