Amazon- Flipkart: దసరా, దీపావళి సందర్భంగా అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివెల్, ఫ్లిఫ్ కార్డ్ గ్రేట్ ఇండియన్ ఫెస్టవల్ ధమాకా వినియోగదారుల ముందుకు తీసుకొచ్చిన విషయం తెలిసిందే. భారీ డిస్కౌంట్లతో ఎక్కువ ధరకు చెందిన వస్తువులను అందజేస్తుంది. ఈ ఆఫర్లు అక్టోబర్ 8 నుంచి ప్రారంభమైంది. 15 వరకుకొనసాగుతాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే చాలా మంది వినియోగదారులు వివిధ వస్తువులను సొంతం చేసుకున్నారు. అయితే మనకు కావాల్సినవస్తువులను సెలెక్ట్ చేసుకోవడానికి ఇబ్బందిగా ఉంటుంది. దీంతో కావాల్సిన వస్తువును సెలెక్ట్ చేసుకోవడానికి మంచి ఆప్షన్ ఉంది. అదేంటంటే?
టెలిగ్రామ్ యాప్ లో 2 మిలియన్ సబ్ స్క్రౌబర్లు కలిగిన Discount Sale అనే ఛానెల్ ఉంటుంది. పైన సెర్చ్ బాక్స్ లో దీనిని టైప్ చేస్తే కనిపిస్తుంది. ఇందులో జాయిన్ కావాల్సి ఉంటుంది. ఇందులో ఆమెజాన్, ఫ్లిప్ కార్డులకు సంబంధించిన ఆపర్లకు సంబంధించిన లింక్స్ఉటాయి. ఆయా వస్తువులకు సంబంధించి ప్రత్యేక కేటగిరిల లింకులు ఇందులో పోస్టు చేస్తారు. వినియోగదారులు వెబ్ సైట్ లోకి వెల్లి సెర్చ్ చేసే కంటే ఇందులో తమకు కావాల్సిన వస్తువుల లింక్ కు సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఉదాహరణకు ఒక స్మార్ట్ టీవీపై 50 శాతం తగ్గింపు ధర ఉంది. ఈ నేపథ్యంలో స్మార్ట్ టీవీ పేరుతో లింక్ ను పోస్టు చేస్తారు.అంతే కాకుండా ఎంతమేరకు డిస్కౌంట్ ఉందో కూడా ముందే చెప్పేస్తారు. దీంతో కావాల్సిన లింక్ ను ప్రెస్ చేసి కావాల్సిన వస్తువులను కొనుగోలు చేయవచ్చు. అంతేకాకుండా కొన్ని వస్తువుల ఆఫర్లు ఎక్స్ పైర్డ్ అవుతాయి. కానీ ఆ విషయం మనకు తెలియదు. అయితే ఇందులో వాటికి సంబంధించిన డిటేయిల్స్ కూడా ఉంచుతారు.
కేవలం ఈ ఆఫర్లు మాత్రమే కాకుండా వివిధ ఆఫర్లను ఇందులో ఉంచుతారు. వెబ్ సైట్ లోకి వెళ్లి కష్టపడడం కంటే ఇందులో సులభంగా కావాల్సిన వస్తువులను ఈజీగా సెలెక్ట్ చేసుకొచ్చు. ఇందులో కొందరు ఫొటోతో సహా లింక్ ను అప్లోడ్ చేస్తారు. అందువల్ల ఎక్కవగా శ్రమ పడకుండా సమయం వృథా చేసుకోకుండా ఇందులోకి వెళ్లి తమకు కావాల్సిన వస్తువులను సెలెక్ట్ చేసుకోవచ్చు.