https://oktelugu.com/

Alone: వామ్మో ఒంటరిగా ఉండటం వల్ల ఇన్ని నష్టాలా?

ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండటం వల్ల మీకు తెలియకుండానే కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఒంటరిగా ఉండటం వల్ల కలిగే నష్టాలు తెలిస్తే ఇంకోసారి అసలు ఉండరు. మరి అవేంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

Written By: Kusuma Aggunna, Updated On : November 18, 2024 10:55 pm
Alone

Alone

Follow us on

Alone: ఈ రోజుల్లో అందరితో కలిసి ఉండే వారి కంటే ఎక్కువ మంది ఒంటరిగా ఉంటున్నారు. పూర్వ కాలంలో కుటుంబాలు ఉమ్మడిగా ఉండటం, కలిసి మెలసి ఆనందంగా ఉండేవారు. కానీ ఈ రోజుల్లో అసలు ఇలా ఉండే వారి సంఖ్య రోజురోజుకి తగ్గిపోతుంది. ముఖ్యంగా యువత అయితే ఒంటరిగా ఉండటానికే ఎక్కువగా ఆసక్తి చూపిస్తోంది. ఇతరులతో కలిసి ఉండటం వల్ల తర్వాత బాధ పడాల్సి వస్తుందని ఎక్కువగా ఒంటరిగా ఉండటానికి ఇష్టపడుతున్నారు. రోజులో ఏదో ఒక సమయంలో విశ్రాంతి, ప్రశాంతత కోసం ఒంటరిగా ఉండవచ్చు. కానీ పూర్తిగా ఒంటరిగా ఉండటం వల్ల ఎలాంటి గొడవలు లేకుండా సంతోషంగా ఉన్నారని భావిస్తారు. కానీ వాటి వల్ల అనారోగ్య సమస్యల బారిన పడతారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒంటరితనం అసలు మంచిది కాదు. దీనివల్ల శారీరకంతో పాటు మానసికంగా కూడా ఎన్నో అనారోగ్య సమస్యలను ఎదుర్కొవలసి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఎవరితో కలవకుండా ఒంటరిగా ఉండటం వల్ల మీకు తెలియకుండానే కొన్ని అనారోగ్య సమస్యల బారిన పడతారు. ఒంటరిగా ఉండటం వల్ల కలిగే నష్టాలు తెలిస్తే ఇంకోసారి అసలు ఉండరు. మరి అవేంటో తెలియాలంటే స్టోరీ మొత్తం చదివేయండి.

ఏదో తెలియని నిరాశ
కొంత సమయం ఒంటరిగా ఉంటే పర్లేదు. కానీ పూర్తిగా ఒంటరిగా ఉండటం వల్ల మీకు తెలియకుండానే నిరాశగా ఉంటారు. లైఫ్‌లో ఏదో తెలియని వెలితి, ఆందోళన వంటివి వస్తాయి. ప్రతీ విషయానికి టెన్షన్ పడటం, ఎంత సంతోషమైన మూమెంట్ అయిన కూడా ఎంజాయ్ చేయలేకపోతుంటారు. ఒంటరితనం ముఖ్యంగా వ్యతిరేక ఆలోచనలు వచ్చేలా చేస్తుంది. దీనివల్ల మీరు మానసికంగా ఇబ్బంది పడుతుంటారు. కాబట్టి ఎక్కువగా ఒంటరిగా ఉండవద్దు.

ఎమోషనల్‌గా వీక్ కావడం
ఒంటరిగా ఉండటం వల్ల ఏ విషయాలు కూడా ఎవరితో షేర్ చేసుకోలేరు. దీంతో ఎమోషనల్‌గా చాలా వీక్ అయిపోతారు. దీనివల్ల పూర్తిగా ఇంట్రోవర్ట్‌గా మారిపోవడం, వంద మందిలో ఉన్నా కూడా సంతోషంగా లేకపోవడం వంటివి అనిపిస్తాయి. ప్రతీ మనిషికి ఎమోషనల్ ఫీలింగ్స్‌ను షేర్ చేసుకోవడానికి ఒకరు తప్పకుండా ఉండాలి. అప్పుడే లైఫ్‌లో కాన్ఫిడెన్స్ కూడా పెరుగుతుంది.

గుండె సమస్యలు
ఒంటరితనం వల్ల పూర్తిగా ఆలోచనలు మారిపోతాయి. దీంతో రక్తపోటు నియంత్రణలో లేక గుండె ప్రమాదాల బారిన పడే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఒంటరితనం వల్ల ఆకలి వేయకపోవడం, నిద్ర పట్టకపోవడం, ఏవేవో ఆలోచనలు వంటివి వస్తాయని నిపుణులు అంటున్నారు. ఒంటరితనం వల్ల ఆందోళన, ఒత్తిడి పెరుగుతాయి. దీంతో శరీరంలో కార్డినాల్ హార్మోన్ అధిక మొత్తంలో విడుదల అవుతుంది. కాబట్టి కాస్త అందరి మనుషులతో కలిసి ఉండండి.

డిప్రెషన్‌లోకి వెళ్లడం
ఒంటరిగా ఉండటం వల్ల ఆలోచనలు మారి డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. దీనివల్ల మానసికంగా చాలా ఇబ్బందులు ఎదుర్కొంటారు. మానసికంగా ఆరోగ్యంగా ఉండాలంటే తప్పకుండా అందరితో కలసి ఉండాలి. అప్పుడే మెంటల్‌గా స్ట్రాంగ్‌గా ఉంటారు.

 

Disclaimer : ఈ సమాచారం కేవలం అవగాహన, ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. దీన్ని oktelugu.com నిర్ధారించదు. ఈ సూచనలు పాటించే ముందు వైద్య నిపుణుల సలహాలు తీసుకోగలరు.