women precautions : బ్రా వేసుకునే మహిళలందరూ తెలుసుకోవాల్సిన కఠిన నిజాలు ఇవీ.. ఆదమరిస్తే అంతే సంగతులు

అవసరం లేనప్పుడు బ్రాకు దూరంగా ఉండటం మంచిది. ఇలా చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి.

Written By: Swathi, Updated On : July 30, 2024 10:22 pm

All women should take these precautions

Follow us on

women precautions : మహిళల దుస్తుల్లో బ్రా ఒక ముఖ్యమైన భాగం. ఇది ఎగువ శరీరాన్ని ఆకృతి మెరుగ్గా ఉంచడానికి, రొమ్ములకు సహాయంగా ఉండటానికి వీటిని ధరిస్తారు. కానీ వీటిని ధరించడం వల్ల మహిళలకు కొన్ని సమస్యలు వస్తాయట. కానీ ఈ విషయాలు ప్రతి మహిళకు ఇవి ఒకే విధంగా వర్తించవు. ఇది వ్యక్తిగత శరీర నిర్మాణం, బ్రా రకం, ధరించే విధానం వంటి ఎన్నో కారణాల మీద ఆధారపడి ఉంటుంది. కచ్చితంగా బ్రాను ధరించడం మానేయాలని చెప్పడం లేదు. ధరించాలని చెప్పడం లేదు నిపుణులు. మీ శరీర ఆకృతిని బట్టి కొన్ని సార్లు సమస్యలను బట్టి నిర్ణయం తీసుకోవాలి. అయితే మీకు కొన్ని లక్షణాలు ఉంటే మాత్రం కచ్చితంగా బ్రా విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. లేదంటే చాలా సమస్యలు ఫేస్ చేయాల్సి వస్తుంది. ఇంతకీ ఈ బ్రా ను వేసుకోవడం వల్ల వచ్చే నష్టాలు ఏంటి? ఎవరు వేసుకోవద్దు? ఎప్పుడు వేసుకోవద్దు వంటి కొన్ని విషయాల గురించి వివరంగా తెలుసుకుందాం.

దురద పెట్టడం, దద్దుర్లు, భుజంపై పట్టీ గుర్తులు రావడం కొందరిలో కామన్ గా కనిపిస్తుంటాయి. ఇవి చాలా మందిలో కూడా సాధారణ లక్షణాలే. కానీ మీరు బ్రా వేసుకోకపోతే మాత్రం శరీర పై భాగం ఆకారం చాలా వికృతంగా కనిపిస్తుంటుంది. ఈ సంగతి పక్కన పెడితే బ్రా ధరించడం వల్ల వచ్చే ప్రయోజనాలు, దుష్ప్రభావాల గురించి తెలుసుకుందాం.

1. చాలా మంది టైట్ బ్రాలనే ధరిస్తారు. అయితే దీని వల్ల తెలియకుండానే రొమ్ముల కింది భాగంలో సమస్య వస్తుంది. ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ మీద ప్రభావం పడుతుంది. దీనివల్ల మహిళల ఛాతీలో లేదా పక్కన ప్రాంతాల్లో నొప్పి రావడం జరుగుతుంటుంది.

2. బ్రా లేకుండా పడుకుంటే రాత్రి హాయిగా నిద్ర పడుతుంది. ఎందుకంటే బ్రా వేసుకోకపోతే శ్వాస సమస్య రాదు. టైట్ గా ఉండటం వల్ల ఇబ్బందిగా అనిపిస్తుంటుంది. అందుకే బ్రా ధరించకపోతే ఎలాంటి ఆటంకం లేకుండా సులువుగా శ్వాస కూడా తీసుకోవచ్చు. అంతేకాదు బ్రా వేసుకోకపోవడం వల్ల శ్వాస, రక్త ప్రసరణ రెండింటి విషయంలో ఎలాంటి సమస్యలు రావు కాబట్టి బ్రాను ధరించిపడుకోవద్దు అంటున్నారు నిపుణులు.

3. కొందరికి చెమటలు ఎక్కువ వస్తుంటాయి. ఇలాంటి వారు కచ్చితంగా సరైన క్లాత్ బ్రా ను ఎంచుకోవాలి. ఎందుకంటే కొన్ని రకాల బట్టలకు చెమటను గ్రహించే గుణం ఉండదు. దీనివల్ల చిరాకు వస్తుంటుంది. అంతేకాదు నిరంతరం దురద, దద్దుర్లు వంటివి వస్తుంటాయి. చెమట వల్ల ఫంగల్ ఇన్ఫెక్షన్ల అవకాశం మరింత పెరుగుతుంది.

4. పెడ్ బ్రాలను ఎక్కువగా ఉపయోగించే మహిళలకు చనుమొనలో సమస్యలు వస్తాయి అంటున్నారు నిపుణులు. ఎందుకంటే చనుమొనలు చాలా సున్నితమైనవి. ఇవి పొడిగా మారకూడదు. కానీ ఈ సమస్య వల్ల పొడిగా మారే అవకాశం ఎక్కువ. దీని వల్ల ఆ ప్రాంతంలో దురద ఎక్కువ వస్తుంది. అందుకే ఇంట్లో ఉన్నప్పుడు బ్రా లెస్ గా ఉండటం మంచిది.

5. అవసరం లేనప్పుడు బ్రాకు దూరంగా ఉండటం మంచిది. ఇలా చేయడం వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉంటాయి. కొన్ని సార్లు టైట్ బ్రాల వల్ల రొమ్ము కణజాలం దెబ్బతింటుంది.

6. బ్రా వల్ల రొమ్ములు బిగుతుగా ఉంటాయి. బ్రా రొమ్ములను వేలాడకుండా, సాగకుండా కాపాడుతుంది. కానీ ఇది మీ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం కూడా ఉంది కాబట్టి వీటికి కాస్త దూరంగా ఉండటమే మంచిది.