Alcohol : మద్యం తాగితే ఆరోగ్యానికి హానికరమని తెలిసిన.. అవన్నీ పక్కన పెట్టి మరి కొందరు రోజు తాగుతుంటారు. ఇలా డైలీ తాగడం వాళ్ల ఎన్నో అనారోగ్య సమస్యలు వస్తాయి. ఈరోజుల్లో అయితే చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు అందరూ కూడా తాగుతున్నారు. అయితే వయస్సు పెరిగే కొద్ది ముప్పు పెరుగుతుందని ఓ అధ్యయనం తెలిపింది. చాలా మంది నేను తక్కువగా మందు తాగుతా.. ఆరోగ్యానికి ఏం కాదని ఫీల్ అవుతుంటారు. అయితే ఇలా అనుకుంటే మీరు పోరపడినట్లే అని వైద్య నిపుణులు అంటున్నారు. మద్యం తాగడమే ఆరోగ్యానికి హానికరం. అలాంటిది కొంచెం తాగిన.. ఎక్కువ తాగిన ఆరోగ్యానికి హానికరమే అని నిపుణలు అంటున్నారు. మద్యాన్ని ఏ మోతాదులో తాగిన అనారోగ్య సమస్యలు తప్పకుండా వస్తాయని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. ముఖ్యంగా క్యాన్సర్, గుండె సమస్యలు, రక్త నాళ సమస్యలు వస్తాయి. అయితే మద్యం తక్కువగా తాగిన.. ఎక్కువగా తాగిన సమస్యలు తప్పవు. కాకపోతే వయసు పెరిగే కొలది దాని తీవ్రత కూడా పెరుగుతుంది. ఇంతకీ ఏ వయస్సు వారు మద్యం ఎక్కువగా తాగితే ప్రమాదం ఎంత శాతం ఉంటుందో మరి చూద్దామా.
యూకే లోని ఓ బయో బ్యాంకులో మొత్తం 1.35 లక్షల మంది ఆరోగ్య వివరాలపై తాజాగా అధ్యయనం చేశారు. వీళ్లందరిలో సగటు వయస్సు దాదాపుగా 64 ఏళ్లు ఉన్నాయి. అయితే సాధారణం వయస్సు కంటే వృద్దులకు మద్యం తీవ్రత ఎక్కువగా ఉంటుందని ఈ అధ్యయనంలో తేలింది. రోజుకి కనీసం రెండు లేదా మూడు డ్రింక్ లు తీసుకున్న.. ఆరోగ్యానికి ప్రమాదామని తెలిపారు. అలాగే రెండు కంటే తక్కువగా తాగే వాళ్లని 12 ఏళ్ల పాటు పరిశీలించగా.. వీళ్ల కంటే ఎక్కువగా తాగే వాళ్లకే ముప్పు ఎక్కువగా ఉందని తేలింది. ఎక్కువగా మద్యం తీసుకునే వారిలో 33 శాతం అకాల మరణం, 39 శాతం క్యాన్సర్ ముప్పు, 21 శాతం రక్త నాళాలు, గుండె సమస్యలతో చనిపోతారని అధ్యయనం లో తేలింది. మీడియంగా తాగుతున్న వాళ్లకి కూడా మరణ ముప్పు ఉందని తెలిసింది. అయితే రోజు తక్కువగా తాగే వారిలో కూడా 11 శాతం క్యాన్సర్ ముప్పు ఉన్నట్లు అధ్యయనం తెలుపుతుంది. అయితే ఏదో జస్ట్ తాగే వాళ్లకి ఎలాంటి ప్రమాదం లేదని అనుకోవద్దు. వీళ్లకి కూడా అనారోగ్య సమస్యలు వస్తాయి. కాకపోతే వీళ్లకి ముందు ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే.. ఇంకా ప్రమాదం పెరిగే అవకాశం ఉందని పరిశోధకులు చెబుతున్నారు. చాలా మంది తక్కువగా ఎప్పుడో ఒకసారి తాగుతాం కదా.. ఏం కాదని అనుకుంటారు. కానీ మద్యం ఎంత తాగిన ఆరోగ్యానికి హానికరమే. కాబట్టి అసలు మద్యం తాగకపోవడమే మంచిది. అప్పుడే ఎలాంటి సమస్యలు లేకుండా ఆరోగ్యంగా ఉంటారు.