Jobs: చిత్తూరులో ఉన్న కలికిరి సైనిక్ స్కూల్ నిరుద్యోగులకు తీపికబురు అందించింది. పీజీటీ ఉద్యోగ ఖాళీల భర్తీ కోసం ఈ సంస్థ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజైంది. మొత్తం 11 ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని సమాచారం అందుతోంది. ఆర్ట్ టీచర్, కౌన్సిలర్, బ్యాండ్ మాస్టర్, వార్డెన్ ఉద్యోగ ఖాళీలతో పాటు పీజీటీ, మెడికల్ ఆఫీసర్ ఉద్యోగ ఖాళీలను ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయనున్నారని తెలుస్తోంది.
బీఈడీ, ఇంటిగ్రేటెడ్ పీజీ/మాస్టర్స్ డిగ్రీ పాసైన వాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారని సమాచారం అందుతోంది. 21 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్నవాళ్లు ఈ ఉద్యోగ ఖాళీలకు అర్హత కలిగి ఉంటారు. ఈ ఉద్యోగ ఖాళీలకు ఎంపికైన వాళ్లకు నెలకు రూ.47,600ల నుంచి రూ.1,51,100 వరకు వేతనం లభించనుందని సమాచారం అందుతోంది. ఎంబీబీఎస్‌లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు స్కూల్ మెడికల్ ఆపీసర్ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలి.
ఫైన్ ఆర్ట్స్/ఆర్ట్/డ్రాయింగ్/పెయింటింగ్ లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ పోస్టులకు అర్హులు. ఎంఏ/ఎమ్మెస్సీ/పీజీ డిప్లొమా/మాస్టర్స్ డిగ్రీలో పాసైన వాళ్లు కౌన్సిలర్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు. ఏఈసీ ట్రైనింగ్ కాలేజీ/నావీ/ఎయిర్‌ఫోర్స్ సంబంధిత బ్యాండ్/మేజర్ కోర్సుల్లో శిక్షణ తీసుకున్న వాళ్లు బ్యాండ్ మాస్టర్ టీచర్ పోస్టులకు అర్హులు. ఇంటర్ లో ఉత్తీర్ణత సాధించిన వాళ్లు హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులకు అర్హులు. పదోతరగతి పాసైన వాళ్లు వార్డెన్ పోస్టులకు అర్హత కలిగి ఉంటారు.
అర్హతల ఆధారంగా ఈ ఉద్యోగ ఖాళీలకు సంబంధించి వేతనంలో మార్పులు ఉంటాయి. ఈ ఉద్యోగాలకు దరఖాస్తు ఫీజు 500 రూపాయలు కాగా ఆన్ లైన్ ద్వారా ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవాలి. https://sskal.ac.in/careers లింక్ ద్వారా ఈ ఉద్యోగాలకు సంబంధించిన సందేహాలను నివృత్తి చేసుకోవచ్చు. 2022 సంవత్సరం ఏప్రిల్ 22వ తేదీ ఈ ఉద్యోగ ఖాళీలకు దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీగా ఉంది.