
Couples Quarrel : ఇటీవల కాలంలో దంపతుల మధ్య అన్యోన్యత తగ్గుతోంది. గతంలో మాదిరి ఆలుమగల మధ్య అవినాభావ సంబంధాలు ఉండటం లేదు. అంతా యాంత్రిక జీవనంలా మారుతోంది. ఫలితంగా వారి మధ్య ప్రేమానురాగాలు ఉండటం లేదు. పెళ్లి నాటి ప్రేమ కనిపించడం లేదు. రానురాను రాజుగారి గుర్రం గాడిదయిందన్నట్లు భార్యాభర్తల మధ్య అనురాగాలు కనిపించడం లేదు. డబ్బు సంపాదించాలనే యావతో సమయాన్ని పట్టించుకోవడం లేదు. ఆలుమగల మధ్య అవినాభావ సంబంధం ఉండాలంటే శృంగార జీవితం ఉండాల్సిందే. వారిలో విశ్రాంతి తీసుకునే క్రమంలో శృంగారం ఎంతో ఉపయోగపడుతుందని తెలిసినా సమయం లేదన సాకుతో చాలా మంది దూరంగా ఉంటున్నారు.
కమ్యూనికేషన్ గ్యాప్
ఆలుమగల మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఏర్పడటంతో సఖ్యత కానరావడం లేదు. ప్రతి విషయానికి చిర్రుబుర్రులాడుతూ ఇగో పెంచుకుంటున్నారు. దీంతో తనే ఎక్కువ అనే భావనలో ఉంటున్నారు. దీని వల్ల అపార్థాలు, ఆగ్రహాలకు దారి తీస్తున్నాయి. ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఎడమొహం పెడమొహంగా కాలం వెళ్లదీస్తున్నారు. ఈ నేపథ్యంలో దంపతులు తమ మధ్య అపార్థాలు లేకుండా చూసుకోవాల్సిన సమయం వస్తోంది. ఇద్దరి మధ్య దూరం పెరగకుండా చూసుకుంటేనే సంసారమనే నావ సాఫీగా సాగుతుంది.
ఆర్థిక ఇబ్బందులు
సంసారంలో ఇద్దరు తలమునకలై తమ సంపాదన పెంచుకునే క్రమంలో ఇద్దరు కష్టపడి పనిచేస్తున్నా ఆర్థిక ఇబ్బందులు తీరడం లేదు. ఫలితంగా ఇద్దరి మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఆర్థిక ఇబ్బందులను తట్టుకునేందుకు ఎన్ని మార్గాలు చేపట్టినా ఫలితాలు రావడం లేదు. దీంతో ఇద్దరు తోడు నీడగా ఉండాల్సి ఉన్నా కుదరడం లేదు. దీంతో చిన్న కుటుంబాలు కాస్త చిరాకు కుటుంబాలుగా మారుతున్నాయి. దీనికి కారణం పెళ్లయిన తరువాత తొందరగా పిల్లలు కలగడంతోనే ఇద్దరికి సమయం వీలు కావడం లేదు.
రొమాన్స్ కు అడ్డు
పిల్లలు కావడంతో ఇద్దరు శృంగారంలో పాల్గొనే అవకాశం ఉండటం లేదు. దీంతో లైంగిక ఆనందం దక్కడం లేదు. ఇద్దరిలో కోపం ఎక్కువవుతోంది. సాన్నిహిత్యం తగ్గుతోంది. కొందరు కౌన్సెలింగ్ వరకు వెళ్తున్నారు. తమ కోపాన్ని భాగస్వామిపై చూపిస్తూ నానా అల్లరి చేస్తున్నారు. సంసారంలో కలతలు రావడానికి ఇదే ప్రధాన కారణంగా నిలుస్తోంది. పెళ్లయిన తరువాత త్వరగా పిల్లలు పుడితే అంతే సంగతి. సంసార సుఖానికి ఫుల్ స్టాప్ పెట్టినట్లే. కానీ కొందరు ప్లాన్ చేసుకుంటే అదేమంత కష్టమైన పని కానే కాదు.

నిద్రకు భంగం
పిల్లలు రాత్రుళ్లు ఏడుస్తుంటారు. దీంతో తల్లిదండ్రులకు నిద్ర కరవవడం సహజమే. దీని వల్ల ఇద్దరిలో కోపతాపాలు పెరుగుతున్నాయి. ఇది గొడవలకు దారి తీస్తోంది. అన్నింటిని షేర్ చేసుకుంటే బాధలు ఉండవు. కానీ అంత తీరిక లేదనే సాకుతో ఒకరిపై మరొకరు అరుస్తుంటారు. పిల్లలు పుట్టిన తరువాత దంపతుల మధ్య వస్తున్న సమస్యలకు ఒత్తిడి కూడా ఒక కారణమే కావచ్చు. దీంతో సంసారంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవాలంటే ఇద్దరి మధ్య అన్యోత్యత పెరగాలంటే శృంగారాన్ని కూడా భాగం చేసుకుంటే సరి.