Homeలైఫ్ స్టైల్Mirror Placement Vastu: వాస్తు ప్రకారం ఇంట్లో అద్దాలు ఏ ప్రాంతంలో ఉంచాలో తెలుసా?

Mirror Placement Vastu: వాస్తు ప్రకారం ఇంట్లో అద్దాలు ఏ ప్రాంతంలో ఉంచాలో తెలుసా?

Mirror Placement Vastu: వాస్తుకు ప్రస్తుతం విలువ పెరుగుతోంది. ప్రతి వారు వాస్తు లేనిదే ఇల్లు కట్టడం లేదు. స్థలం కొనాలన్నా వాస్తు చూసే కొంటున్నారు. దీంతో వాస్తు ప్రభావం మనిషి జీవితంతో పెనవేసుకుపోయిందనడంలో అతిశయోక్తి లేదు. పెద్ద పట్టణాల నుంచి చిన్న గ్రామాల వరకు వాస్తును ప్రధానంగా భావిస్తున్నారు. వాస్తు లేనిదే ఏ పని చేయడం లేదు. దీంతో వాస్తుకు ఇస్తున్న ప్రాధాన్యం రోజురోజుకు పెరిగిపోతోంది. ఈ నేపథ్యంలో వాస్తును చూసుకున్నాకే స్థలం కొనుగోలు చేస్తున్నారు.

Mirror Placement Vastu
Mirror Placement Vastu

ఇంటిలో అన్ని వస్తువులు ఏర్పాటు చేసుకునేందుకు కూడా వాస్తు చూసుకుంటున్నారు. అన్ని దిక్కుల్లో ఏం బిగించుకోవాలో వాస్తు శాస్త్ర రీత్యా అద్దాలు ఎక్కడ ఏర్పాటు చేసుకోవాలో కూడా తెలుసుకుంటే మంచిది. ఆడవారు అద్దానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తుంటారు. అద్దం ముందు కూర్చుంటే వారికి సమయమే తెలియదు. అందుకే అద్దం ఉంటే చాలు వారు ఎక్కువగా అలంకరణ చేసుకునేందుకు సమయం కేటాయిస్తారని తెలుస్తోంది. ఈ క్రమంలో అద్దాల ఏర్పాటు విషయంలో అందరు వాస్తు దోషం లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది.

Also  Read: Workload for women : సమానంగా సంపాదిస్తున్నా, మహిళలకే పని ఎక్కువ, నిద్ర తక్కువ… ఇప్పటి జంటల్లోనూ అదే తంతు: షాకింగ్ సర్వే

అద్దాలు ఉత్తరం, తూర్పు దిక్కుల్లో ఉండే గోడలపై ఏర్పాటు చేసుకోవడం ఉత్తమం. ఇది వాస్తు రీత్యా శ్రేయస్కరం. పడక గదిలో కూడా అద్దం అమర్చుకుంటే హాయిగా ఉంటుందని తెలిసిందే. చిన్న పిల్లల గదుల్లో కూడా అద్దాలు ఏర్పాటు చేయాలి. వారి కోసం వారికి ఉత్సాహం తెచ్చేలా జంతువులు, పక్షుల ఆకారంలో ఉన్న అద్దాలను తీసుకుంటే వారికి నచ్చుతాయి. దీంతో అద్దాల అరమరికలో కూడా వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటేనే ప్రయోజనం ఉంటుంది. వాస్తు బాగా లేకపోతే ఇబ్బందులు తప్పవని తెలుస్తోంది.

Mirror Placement Vastu
Mirror Placement Vastu

ఇంటి ప్రధాన ద్వారం వద్ద కూడా అద్దం ఏర్పాటు చేసుకోవచ్చు. దీంతో బయటకు వెళ్లేటప్పుడు మన ముఖం చూసుకుంటూ వెళితే మంచి జరుగుతుందని వాస్తు శాస్త్రం చెబుతోంది. ఈ నేపథ్యంలో అద్దాల అమరికలో ఎలాంటి తేడాలు ఉండకుండా వాస్తు దోషాలు లేకుండా చూసుకుంటేనే మంచిది. లేదంటే చాలా రకాల నష్టాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అందుకే వాస్తు దోషాలు మనకు అంటకుండా ఉండాలంటే వాస్తును పాటించాల్సిందే. అద్దాలు ఇంట్లో ఏర్పాటు చేసుకునే క్రమంలో ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుంటేనే మంచిదని గ్రహించుకోవాలి.

Also  Read:YSRCP MP: మహిళతో నగ్నంగా దొరికిన వైసీపీ ఎంపీ.. వైరల్ వీడియో..

Srinivas
Srinivashttps://oktelugu.com/
Srinivas is a Political Reporter working with us from last one year. He writes articles on latest political updates happening in both Telugu States. He has the experience of more than 15 years in Journalism.
RELATED ARTICLES

Most Popular