Chanakya Nithi: మనలో చాలామంది ఊహించని స్థాయిలో సంపాదిస్తున్నా ఆర్థికంగా స్థిరపడే విషయంలో ఫెయిల్ అవుతుంటారు. చెడ్డ అలవాట్లను అలవరచుకోవడం వల్ల ఆర్థికంగా స్థిరపడే విషయంలో ఇబ్బందులు ఎదురవుతూ ఉంటాయి. ఆచార్య చాణక్య నీతి శాస్త్రం అనే బుక్ లో ఎన్నో ఆర్థిక విషయాలకు సంబంధించిన సమాచారం ఉంది. ఎవరైతే చెడు అలవాట్లను కలిగి ఉంటారో వాళ్లు ఆర్థిక సంక్షోభానికి దారి తీసే ఆ అలవాట్లకు దూరంగా ఉండాలి.
మనలో చాలామంది మన ఆర్థిక కష్టాల గురించి ఇతరులతో పంచుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు. అయితే ఇలా చేయడం వల్ల భవిష్యత్తులో ఇబ్బందులు మరింత పెరిగే అవకాశాలు అయితే ఉంటాయని చెప్పవచ్చు. ఇతరులతో ఆర్థిక సమస్యల గురించి చర్చిస్తే వాళ్లు కూడా మనం కష్టాల్లో ఉన్న సమయంలో సహాయం చేసే అవకాశాలు అయితే తక్కువగానే ఉంటాయని చెప్పవచ్చు. చాణక్య నీతి ప్రకారం డబ్బును అవసరాల కోసం మాత్రమే వాడుకోవాలి.
అనవసరమైన ఖర్చుల కోసం డబ్బును ఎట్టి పరిస్థితుల్లోనూ వినియోగించకూడదు. వృథా ఖర్చులకు డబ్బును వినియోగిస్తే ఆర్థిక కష్టాలు వేధించే ఛాన్స్ ఉంటుంది. మనలో చాలామంది ఆదాయానికి అనుగుణంగా ఖర్చు చేసే విషయంలో ఫెయిల్ అవుతుంటారు. ఆదాయాన్ని దృష్టిలో ఉంచుకుని ఖర్చు చేయడం ద్వారా డబ్బులను పొదుపు చేసే అవకాశం ఉండటంతో పాటు ఎలాంటి ఆర్థిక కష్టాలు చుట్టుముట్టవు.