Homeలైఫ్ స్టైల్AC Maintenance Tips: AC నడుస్తున్నా.. కూలింగ్ కావడం లేదా.. కారణాలివే కావొచ్చు.. చెక్...

AC Maintenance Tips: AC నడుస్తున్నా.. కూలింగ్ కావడం లేదా.. కారణాలివే కావొచ్చు.. చెక్ చేసుకోండి..

AC Maintenance Tips: ప్రస్తుత వేసవి కాలంలో ఎయిర్ కండిషనర్ (AC)లేకుండా ఉండలేమని అనిపిస్తుంది. అందుకే మధ్యతరగతి ప్రజలు సైతం కాస్త డబ్బు వెచ్చించి అయినా.. ఏసీని ఏర్పాటు చేసుకుంటున్నారు. అయితే దీనిని కొనుగోలు చేసేముందు వినియోగంపై తప్పనిసరిగా అవగాహన ఉండాలి. ఒక్కోసారి AC ఆన్‌లో ఉన్నా గది చల్లబడకపోవడం చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. ఈ సమయంలో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి. ఈ సమస్యకు చిన్నపాటి లోపాల నుంచి టెక్నికల్ కారణాలు కూడా కావొచ్చు. ఆ కారణాలు ఏవో చూద్దాం..

Air Conditioner సరిగ్గా కూల్ కాకపోవడానికి ప్రధాన కారణాల్లో ఫిల్టర్లు మురికిగా ఉండటం. ఫిల్టర్లలో దుమ్ము, ధూళి పేరుకుపోతే గాలి ప్రవాహం తగ్గిపోతుంది. దీంతో చల్లని గాలి గదిలో సరిగా ప్రసరించదు. కాబట్టి ప్రతి 2 నుంచి 3 వారాలకు ఒకసారి ఫిల్టర్లను శుభ్రం చేయడం మంచిది.

ACలో ఉపయోగించే రిఫ్రిజిరెంట్ గ్యాస్ లీక్ అయితే కూలింగ్ సామర్థ్యం తగ్గిపోతుంది. గ్యాస్ తక్కువగా ఉంటే AC ఎక్కువసేపు నడిచినా సరైన చల్లదనం ఇవ్వదు. ఈ సమస్యను గుర్తిస్తే వెంటనే టెక్నీషియన్‌తో చెక్ చేయించాలి.

కొన్నిసార్లు థర్మోస్టాట్ సెట్టింగ్స్ తప్పుగా ఉండడం వల్ల కూడా ఏసీ కూలింగ్ అవ్వదు. టెంపరేచర్ చాలా ఎక్కువగా సెట్ చేసి ఉంటే గది చల్లబడదు. సరైన టెంపరేచర్ (సాధారణంగా 24 నుంచి 26 సెల్సీయస్ డిగ్రీలు ) వద్ద సెట్ చేయడం వల్ల మంచి ఫలితం ఉంటుంది.

AC అవుట్‌డోర్ యూనిట్ చుట్టూ చెత్తాచెదారం, మొక్కలు, దుమ్ము ఉంటే హీట్ విడుదల సరిగా జరగదు. దీని వల్ల కూలింగ్ ప్రభావం తగ్గుతుంది. అవుట్‌డోర్ యూనిట్‌ను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచాలి. కంప్రెసర్ ACలో హృదయం లాంటిది. ఇది సరిగా పని చేయకపోతే AC పూర్తిగా కూలింగ్ ఇవ్వదు. కంప్రెసర్‌లో ఫాల్ట్ ఉంటే వెంటనే నిపుణుల సహాయం తీసుకోవాలి. చిన్న సామర్థ్యం ఉన్న ACని పెద్ద గదిలో ఉపయోగిస్తే ఎంతసేపు నడిపినా చల్లదనం రాదు. గది పరిమాణానికి తగ్గ టన్నేజ్ ఉన్న AC ఎంచుకోవడం చాలా ముఖ్యం.

ఎవాపరేటర్ కాయిల్స్‌పై ఐస్ (మంచు) పేరుకుపోతే గాలి ప్రవాహం పూర్తిగా తగ్గిపోతుంది. ఇది సాధారణంగా గ్యాస్ సమస్యలు లేదా ఎయిర్ ఫ్లో బ్లాకేజీ వల్ల జరుగుతుంది. ఇలా అయితే వెంటనే AC ఆఫ్ చేసి సర్వీసింగ్ చేయించాలి. డక్ట్స్‌లో లీకేజ్ ఉంటే చల్లని గాలి బయటకు వెళ్లిపోతుంది. అలాగే గదిలో ఇన్సులేషన్ సరిగా లేకపోతే బయట వేడి లోపలికి వస్తుంది. ఇవి కూడా కూలింగ్ తగ్గడానికి కారణాలు.

AC సరిగా కూల్ చేయకపోవడం చిన్న సమస్యలా అనిపించినా, దాన్ని పట్టించుకోకపోతే పెద్ద ఖర్చులు రావచ్చు. రెగ్యులర్ మెయింటెనెన్స్, సరైన వినియోగం, సమయానికి సర్వీసింగ్ ద్వారా మీ AC పనితీరును మెరుగుపరుచుకోవచ్చు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version