Homeలైఫ్ స్టైల్Sleeping On Stomach Side Effects: బోర్లా పడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయో తెలుసా..

Sleeping On Stomach Side Effects: బోర్లా పడుకోవడం వల్ల ఎలాంటి సమస్యలు ఉంటాయో తెలుసా..

Sleeping On Stomach Side Effects: రాత్రి సమయంలో నిద్రపోయేటప్పుడు కంఫర్ట్‌గా ఉంటుందని బోర్లా పడుకుంటారు. ఇది తాత్కాలికంగా ఉపశమనం కలిగిస్తుంది. అంతేకాకుండా కొందరికి ఇది అలవాటుగా మారిపోతుంది. అయితే వైద్యులు తెలుపుతున్న ప్రకారం.. ఇలా బోర్లా పడుకోవడం వల్ల శరీరంపై ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అంటున్నారు. అంతేకాకుండా భవిష్యత్ లో అనారోగ్యాలపాలయ్యే ప్రమాదముందని హెచ్చరిస్తున్నారు. అసలు బోర్లా పడుకుంటే వచ్చే నష్టాలేంటో ఇప్పుడు చూద్దాం..

బోర్లా పడుకోవడం వల్ల శరీర బరువు మొత్తం వెన్నెముకపై అసమానంగా పడుతుంది. ముఖ్యంగా నడుం భాగంలో వంగిన ఆకారం ఏర్పడి, క్రమంగా వెన్నునొప్పి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. వెన్నెముక సహజ ఆకృతిని కాపాడటానికి వెల్లకిలా పడుకోవడం చాలా ముఖ్యం. బోర్లా పడుకునేటప్పుడు తల ఒక వైపుకు తిప్పి ఉంచాల్సి వస్తుంది. ఇది మెడపై ఎక్కువ ఒత్తిడిని కలిగిస్తుంది. దీని వల్ల మెడ కీళ్ల నొప్పులు, కండరాల గట్టిపడటం, కొన్ని సందర్భాల్లో సర్వైకల్ సమస్యలు కూడా రావచ్చు. దీర్ఘకాలంగా ఇలా నిద్రపోతే సమస్యలు మరింత తీవ్రమవుతాయి.

బోర్లా పడుకున్నప్పుడు ముఖం తలగడకు ఒత్తుగా తగులుతూ ఉంటుంది. దీని వల్ల చర్మంపై ముడతలు త్వరగా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం ఉన్నవారిలో ఈ ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చు. ఈ విధంగా పడుకున్నప్పుడు ఛాతీపై ఒత్తిడి పడటం వల్ల శ్వాస కొంచెం కష్టంగా అనిపించవచ్చు. కొన్ని సందర్భాల్లో శ్వాస లోతుగా తీసుకోవడం తగ్గిపోవచ్చు, ముఖ్యంగా ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఇది అనుకూలం కాదు.

అయితే వైద్యులు తెలుపుతున్న ప్రకారం.. వెల్లకిలా లేదా ఎడమవైపు తిరిగి పడుకోవడం పడుకోవడమే ఉత్తమమని అంటున్నారు. వెల్లకిలా నిద్రించడం వల్ల వెన్నెముకను సహజ స్థితిలో ఉంచుతాయి. అలాగే జీర్ణక్రియకు కూడా సహాయపడుతుంది. బోర్లా పడుకునే అలవాటు ఉన్నవారు ఒక్కసారిగా మార్చలేరు. కానీ వెల్లకిలా పడుకొన్నవారు క్రమంగా పక్కకు తిరిగి పడుకోవడం అలవాటు చేసుకోవచ్చు. అంతేకాకుండా సరైన దిండు, మంచం ఉపయోగించడం ద్వారా కూడా నిద్ర నాణ్యత మెరుగుపడుతుంది.

ఇక ఎడమ వైపునకు తిరిగి పడుకోవడం వల్ల ఆహారం కడుపు నుంచి ప్రేగులకు సులభంగా చేరుతుంది. దీంతో జీర్ణక్రియ సాఫీగా జరుగుతుంది. ముఖ్యంగా రాత్రి భోజనం చేసిన తర్వాత ఇలా పడుకుంటే అజీర్ణం, గ్యాస్ సమస్యలు తగ్గే అవకాశముంది. ఎడమవైపు పడుకోవడం వల్ల కడుపులోని ఆమ్లం పైకి ఎక్కే అవకాశం తగ్గుతుంది. దీంతో ఛాతీలో మంట, ఆమ్ల రిఫ్లక్స్ వంటి సమస్యలు తగ్గుతాయి. గ్యాస్ట్రిక్ సమస్యలు ఉన్నవారికి ఇది చాలా ఉపయోగకరం. గుండెపై ఒత్తిడి తక్కువగా ఉంటుంది. రక్తప్రసరణ సక్రమంగా జరుగుతుంది. ముఖ్యంగా గర్భిణీలకు ఇది మరింత ప్రయోజనకరం, ఎందుకంటే శిశువుకు రక్తప్రవాహం మెరుగవుతుంది. శరీరంలో ఉన్న టాక్సిన్స్‌ను తొలగించడంలో లింఫాటిక్ సిస్టమ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఎడమవైపు పడుకోవడం వల్ల ఈ ప్రక్రియ మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

S. Vas Chaimuchata
S. Vas Chaimuchatahttps://oktelugu.com/
Srinivas is a Senior content writer who has good knoeledge in the field of Auto mobile, General, Business and lifestyle news. He covers all kind of general news content in our website.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Exit mobile version