Aadhaar Card Latest Benefits: ప్రస్తుత రోజుల్లో ఆధార్ కార్డ్ చాలా ఇంపార్టెంట్. ఏ పని కోసమైనా దీనిని ఉపయోగించాల్సిందే. అయితే ఈ ఆధార్ కార్డును ఎప్పటికప్పుడు అప్డేట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆధార్ కార్డును అప్డేట్ చేసుకోవాలని అనుకునేవారికి భారతీయ ప్రత్యేక గుర్తింపు ప్రాధికార సంస్థ (Unique Identification Authority of India (UIDAI)) శుభవార్త తెలిపింది. అదేంటో చూద్దాం..
ఆధార్‌లో కొన్ని విషయాలను మార్చుకోవాలంటే సెంటర్ కు వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఈమెయిల్ చిరునామాను అప్‌డేట్ చేసుకునేందుకు ప్రస్తుతం వసూలు చేస్తున్నారు. రూ.75 సేవా రుసుమును 6 నెలలపాటు పూర్తిగా మాఫీ చేస్తున్నట్లు ప్రకటించింది. ఈ నిర్ణయం వల్ల దేశవ్యాప్తంగా కోట్లాది ఆధార్ హోల్డర్లకు ప్రయోజనం కలగనుంది. ప్రస్తుతం ఆధార్ మొబైల్ యాప్ ద్వారా ఈమెయిల్ ఐడీని జోడించాలన్నా, మార్చాలన్నా వినియోగదారులు రూ.75 చెల్లించాల్సి వస్తోంది. అయితే UIDAI తాజా నిర్ణయం ప్రకారం వచ్చే నెల 1వ తేదీ నుంలటచి డిసెంబర్ 31 వరకు ఈ సేవను పూర్తిగా ఉచితంగా అందించనుంది. దీంతో ఆధార్ వివరాలను సులభంగా నవీకరించుకునే అవకాశం లభిస్తుంది.
అయితే ఈ ఉచిత సేవ కేవలం ఆధార్ మొబైల్ యాప్ ద్వారా చేసే అప్‌డేట్లకే వర్తిస్తుందని UIDAI స్పష్టం చేసింది. ఆధార్ సేవా కేంద్రాలు లేదా ఇతర ఆఫ్‌లైన్ విధానాల ద్వారా ఈమెయిల్ అప్‌డేట్ చేయించుకుంటే సాధారణ ఛార్జీలు కొనసాగుతాయి. అందువల్ల వినియోగదారులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు.
ఆధార్‌తో ఈమెయిల్ చిరునామా లింక్ చేసి ఉంచడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఆధార్‌కు సంబంధించిన ముఖ్యమైన నోటిఫికేషన్లు, అప్‌డేట్‌ల సమాచారం, ధృవీకరణ సందేశాలు నేరుగా ఈమెయిల్‌కు చేరుతాయి. దీంతో ఆధార్ ఖాతా భద్రత కూడా మెరుగుపడుతుంది. ముఖ్యంగా మొబైల్ నంబర్ మారిన సందర్భాల్లో కూడా ఈమెయిల్ ద్వారా సమాచారం అందుకునే అవకాశం ఉంటుంది.
డిజిటల్ సేవలను మరింత ప్రోత్సహించడమే ఈ నిర్ణయం వెనుక ప్రధాన ఉద్దేశమని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ మంది వినియోగదారులు తమ ఆధార్ వివరాలను సకాలంలో అప్‌డేట్ చేసుకునేలా చేయడంతో పాటు, డిజిటల్ ప్లాట్‌ఫారమ్‌ల వినియోగాన్ని పెంచేందుకు UIDAI ఈ ప్రత్యేక సడలింపును తీసుకొచ్చినట్లు తెలుస్తోంది.
ఆధార్‌లో ఇప్పటికీ ఈమెయిల్ చిరునామా నమోదు చేయని వారు లేదా పాత ఈమెయిల్ ఉపయోగిస్తున్న వారు ఈ అవకాశాన్ని వినియోగించుకోవడం మంచిదని అధికారులు సూచిస్తున్నారు. డిసెంబర్ 31 వరకు ఉచితంగా ఈమెయిల్ అప్‌డేట్ చేసుకునే అవకాశం ఉండటంతో వినియోగదారులు ముందుగానే తమ వివరాలను ధృవీకరించుకోవాలని సూచిస్తున్నారు.
