Relationship : భర్త ఫ్రెంచ్ ఫ్రైస్ తినవద్దన్నాడని.. విడాకుల కోసం కోర్టును ఆశ్రయించిన భార్య

ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం భర్తపై కేసు నమోదు చేసి విడాకులు కోరడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన మంచి కోసం ఆలోచించే భర్త కోసం భార్య ఆలోచించడం లేదని అంటున్నారు. ఇలాంటి సిల్లీ రీజన్స్‌కి కూడా కోర్టు మెట్లు ఎక్కడం ఏంటని నవ్వుకుంటున్నారు.

Written By: Chai Muchhata, Updated On : August 24, 2024 10:36 pm

A wife approached the court for divorce because her husband refused to eat French fries

Follow us on

Relationship : గొడవలు అన్నాక ఏ బంధంలో అయిన సర్వసాధారణమే. అందులోనూ భార్యాభర్తలు మధ్య అంటే తప్పకుండా గొడవలు ఉంటాయి. కొంతమంది వీటిని పట్టించుకోకుండా వదిలేస్తారు. కానీ మరికొందరు అయితే చిన్న గొడవను పెద్దవిలా చేసి విడాకుల వరకు తీసుకెళ్తారు. ఈ మధ్య కాలంలో చాలామంది జంటల్లో గొడవలు చిన్న విషయాలకే జరుగుతున్నాయి. భర్త చీర కొనలేదని, భార్య వంట చేయలేదని ఇలా చిన్న చిన్న విషయాలకే కోర్టు మెట్టులెక్కుతున్నారు. అందులోనూ మహిళలు అయితే చిన్న విషయాలకు గొడవలు పెద్దగా చేసుకుని పోలీసు స్టేషన్‌ను ఆశ్రయిస్తున్నారు. సిల్లీ రీజన్స్‌తో కేసులు పెట్టడంతో పోలీసులు కూడా ఆశ్చర్యపడుతున్నారు. ఇదిలా ఉండగా తాజాగా ఓ భార్య తన భర్తపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. భార్య ఏ కారణం మీద పోలీసులకు ఫిర్యాదు చేసిందో తెలిస్తే పక్కా షాక్ అవుతారు. ఇంతకీ ఆమె ఏ కారణం మీద ఫిర్యాదు చేసిందో తెలియాలంటే స్టోరీ వెంటనే చదివేయండి.

బెంగళూరుకు చెందిన ఓ మహిళ తన భర్తపై విచిత్రమైన కేసు పెట్టింది. తన భర్త తనను వేధిస్తున్నాడని గృహ హింస కింద పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. తన భర్త తనను ఫ్రెంచ్ ఫ్రైస్ తినవద్దు అంటున్నాడని ఆమె కేసు పెట్టింది. కేవలం పౌష్టికాహారం, పండ్లు, పాలు వంటివి మాత్రమే తీసుకోమని అంటున్నాడు. ఇందుకే అతనిపై కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపింది. ఈ రీజన్ విని పోలీసులతో పాటు అందరూ షాక్ అయ్యారు. ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ తినవద్దు అన్నాడని భర్తపై గృహ హింస చట్టం కింద కేసు నమోదు చేయడం ఏంటని ఆమెను తిడుతున్నారు. భర్త కూడా తన మంచి కోసమే చెప్పాడు కదా అని అంటున్నారు. అయితే తన భర్త ఎందుకు తనకు ఫ్రెంచ్ ఫ్రైస్ తినవద్దని అన్నాడంటే? ఆమె ఈ మధ్యనే డెలివరీ అయ్యింది. మసాలా, ఫ్రెంచ్ ఫ్రైస్ వంటివి తినడం వల్ల తల్లితో పాటు బిడ్డకు కూడా అనారోగ్య సమస్యలు వస్తాయని భర్త అవి తినవద్దన్నాడు. కానీ భార్య అవి అర్థం చేసుకోకుండా అతనిపై కేసు పెట్టంంది.

ఇలాంటి సిల్లీ రీజన్ మీద కేసు నమోదు చేయడం కరెక్ట్ కాదని.. దానిని రద్దు చేయాలంటూ ఆమె భర్త కోర్టును ఆశ్రయించాడు. దీంతో కర్ణాటక కోర్టు ఆ వాదనలను తప్పుపట్టింది. భార్య ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని తినవద్దు అనడం కరెక్టే. తన మంచి కోసం చెబుతుంటే తిరిగి అతని మీదే కేసు పెట్టడం సరికాదని న్యాయమూర్తి తెలిపారు. అతనిపై నమోదైన కేసులపై న్యాయమూర్తి స్టే విధించారు. ప్రస్తుతం ఈ వార్త సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతుంది. ఎందుకంటే ఫ్రెంచ్ ఫ్రైస్ కోసం భర్తపై కేసు నమోదు చేసి విడాకులు కోరడం ఏంటని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. తన మంచి కోసం ఆలోచించే భర్త కోసం భార్య ఆలోచించడం లేదని అంటున్నారు. ఇలాంటి సిల్లీ రీజన్స్‌కి కూడా కోర్టు మెట్లు ఎక్కడం ఏంటని నవ్వుకుంటున్నారు.