SIM Card Rules: మాయల పకీరు ప్రాణం చిలకలో ఉన్నట్లు.. ఎన్ని వేల మొబైల్ అయినా.. వంద రూపాయల సిమ్ కార్డు లేకపోతే దానికి వాల్యూ ఉండదు. నేటి కాలంలో మొబైల్ లేని చేతులు కనిపించవు. తక్కువ, ఎక్కవ ధరల్లో తేడా ఉంటాయి.కానీ మొబైల్ మాత్రం తప్పనిసరిగా ఉంటుంది. పర్సనల్ అవసరాలతో పాటు కార్యాలయాలు, వ్యాపారులు ఇలా ప్రతి అవసరానికి మొబైల్ తప్పనిసరి అవుతుంది. ఈ మొబైల్ లో సిమ్ కార్డు కీలకంగా ఉంటుంది. ఒకప్పుడు సిమ్ కార్డు కావాలంటే ప్రాసెస్ పెద్దగా ఉన్నా.. ఇష్టమొచ్చినన్ని కార్డులు మార్చే వారు. ఆ తరువాత ఫేక్ ఐడీలు సృష్టించి నకిలీ సిమ్ కార్డులు తీసుకున్నారు.దీనిని నివారించడానికి టెలికాం రంగం కొత్త నిబంధనలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇవి డిసెంబర్ 1 నుంచి అమల్లోకి రానున్నాయి. ఆవేంటంటే?
మొబైల్ లో సిమ్ కావాలంటే ఒకప్పుడు అప్లికేషన్ తో పాటు కొన్ని ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉండేది. ఇవి ఇచ్చిన కొన్ని రోజులకు సిమ్ కార్డు ఇచ్చేవారు. అయితే చాలా మంది మోసాలకు పాల్పడేవారు ఫేక్ ఐడీలు సృష్టించి నకిలీ సిమ్ లు తీసుకునేవారు. సిమ్ లు విక్రయం చేసేవారు సైతం తమ సేల్స్ పెరగాలన్న ఉద్దేశంతో ధ్రువ పత్రాలను పెద్దగా పరిశీలించేవారు. దీంతో చాలా మంది ఒకరి పేరు మీద మరొకరు సిమ్ కార్డులు తీసుకొనేవారు. ఆ తరువాత డిజిటల్ ద్వారా సిమ్ కార్డులు జారీ చేసినా ఒక్కొక్కరు పదుల కొద్ది సిమ్ కార్డులు తీసుకొనేవారు. సిమ్ కార్డుల విక్రయానికి పెద్దగా పరిమితులు లేకపోవడంతో ఇష్టమొచ్చినట్లు విక్రయించేవారు.
ఈ నేపథ్యంలో కొందరు తాము సిమ్ కార్డు తీసుకోకున్నా తమ పేరు మీద ఇతరులు సిమ్ కార్డులు తీసుకొని మోసాలకు పాల్పడ్డారు. ఈ పరిస్తితిని గమనించి కేంద్ర టెలికాం రంగం సిమ్ కార్డుల జారీ విషయంలో కొన్ని నిబంధనలను తీసుకొచ్చింది. వాస్తవానికి వీటిని అక్టోబర్ నెలలోనే అమలు చేస్తామని ప్రకటించారు. కానీ కొన్ని కారణాల వల్ల వాయిదా వేసి డిసెంబర్ 1 నుంచి అమలు చేస్తామని తెలిపారు. ఇంతకీ ఆ నిబంధనలు ఎలా ఉన్నాయంటే..
సిమ్ కార్డు విక్రయించే షాపు వారు ముందుగా వివరాలతో రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ పూర్తియిన తరువాత టెలికాం ఆపరేటర్ వెరిఫికోషన్ కోసం వస్తారు. వెరిఫికేషన్ కోసం వచ్చినప్పుడు నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.10 లక్షల వరకు జరినామా విధిస్తారు. అలాగే సిమ్ కొనుగోలు చేసే వారు సైతం ఒక ఐడెంటిటీ కార్డు పై 9 మాత్రమే సిమ్ కార్డులు పొందాల్సి ఉంటుంది. అలాగే తనకు సంబంచిని నంబర్ పై సేవలు నిలిచిపోతే 90 రోజుల్లో ఆ నెంబర్ వేరే వ్యక్తికి ఇస్తారు. ఒక నెంబర్ వేరే వ్యక్తికి వెళ్లిన తరువాత పాత వినియోగదారుడికి ఎలాంటి అధికారం ఉండదు.