Homeజాతీయ వార్తలుTelangana Elections 2023: గెలుపోటముల దోబూచులాట : కూడికలు.. తీసివేతలు.. లెక్కలేసుకుంటున్న బీఆర్‌ఎస్‌

Telangana Elections 2023: గెలుపోటముల దోబూచులాట : కూడికలు.. తీసివేతలు.. లెక్కలేసుకుంటున్న బీఆర్‌ఎస్‌

Telangana Elections 2023: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ తుది అంకానికి చేరింది. కీలక ఘట్టమైన పోలింగ్‌ ముగిసింది. అభ్యర్థుల భవితవ్వం ఈవీఎంలో నిక్షిప్తమైంది. స్ట్రాంగ్‌ రూంలలో భద్రంగా ఉంది. ఈనెల 3న ఓటరు తీర్పు వెల్లడవుతుంది. ఈ క్రమంలో పోలింగ్‌ ముగియడంతో అన్ని పార్టీలు కూడికలు, తీసివేతలతో కుస్తీ పడుతున్నాయి. తమకు అనుకూల, వ్యతిరేక ఓట్లను లెక్కలు వేసుకుంటూ ఎక్కడ ప్లస్, ఎక్కడ మైనస్‌ గెలుస్తామా ఓడుతామా, మెజారిటీ ఎంత అని సమీక్ష చేసుకుంంటున్నారు. అధికార బీఆర్‌ఎస్‌ పార్టీ ఈ లెక్కల్లో రాత్రి నుంచే నిమగ్నమైంది. నియోజకవర్గాల్లోని మండలాలవారీగా పోలైన ఓట్ల వివరాలపై ఆరాతీస్తూ గెలుపునకు కావాల్సిన మేజిక్‌ ఫిగర్‌పైనా కూడికలు, తీసివేతలు చేస్తున్నారు. ఇతర పార్టీల ప్రభావం ఏమేరకు ఉందనే అంశాలను తెలుసుకుంటున్నారు. ఎన్ని నియోజకవర్గాల్లో గెలుపు అవకాశాలు ఉన్నాయనే అంచనా వేస్తున్నారు. మరోవైపు ఎగ్జిట్‌ పోల్స్‌ సర్వేలను సైతం విశ్లేషిస్తున్నారు.

వారూం ఇన్‌చార్జీలతో..
ఒక్కో నియోజకవర్గంలోని మండలాలు, గ్రామపంచాయతీలు, మేజర్‌ గ్రామపంచాయతీల వారీగా పోలింగ్‌ శాతంపై పార్టీ అధిష్టానం లెక్కలు తెప్పించుకుంటోంది. ఇప్పటికే కొన్ని నియోజకవర్గాల వివరాలను తెప్పించుకున్నట్లు సమాచారం. మరోవైపు నియోజకవర్గాల వార్‌రూం ఇ¯Œ చార్జీలతోనూ పోలింగ్‌పై సమీక్షిస్తోంది. ఏ గ్రామంలో ఎన్ని పోలింగ్‌ బూత్‌లు ఉన్నాయి? ఆ గ్రామంలో ఉన్న ఓట్లు, పోలైన ఓట్ల వివరాలను సేకరిస్తున్నారు. గతంలో బీఆర్‌ఎస్‌కు ఆధిక్యం ఉన్న గ్రామాల వివరాలను సైతం పరిశీలిస్తున్నారు. ప్రస్తుత పరిణామాలు, నెలకొన్న పరిస్థితులు తదితర అంశాలను సైతం తెలుసుకుంటున్నట్లు సమాచారం. ప్రస్తుతం పోలైన ఓట్లతో ఏమేరకు బీఆర్‌ఎస్‌కు పడ్డాయని లెక్కలు వేస్తున్నారు.

గ్రామాల వారీగా
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీఆర్‌ఎస్‌ పార్టీ ప్రతి గ్రామానికి ఇచ్చిన ఎన్నికల ఖర్చుపైనా సమగ్ర నివేదిక ఇవ్వాలని నేతలను ఆదేశించినట్లు సమాచారం. ఎంతమంది ఓటర్లను కలిశారు.. ఎవరికైనా తాయిలాలు ఇస్తే వారి వివరాలు లెక్కలతో సహా ఇవ్వాలని పేర్కొన్నట్లు తెలిసింది. గ్రామంలో నేతల పనితీరుసైతం ఎన్నికల లెక్కింపు రోజు స్పష్టం కానుంది. వారి పనితీరు ఆధారంగానే ఇప్పటికే పదవుల హామీలు ఇచ్చినట్లు సమాచారం. పోలింగ్‌ బూత్‌కు పార్టీ ఇ¯Œ చార్జిని బాధ్యుడిని చేస్తామని హెచ్చరికలు జారీ చేసినట్లు విశ్వసనీయ సమాచారం. అందులో భాగంగానే గ్రామంలో ఎన్ని ఓట్లు పడతాయని లెక్కలు వేసుకుంటున్నారు.

13 సమస్యాత్మక నియోజకవర్గాలు
రాష్ట్రంలోని 13 సమస్యాత్మక నియోజకవర్గాలు గుర్తించారు. మంచిర్యాల, చెన్నూరు, బెల్లంపల్లి, సిర్పూర్, ఆసిఫాబాద్, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, కొత్తగూడెం, అశ్వారావుపేట, భద్రాచలం ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో పోలింగ్‌ పైనా గులాబీ అధిష్టానం ఆరా తీసింది. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ, అభివృద్ధి, ఇచ్చిన హామీలతో ఎన్ని నియోజకవర్గాల్లో గెలుస్తామనే లెక్కల్లో నిమగ్నమైంది. ఇప్పటికే పలు నియోజకవర్గాలపై క్లారిటీ వచ్చినట్లు సమాచారం.

గెలుపోటముల దోబూచులాట..
పోలింగ్‌ విశ్లేషణలో గులబీ నేతలకు కొత్త గుబులు పట్టినట్లుల తెలుస్తోంది. గెలుపు ఖాయం అనుకున్న నియోజకవర్గాల్లో వ్యరేకంగా ఓట్లు రాగా, ఓడిపోయే సీట్లలో అనుకూలంగా ఓట్లు పోలయ్యాయని గుర్తించారు. దీంతో గెలుపోటములు చాలా నియోజకవర్గాల్లో బీఆర్‌ఎస్‌తో దోబూచులాడుతుందని అంచనాకు వచ్చారు.

తటస్తులపై ఆశలు..
రాష్ట్రంలోని తటస్థ ఓటర్లపైనే బీఆర్‌ఎస్‌ ఆశలు పెట్టుకుంది. గెలుపు తమదేనంటూ నేతలు సైతం కేడర్‌కు భరోసా ఇస్తున్నారు. క్రితంసారి వచ్చిన పోల్‌ పర్సంటేజీ వస్తుందని ఆశిస్తున్నారు. వలస వెళ్లిన వారిని స్వగ్రామాలకు తరలించి ఓటు వేయించడంతో పాటు గ్రామంలో ఉన్న తటస్థులను సైతం ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. వారికి తాయిలాలు ఇచ్చి మరీ ఓటు వేయించినట్లు ప్రచారం జరుగుతున్నది. దీంతో గట్టెక్కుతామని బీఆర్‌ఎస్‌ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.

పోలింగ్‌పై గులాబీ బాస్‌ నజర్‌..
అసెంబ్లీ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా గులాబీ అధినేత కేసీఆర్‌ పక్కా వ్యూహాలు రచించారు. అందుకు అనుగుణంగా ప్రచారసరళి చేపట్టారు. గురువారం ఎన్నికల పోలింగ్‌ సరళిపై పరిశీలన చేశారు. గంటగంటకు సర్వే రిపోర్ట్‌ తెప్పించుకుని ఏ జిల్లాలో తక్కువ పోలింగ్‌ నమోదైంది, అందుకు గల కారణాలు ఏమిటి అనేది అడిగి తెలుసుకున్నట్లు సమాచారం. కేడర్‌కు సైతం పోలింగ్‌ శాతం పెంచేలా పలు సూచనలు ఇచ్చినట్లు తెలిసింది.

40 శాతం ఓట్లు?
2018లో బీఆర్‌ఎస్‌ పార్టీకి 46.8 శాతం ఓట్లు వచ్చాయి. అయితే ఈసారి అలాగే వచ్చే అవకాశం ఉందని ఆ పార్టీ అధిష్టానం ధీమా వ్యక్తం చేస్తున్నది. పోలింగ్‌ ఒకటిæ రెండు శాతం తగ్గినా ప్రభుత్వానికి ఢోకాలేదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నది. బీఆర్‌ఎస్‌కు ఉన్న ఓటు బ్యాంకు మాత్రం మరో పార్టీకి బదిలీ కాలేదని, ప్రభుత్వ పథకాలతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారని పార్టీ నేతలు పేర్కొంటున్నారు. ఈసారి కూడా బీఆర్‌ఎస్‌కు 40 శాతానికి పైగా ఓట్లు వస్తాయనే ధీమాతో ఉన్నారు.

Ashish D
Ashish Dhttps://oktelugu.com/
Ashish. D is a senior content writer with good Knowledge on Telangana politics. He is having rich experience in journalism writing analytical stories on latest political trends.
RELATED ARTICLES

Most Popular