Children addicted to social media
Children : సెల్‌ఫోన్ ఇప్పుడు ప్రతీ మనిషికి నిత్యావసర వస్తువుల అయింది. ప్రపంచమంతా సెల్‌ఫోన్‌లోనే ఇమిడి ఉంటోంది. ఇక మనీ ట్రాన్‌జాక్షన్స్, మెయిల్స్, మెస్సేజ్‌లు, సమాచారం పంపడం, ఫోన్ చేయడం ఇలా అన్నీ సెల్‌ఫోన్‌తోనే. దీంతో పెద్దల నుంచి పిల్లల వరకు అందరూ సెల్‌ఫోన్‌తో సంబంధం కలిగి ఉంటున్నారు. ఇక పిల్లలు పాలు తాగడం, భోజనం చేయడం, చదువుకోవడం ఇలా అన్ని కార్యక్రమాలు ఫోన్‌తోనే చేస్తున్నారు. దీంతో పెద్దలకన్నా పిల్లలే ఎక్కువగా సెల్‌ఫోన్‌తో అటాచ్ అయి ఉంటున్నారు. దీంతో సెల్ వ్యసనం ముదిరి ఇప్పుడు సోషల్ బానిసలుగా మారుతున్నారు. చాలా మంది సోషల్ మీడియా మోజులో చిక్కుకుపోయారు. 14–16 ఏళ్ల వయసువారు 82 శాతం మంది స్మార్ట్ ఫోన్లకు, సోషల్ మీడియాకు బానిసయ్యారు.
అధ్యయనంలో షాకింగ్ నిజాలు..
యాన్యువల్ స్టేటస్ ఆఫ్ ఎడ్యుకేషన్ రిపోర్ట ప్రకారం.. దేశంలో 82 శాతం మంది పిల్లలు సెల్‌ఫోన్‌కు, సోషల్ మీడియాకు ఇప్పటికే బానిసయ్యారు. వయసులవారీగా పరిశీలిస్తే 14 ఏళ్ల వయసులో 79 శాతం మంది, 15 ఏళ్ల వయసులో 82.2 శాతం మంది, 16 ఏళ్ల వయసులో 82.5 శాతం మంది సోషల్ మీడియాలో మునిగి తేలుతున్నట్లు నివేదిక తెలిపింది. వీరు చదువుకు సంబంధించిన విషయాలకన్నా.. ఇతర విషయాల కోసమే ఎక్కువగా సెల్‌ఫోన్ వినియోగిస్తున్నట్లు నివేదిక తెలిపింది.
బాలురే స్మార్ట్
ఇక సెల్‌ఫోన్ వినియోగం, సోషల్ మీడియా వినియోగంలో బానిసలు బాలికల కన్నా బాలురే ఎక్కువగా ఉన్నారని ఏఎస్‌ఈఆర్ వెల్లడించింది. రాష్ట్రంలో 96 శాతం మంది బాలకలు ఇళ్లలో స్మార్ట్‌ఫోన్లు చూస్తున్నట్లు తేలింది. ఇక సామాజిక మాద్యమాల నుంచి రక్షణ పొందే విషయంలో విద్యార్థులకు అవగాహన కూడా బాగానే ఉందని తెలిపింది. ఖాతాను బ్లాక్ చేయడపై 67.2 శాతం మంది, పాస్‌వర్డ్ మార్చడంపై 62 శాతం, ప్రొఫైల్ గోప్యంగా ఉంచడంపై 60.8 శాతం మందికి అవగాహన ఉన్నట్లు నివేదిక తెలిపింది.
చదువు కోసం…
ఇక చదువు కోసం స్మార్ట్ ఫోన్ వాడుతున్న విద్యార్థులు 61.1 శాతం మంది ఉన్నారు. ఇందులో బాలురు 60.7 శాతం ఉండగా, బాలికలు 61.5 శాతం ఉన్నారు. విద్యార్థుల్లో 34.3 శాతం మందికి సొంత స్మార్ట్ ఫోన్ ఉన్నాయి. బాలురలో 39 శాతం మందికి బాలికల్ల 29 శాతం మందికి స్మార్ట్ ఫోన్లు ఉన్నాయి. వయసుల వారీగా పరిశీలిస్తే.. 16 ఏళ్ల వయసులో 46.3 శాతం, 15 ఏళ్ల వయసులో 29 శాతం, 14 ఏళ్ల వయసులో 31.11 శాతం మంది సెల్‌ఫోన్ కలిగి ఉన్నారు. ఇక విద్యార్థుల్లో 88.6 శాతం మంది యూట్యూబ్‌లో వీడియోలు వీక్షిస్తున్నారు. 89 శాతం మంది అలారమ్ కోసం, 84.4 శాతం మంది సమాచార సేకరణ కోసం స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు.
దుష్పరిణామాలు..
1. శారీరక ఆరోగ్యం: ఎక్కువ సమయం ఫోన్ చూస్తూ ఉండటం వల్ల చూపు సమస్యలు, మెడ నొప్పులు, నిద్రలేమి వంటి ఆరోగ్య సమస్యలు రావచ్చు.
2. అధ్యయనంపై ప్రభావం: ఫోన్ వాడకం వల్ల చదువు మీద ప్రతికూల ప్రభావం పడుతుంది, ఎందుకంటే పిల్లలు వేరే దేన్నైనా చేయాలనుకుంటారు, ముఖ్యంగా గేమ్స్, సోషల్ మీడియా లేదా వీడియోలు చూసేందుకు.
3. సామాజిక సంబంధాల లోపం: ఎక్కువ ఫోన్ వాడడం వల్ల పిల్లలు కుటుంబ సభ్యులతో, స్నేహితులతో మాట్లాడడం తగ్గించుకుంటారు. ఇది వారి సామాజిక నైపుణ్యాలపై ప్రతికూల ప్రభావం చూపుతుంది.
4. మనసిక ఆరోగ్యం: సోషల్ మీడియా ద్వారా కుంగిపోయే భావనలు, ఒత్తిడి మరియు ఆత్మవిశ్వాసం తగ్గిపోవడం జరుగుతుంది.